రజినీకాంత్ గత పాతికేళ్లుగా ఎంట్రీ ఇస్తున్నట్టు వార్తలు వచ్చినా.. ఈ సారి రావడం మాత్రం పక్కా అని చెప్పారు రజినీకాంత్. తాజాగా తలైవా రాజకీయ పార్టీ స్థాపించబోతున్నట్టు ప్రకటించారు. డిసెంబర్ 31న రాత్రి కొత్త పార్టీ పేరును అనౌన్స్ చేయనున్నట్టు చెప్పారు. రజినీకాంత్ కంటే ముందు రాజకీయ పార్టీలు పెట్టిన హీరోలు ఇంకెవరు ఉన్నారంటే.. (Twitter/Photo)
రజినీకాంత్ గత పాతికేళ్లుగా ఎంట్రీ ఇస్తున్నట్టు వార్తలు వచ్చినా.. ఈ సారి రావడం మాత్రం పక్కా అని చెప్పారు రజినీకాంత్. తాజాగా ఈ రోజు పార్టీ స్థాపించబోతున్నట్టు ప్రకటించారు. డిసెంబర్ 31న రాత్రి కొత్త పార్టీ పేరును అనౌన్స్ చేయనున్నట్టు చెప్పారు. దీంతో రజినీకాంత్ అభిమానులు లుండీ డాన్స్ చేస్తున్నారు. 70 ఏళ్ల వయసులో రజినీకాంత్ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనున్నాడు. (File/Photo)
పార్టీ స్థాపించిన వ్యక్తుల్లో హీరోలే కాదు.. హీరయిన్ విజయశాంతి కూడా ఉంది. బీజేపీ పార్టీతో రాజకీయ అరంగేట్రం చేసిన విజయశాంతి.. 2009లో తల్లి తెలంగాణ పార్టీ స్థాపించారు. ఆ తర్వాత విజయశాంతి తల్లి తెలంగాణ పార్టీని టీఆర్ఎస్ పార్టీలో విలీనం చేసారు. ఆ తర్వాత టీఆర్ఎస్ తరుపున మెదక్ లోక్సభకు ఎన్నికయ్యారు. ఇపుడు కాంగ్రెస్ పార్టీ సభ్యురాలిగా కొనసాగుతున్నారు. త్వరలో బీజేపీలో చేరుతారంటూ ప్రచారం జరుగుతోంది.
పవన్ కళ్యాణ్ గురించి కొత్తగా ఏం చెప్పాలి. ఈయన తన సినిమా కెరీర్ కాదనుకుని 2014లో జనసేన పార్టీ స్థాపించారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ,టీడీపీ కూటమి మద్దతు తెలిపి ఎన్నికల్లో పోటీ చేయలేదు. 2019 ఎన్నికల్లో బీఎస్పీ, వామపక్షాలతో కలిసి ఏపీలో పోటీకి దిగాడు. ఈ ఎన్నికల్లో జనసేన ఎలాంటి ప్రభావం చూపించలేకపోయింది. కేవలం ఒకే ఒక్క సీటుకే పరిమితం అయింది. పవన్ కళ్యాణ్ పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయారు.(File/Photo)
విజయ్ కాంత్ కూడా అప్పట్లో తనకంటూ సొంత పార్టీ పెట్టుకున్నాడు. సినిమాల్లో సంచలన విజయాలు అందుకున్న ఈయన.. 2005లో దేశీయ ముర్పేక్కు ద్రవిడ కజగం (DMDK)పార్టీని స్థాపించారు. రాజకీయాల్లోనూ కీలక పాత్ర పోషించాడు. ఇప్పుడు ఆరోగ్యం సహకరించడం లేదు. ఈ ఎన్నికల్లో ఈయన పార్టీ బీజేపీ, అన్నాడీఎంకే పార్టీ పొత్తులో భాగంగా 4 ఎంపీ సీట్లలో పోటీ చేసి ఒక సీటు కూడా గెలవలేకపోయింది.
ఒకప్పటి తమిళం గ్లామర్ హీరో కార్తీక్ కూడా 2006లో రాజకీయాల్లో ప్రవేశించి తన లక్ పరీక్షించుకున్నారు. ఐనా ఒరిగిందేమి లేదు. 2009లో అహిలా ఇండియా నాడలుమ్ మక్కల్ కచ్చి అనే పార్టీ స్థాతపించారు. ఈయన పార్టీ తమిళనాడులో పెద్దగా ప్రభావం చూపించలేదు. (Ahila India Naadalum Makkal Katchi). ఆ తర్వాత 2018లొ మనిత ఉరైమైగల్ కాక్కుమ్ కచ్చి అనే రాజకీయ పార్టీ స్థాపించారు. ( Manitha Urimaigal Kaakkum Katchi on 15 December 2018). ఎక్కడా పెద్దగా ప్రభావం చూపించలేదు. (Twitter/Photo)
కమల్ హాసన్ కూడా సినిమాలతో పాటు రాజకీయాల్లోనూ బిజీగా మారిపోయారు. 2018 ఫిబ్రవరి 21న ఈయన ‘మక్కల్ నీది మయ్యమ్’ స్థాపించారు. ఆ పార్టీ తరుపున తమిళనాడులోని 39 లోక్సభ సీట్లకు పోటీ చేసారు. ఆ ఎన్నికల్లో కమల్ పార్టీ ఎలాంటి ప్రభావం చూపించలేకపోయింది. కానీ వచ్చే యేడాది తన పుట్టినరోజును సీఎంగా చేసుకుంటానని మొన్న బర్త్ డే రోజున ప్రకటించారు కమల్ హాసన్. (Twitter/Photo)
తన తండ్రి ఎస్.ఏ.చంద్రశేఖర్ తన పేరిట పొలిటికల్ పార్టీ కోసం కేంద్ర ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేసిన విషయాన్నిహీరో విజయ్.. ఈ సందర్భంగా ప్రస్తావిస్తూ.. తన తండ్రి తన పేరిట పెట్టబోతున్న పార్టీకి తనకు ఎలాంటి సంబంధం లేదంటూ వ్యాఖ్యానించారు. ఐనా.. విజయ్ పొలిటిక్ ఎంట్రీకి ఇవ్వబోతున్నట్టు చెప్పకనే చెప్పాడు. (File/Photo)