సప్తపది: సమాజంలో కట్టుబాట్లు, ఛాంధస భావాలు బలంగా ఉన్న ఆరోజుల్లోనే కళాతపస్వి కె.విశ్వనాథ్ తెగించి తీసిన కళాఖండం సప్తపది. ఈ సినిమా ద్వారా సమాజంలో ఉన్న అసమానతల్ని ఎత్తిచూపారు విశ్వనాథ్. కేవలం కులాల ప్రస్తావన మాత్రమే కాకుండా అప్పటికే పెళ్లయిన యువతికి మరో పెళ్లి చేయాలనే హేతువాద ఆలోచన కూడా ఈ సినిమాలో ఉంది. ఇది 41ఏళ్ల నాటి సినిమా అంటే ఇప్పటికీ నమ్మలేరు ప్రజలు. ఇప్పుడున్న జనరేషన్లో సామాజీక అంశంతో వస్తున్న సినిమాలు ఎంతగానో వ్యతిరేకత మూటగట్టుకుంటుండగా.. ఈ కథను ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా విశ్వనాథ్ నడిపిన తీరు అద్భుతం. Image credits Shalimar cinema
సిరివెన్నెల : తనను మానసికంగా చాలా బాధపెట్టిన సినిమా మాత్రం సిరివెన్నెల అంటారు విశ్వనాథ్. అసలు ఒక మాటలు రాని అమ్మాయి ఏంటి, కళ్ళు కనబడని అబ్బాయి ఏంటి, వారిద్దరి మధ్య సన్నివేశాలు క్రియేట్ చేయడానికి తాను రాత్రి పగలు కష్టపడడం ఎందుకని ఈ సినిమా మేకింగ్ టైమ్‌లో చాలా బాధ పడ్డారట. ఆయన కష్టానికి ప్రతిఫలంగా సిరివెన్నెల సినిమా తెలుగుతెరపై ఒక క్లాసిక్ హిట్‌గా నిలిచిపోయింది. ఇందులోని పాటు ఇప్పటికీ జనం గుండెల్లో మారుమోగుతూనే ఉన్నాయి. Image source Volga videos
స్వర్ణకమలం: 1988లో వెంకటేష్ హీరోగా భానుప్రియ హీరోయిన్గా వచ్చిన సినిమా స్వర్ణకమలం. ఇది ఫీమేల్ ఓరియెంటెడ్ సబ్జెక్టున్న సినిమా. తండ్రి నుంచి వచ్చిన గొప్ప సాంప్రదాయక నృత్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ డబ్బులు సంపాదించడం కోసం గాలి మెడలు కడుతున్న ఓ అమ్మాయిని సరైన లక్ష్యం వైపు నడిపిస్తాడు వెంకటేష్. ఇందులో వెంకటేష్ పెయింటింగులు వేసుకునే సామాన్య కుర్రాడి పాత్రలో మెప్పించారు. Image source Mango indian films
స్వాతికిరణం: స్వాతికిరణం సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో మమ్ముట్టి, రాధికాశరత్ కుమార్ ముఖ్యమైన పాత్రలో నటించారు. 1992లో కె విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో తన నటనతో మమ్ముట్టి తెలుగు ప్రేక్షకులను మెప్పించాడు. Image source Mango indian films
స్వయంకృషి: ఖైదీ, కొండవీటి రాజా, అడవిదొంగ, పసివాడి ప్రాణం లాంటి బ్లాక్ బస్టర్స్‌తో నెంబర్ వన్ పొజిషన్‌కి ఎదుగుతున్న పూర్తిగా తన కమర్షియల్ సర్కిల్ నుంచి బయటకు వచ్చి చేసిన సినిమా స్వయంకృషి. ఈ సినిమా చిరంజీవిని సరికొత్తగా ఆవిష్కరించడమే కాకుండా.. ప్రయోగాలతో కూడా చిరంజీవి సక్సెస్ కొట్టగలరని నిరూపించింది. అప్పటివరుకు మాస్ ఇమేజ్ ఉన్న ఓ హీరోని క్లాస్‌గా అద్భుతంగా చూపించడం కేవలం విశ్వనాథ్‌కే చెల్లింది. Image credits Shalimar cinema
సాగరసంగమం: డైరెక్షన్ స్థాయి గురించి చెప్పాలంటే ఆ సినిమా గురించి చెప్పాలి. కె విశ్వనాధ్ , ఏడిద నాగేశ్వరరావు , కమలహాసన్ కలయికలో పూర్ణోదయా పతాకంపై నిర్మిచించిన ఈ చిత్రం అన్ని భాషల్లో ఆఖండ విజయం సాధించింది . నేటి మేటి దర్శకులెందరికో స్ఫూర్తి ఈ చిత్రం. ఈ సినిమా సగటు ప్రేక్షకుడిని ఎంతగానో ఆకట్టుకుంటుంది.ఈ సినిమాలో నటన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. Image taken from wikipedia