ఆకాష్ పూరి హీరోగా వస్తున్న చోర్ బజార్ అనే సినిమా వస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా జూన్ 24న విడుదలకానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన ప్రిరిలీజ్ ఈవెంట్ తాజాగా జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చిన బండ్ల గణేష్.. పూరీ జగన్నాథ్‌పై, ఆయన భార్య లావణ్యపై పలు ఆసక్తికర కామెంట్స్ చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. Photo : Twitter
చోర్ బజార్ ఈవెంట్లో బండ్ల గణేష్ మాట్లాడుతూ.. పూరి స్టార్ అయ్యాక చాలామంది వచ్చారు కానీ ముందు వచ్చింది ఈ మహాతల్లే (పూరీ వైఫ్). సక్సెస్ అయ్యాక ఎన్నో రాంప్ లు, వాంప్ లు వస్తుంటాయ్ పోతుంటాయ్.. అంటూ ఒక్కసారిగా బాంబ్ పేల్చారు. ఇంకా ఆయన పూరి గురించి మాట్లాడుతూ.. సొంత కొడుకు సినిమా ఫంక్షన్‌కు రాకపోతే ఎట్లా.. మనం ఏం సంపాదించినా వారి కోసమే.. ఓ సామెత ఉంటుంది. దేశమంతా కళ్ళాపు జల్లాడు కానీ ఇంటి ముందు కళ్ళాపు జల్లడానికి టైం లేదు. ఎవరెవరినో స్టార్లని చేసావ్.. డ్యాన్స్ లు రాని వాళ్లతో డ్యాన్స్ లు చేయించావ్, డైలాగులు చెప్పడం రాని వాళ్ళతో డైలాగులు చెప్పించావ్. Photo : Twitter
ఎంతో మందిని స్టార్లని చేసావ్, సూపర్ స్టార్లని చేసావ్. నీ కొడుకు సినిమాకి వచ్చేసరికి ఎక్కడికో వెళ్లి కూర్చున్నావు. ఇది నా కొడుకు సినిమా ఫంక్షన్ అయ్యి ఉంటే కనుక నేను ఎక్కడ ఉన్న స్పెషల్ ఫ్లైట్ వేయించుకుని మరీ వచ్చేవాడిని అంటూ చురకలు అంటించారు బండ్ల. ఆయన ఇంకా మాట్లాడుతూ మనం ఎంత సంపాదించినా వాళ్ళ కోసమే. మనం పోతే తలకొరివి పెట్టాల్సింది వాళ్ళే. అంతేకాదు మనం పోతే మన అప్పులు తీర్చాల్సింది వాళ్ళే.. అంటూ చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. Photo : Twitter
ఇంకా పూరీ భార్య లావణ్య గురించి మాట్లాడుతూ... మా వదిన అంటే నాకు ఎంతో ఇష్టం. ఒక అమ్మ ఎలా ఉండాలి అంటే లావణ్య గారిలా ఉండాలి, ఒక అక్క ఎలా ఉండాలి అంటే లావణ్య గారిలా, ఒక భార్య ఎలా ఉండాలి అంటే లావణ్య గారిలా ఉండాలి. సీతా దేవిని నేను చూడలేదు కానీ సీతా దేవికి ఉన్నంత ఓపిక ఉంది ఆమకు అంటూ మాట్లాడారు. Photo : Twitter
పూరి గారు పెద్ద డైరెక్టర్ అవుతాడనో లేక భూమి బద్దలు కొడతాడనో ఆమె పెళ్లి చేసుకోలేదు. పూరి సక్సెస్ అయ్యాక చాలా మంది స్టార్లు వచ్చారు. కానీ ముందుగా వచ్చింది ఆమెనే. నీ కొడుకు సినిమా ఫంక్షన్ కు వచ్చే టైం లేదా నీకు.. చరకలు అంటించారు బండ్ల. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. Photo : Twitter
ఇక చోర్ బజార్ విషయానికి వస్తే.. ఆకాష్ పూరీ (Akash Puri ) హీరోగా నటిస్తున్న సినిమా ‘‘చోర్ బజార్’’(Chor Bazaar). గెహన సిప్పీ నాయికగా నటిస్తున్నారు. దళం, జార్జ్ రెడ్డి సినిమాలతో తన మార్కు క్రియేట్ చేసుకున్న జీవన్ రెడ్డి (Jeevan Reddy) ఈ సినిమాను తెరకెక్కించారు. ఐ.వి ప్రొడక్షన్స్ పతాకంపై వీ.ఎస్ రాజు (VS Raju) నిర్మించిన ఈ సినిమా యూవీ క్రియేషన్స్ (UV Creations) సమర్పణలో వస్తోంది. Photo : Twitter
లవ్ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న "చోర్ బజార్" సినిమా ట్రైలర్ ఇటీవల బాలకృష్ణ చేతులమీదుగా విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. మంచి బజ్‌లో వస్తున్న ఈ సినిమా జూన్ 24న విడుదలకానుంది. దీంతో ప్రమోషన్స్‌లో ఇప్పటికే పలు పాటలు కూడా విడుదలై మంచి ఆదరణ పొందాయి. ఇక తాజాగా ఈ సినిమా సెన్సార్‌ను పూర్తి చేసుకుంది. దీనికి సంబంధించి సినిమా టీమ్ ఓ పోస్టర్‌ను విడదుల చేసింది. ఈ చిత్రం సెన్సార్ కంప్లీట్ చేసుకున్నట్టుగా తెలిపారు. ఈ చిత్రానికి యూ / ఏ సర్టిఫికెట్ వచ్చినట్లు తెలిపారు. Photo : Twitter
ఇక ఈ చిత్రానికి సురేష్ బొబ్బొలి సంగీతం అందించారు. జూన్ 24న ఈ చిత్రాన్ని ప్రముఖ బ్యానర్ యూవీ క్రియేషన్స్ రిలీజ్ చేస్తోంది. ఇక ఈ‘‘చోర్ బజార్’’ సినిమాలోని 'బచ్చన్ సాబ్ ఫ్యాన్ ఆంథమ్' లిరికల్ సాంగ్ (Bachchan Saab Fan anthem)ను ఆయన ఇటీవల విడుదల చేశారు. 'బచ్చన్ సాబ్ ఫ్యాన్ ఆంథమ్' బాగుందని, ‘‘చోర్ బజార్’’ సినిమా హిట్ అవ్వాలని ఆయన విషెస్ తెలిపారు. 'బచ్చన్ సాబ్ ఫ్యాన్ ఆంథమ్' పాటను మదీన్ ఎస్కే స్వరకల్పనలో మిట్టపల్లి సురేందర్ సాహిత్యాన్ని అందించగా మంగ్లీ పాడారు. Photo : Twitter
ఇక పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరీ గత సినిమా రొమాంటిక్ మూవీ బాక్సాఫీస్ దగ్గర పర్వాలేదనిపించింది. ఈ చిత్రాన్ని పూరీ జగన్నాథ్ నిర్మాణంలో అనిల్ పాదూరి దర్శకత్వం వహించారు. మాఫియా నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా యూత్ ఆడియన్స్‌ను అలరించింది. ఈ సినిమాలో రమ్యకృష్ణ మరో ముఖ్యపాత్రలో నటించారు. Photo : Twitter
చోర్ బజార్ సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే.. సినిమాటోగ్రఫీ - జగదీష్ చీకటి, సంగీతం - సురేష్ బొబ్బిలి, ఎడిటింగ్ - అన్వర్ అలీ, ప్రభు దేవా, ఆర్ట్ - గాంధీ నడికుడికర్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ : ప్రియదర్శన్ బాలసుబ్రహ్మణ్యం సౌండ్ డిజైనర్ : సాయి మనీందర్ రెడ్డి, ఆడియో - లహరి, కాస్ట్యూమ్స్ డిజైనర్ - ప్రసన్న దంతులూరి, ఫైట్స్ - ఫృథ్వీ శేఖర్, కొరియోగ్రఫీ - భాను, పబ్లిసిటీ డిజైనర్ - అనిల్ భాను , స్టిల్స్ : వికాస్ సీగు, పి.ఆర్.వో - జీఎస్కే మీడియా, మేకప్ - శివ, కాస్ట్యూమ్ చీఫ్ - లోకేష్, డిజిటల్ మీడియా - వాల్స్ అండ్ ట్రెండ్స్, సహ నిర్మాత - అల్లూరి సురేష్ వర్మ, బ్యానర్ - ఐ.వి ప్రొడక్షన్స్, నిర్మాత - వీ.ఎస్ రాజు, రచన, దర్శకత్వం - బి. జీవన్ రెడ్డి. Photo : Twitter