Bandla Ganesh : నటుడు, నిర్మాత బండ్ల గణేష్ గురించి తెలుగు వారికి ప్రత్యేకించి పరిచయం చేయాల్సిన పనిలేదు. కమెడియన్‌గా కంటే బండ్ల గణేష్ (Bandla Ganesh) నిర్మాతగా ఓ రేంజ్లో అదరగొట్టారు. దాదాపుగా ఆయన తీసిన అన్ని సినిమాలు మంచి విజయాన్ని అందుకున్నాయి. అంతేకాదు ప్రీరిలీజ్ ఈవెంట్లలో మాట్లాడూ.. తన మాటలతో ఉన్న ఫాలోయింగ్‌ను సంపాదించారు. Photo : Twitter
దీనికి తోడు పవన్ కళ్యాణ్ భక్తుడిగానూ గుర్తింపు ఉంది. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు బండ్ల గణేష్ వీరాభిమాని. ఆయన తనకు దైవంతో సమానం అని ఎన్నోసార్లు చెప్పుకొచ్చాడు. గతంలో ఆయన నిర్మాతగా పవన్ కళ్యాణ్‌తో 'తీన్ మార్','గబ్బర్ సింగ్' వంటి సినిమాలు వచ్చాయి. తీన్ మార్ సినిమా ఫ్లాప్ అయిందని పవన్ పిలిచి మరీ బండ్ల గణేష్ కు 'గబ్బర్ సింగ్' సినిమాకు అవకాశం ఇచ్చాడని ఎపుడు చెబుతుంటాడు. Photo : Twitter
అది అలా ఉంటే ట్వి్ట్టర్లో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే బండ్ల తాజాగా త్రివిక్రమ్‌పై సంచలన ట్విట్ చేశారు. ఈ మధ్యన త్రివిక్రమ్ తన సినిమాల మీద కన్నా, సినిమాలు సెట్ చేయడం మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారనే టాక్ ఉంది. ఈ నేపథ్యంలో ట్విట్టర్లో ఓ ఎవరో బండ్ల గణేష్‌ను నిర్మాత కావాలని వుంది అని అడిగితే.. Photo : Twitter
దానికి బండ్ల ఇచ్చిన సమాధానం ఇస్తూ.. గురూజీని కలవండీ.. భారీ గిఫ్ట్ ఇవ్వండి.. నెరవేరుతుందని ట్వీట్ చేశారు. అయితే ఇండస్ట్రీలో గురూజీ అనగానే గుర్తుకు వచ్చే పేరు త్రివిక్రమ్ దే కావడంతో ఈ ట్వీట్‌ను త్రివిక్రమ్‌పై వేశావు కదా అంటూ రకరకాల మీమ్స్ తో కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. ఇక మరో నెటిజన్ కామెంట్ చేస్తూ.. గురూజీకి కథ చెపితే స్ర్రీన్‌ప్లే రాసి దానికి తగట్టు మళ్ళీ కథను మార్చి అనుకున్న కథను షెడ్‌కు పంపిస్తాడటగా అనే ట్వీట్‌కు బదులిస్తూ..అదే కాదు భార్యాభర్తల్ని, తండ్రి కొడుకుల్ని, గురుశిష్యుల్ని, ఎవర్నైనా వేరు చేస్తాడు.. మన గురూజీ స్పెషాలిటీ అంటూ కామెంట్ చేశాడు. చూడాలి మరి ఈ ట్వీట్‌పై త్రివిక్రమ్ ఎలా స్పందిస్తారో.. Photo : Twitter
కమెడియన్ గా తెలుగు ప్రేక్షకులకు చేరువై ఆ తర్వాత నిర్మాతగా మారిన బండ్ల గణేష్ నిత్యం ఏదో ఒక రకంగా వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. సినీ, రాజకీయ విషయాలపై ఆయన చేస్తున్న కామెంట్స్ దుమారం రేపుతుంటాయి. పలు కాట్రవర్సీల్లో వేలుపెడుతూ ఓపెన్ అయ్యే బండ్లన్న.. రీసెంట్గా మరో సంచలన ట్వీట్ చేశారు.. Photo : Twitter
మరోసారి రాజకీయాల్లోకి రానున్నట్లు అధికారికంగా ప్రకటించారు బండ్ల గణేష్. నా రాజకీయ భవిష్యత్తుపై త్వరలో నిర్ణయం తీసుకుంటా అని ట్వీట్ చేశారు. రాజకీయాలంటే నిజాయితీ రాజకీయాలంటే నీతి రాజకీయాలంటే కష్టం రాజకీయాలంటే పౌరుషం రాజకీయాలంటే శ్రమ రాజకీయాలంటే పోరాటం ఇవన్నీ ఉంటేనే రాజకీయాల్లోకి చేరాలి రావాలి అందుకే వస్తా.. అని ఆయన పేర్కొన్నారు. Photo : Twitter
బానిసత్వానికి భాయ్ భాయ్ నిజాయితీతో కూడిన రాజకీయాలకి జై జై.. నీతిగా నిజాయితీగా నిబద్ధతగా ధైర్యంగా పౌరుషంగా పొగరుగా రాజకీయాలు చేస్తా అంటూ బండ్ల గణేష్ చేసిన ట్వీట్స్ జనాల్లో డిస్కషన్ పాయింట్ అయింది. ఇంతకీ బండ్లన్న జనసేనలోకి వెళతారా? లేక కాంగ్రెస్ జెండా పడతారా అనే విషయం చర్చల్లోకి వచ్చింది. Photo : Twitter
నిజానికి పవన్ కళ్యాణ్ అంటే పడిచచ్చిపోయే బండ్ల గణేష్.. ఆయనే తన దేవుడు అంటూ ఎన్నోసార్లు పొగిడారు. దీంతో పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన లోకి బండ్లన్న ఎంట్రీ ఉంటుందని కొందరు భావించారు. 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు పొత్తుల గురించి పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్న తర్వాత బండ్లన్న ఈ ట్వీట్స్ పెట్టడం విశేషం. Photo : Twitter
అంతకుముందు తెలంగాణ రాజకీయాల్లోకి వచ్చి '7 O క్లాక్ బ్లేడ్' డైలాగ్‌తో బండ్లన్న ఎంతో ఫేమస్ అయ్యారు. కాంగ్రెస్ అధికారంలోకి రాకుంటే 7 O క్లాక్ బ్లేడ్ తో గొంతు కోసుకుంటా అని ఛాలెంజ్ చేసి.. తీరా ఓడిపోయాక కాంగ్రెస్ పార్టీ వీడి బయటకొచ్చారు. మరోవైపు వీలు కుదిరిన ప్రతిసారి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ప్రశంసలు గుప్పిస్తూ ఆయన్ను ఆకాశానికెత్తుతుంటారు బండ్ల గణేష్. రీసెంట్ గా యాదాద్రి అభివృద్ధి చూసి కూడా సీఎం కేసీఆర్ పై పాజిటివ్ కామెంట్స్ చేశారు బండ్లన్న. చూడాలి మరి చివరకు ఏ పార్టీలో చేరుతారో.. Photo : Twitter