మాజీ విశ్వసుందరి, బాలీవుడ్ భామ సుస్మితా సేన్ తరచుగా వార్తల్లో నిలుస్తోంది. 46 ఏళ్ళు వచ్చినా ఆమె వివాహం చేసుకోలేదు. ఇద్దరు పిల్లల్ని దత్తత తీసుకుని జీవితం సాగిస్తున్నారు. నిత్యం సుస్మిత సేన్ మాత్రం వార్తల్లో హాట్ టాపిక్‌గా మారుతుంటాయి. ఇక, లేటెస్ట్ గా ఐపీఎల్ సృష్టికర్త లలిత్ మోదీతో డేటింగ్ లో ఉంది సుస్మితా. ఈ విషయాన్ని లలిత్ స్వయంగా ట్వీట్ ద్వారా తెలిపారు. అయితే.. లలిత్ మోదీ కంటే ముందు ఈ నటి చాలా మంది తారలతో డేటింగ్ చేసింది. ఆమె, ప్రేమ జీవితం గురించి ఓ లుక్కేద్దాం. (Photo Credit: Instagram@sushmitasen47@rohmanshawl@lalitkmodi)
రోహ్మన్ షాల్: గత కొంత కాలంగా సుస్మితా సేన్ తనకన్నా వయసులో చాలా చిన్నవాడైన రొహ్మన్ షాల్ అనే యువకుడితో సహజీవనం చేసింది. కొన్నిరోజుల క్రితమే డిసెంబర్ 3న తామిద్దరం విడిపోతున్నట్లు ప్రకటించారు. బ్రేకప్ అవ్వడంతో వీరిద్దరి డేటింగ్ రిలేషన్ షిప్ కి బ్రేక్ పడింది. సహజీవనం చేస్తున్న టైంలో సుస్మితా సేన్, రొహ్మన్ ఇద్దరూ చెట్టాపట్టాలేసుకుని విదేశాల్లో విహరించారు. వెకేషన్స్ లో ఎంజాయ్ చేశారు. కానీ మనస్పర్థల వల్ల ఇద్దరూ విడిపోయారు. కుర్రవాళ్ళతో రిలేషన్ షిప్ బాలీవుడ్ లో కొత్తేమి కాదు.(Photo Credit: Instagram@sushmitasen47)