Bandla Ganesh: తెలుగు సినీ నటుడు, ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ పరిచయం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సినిమాలలో నటుడిగా కంటే పవన్ వీరాభిమానిగా మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. ఈయన పవన్ కు చూపించే అభిమానం మాత్రం మాటల్లో చెప్పలేనిది. ఎక్కడికి వెళ్ళినా ముందు పవన్ ను తలుచుకున్నాకే తను చెప్పాలనుకున్నది చెబుతాడు. ఇదిలా ఉంటే తాజాగా ఓంకార్ హోస్టింగ్ చేస్తున్న సిక్స్త్ సెన్స్ షోలో బండ్ల గణేష్ తన కూతురు తో గెస్ట్ గా పాల్గొన్నాడు. అక్కడ కూడా పవన్ గురించి తెగ పొగిడాడు. ఇక తన కూతురికి రెండు కోరికలు ఉన్నాయని తెలిపాడు. తన కూతురికి 18 ఏళ్లు అంటూ.. ఈ 18 ఏళ్లలో తనను రెండు ప్రశ్నలు అడిగిందట. పవన్ కళ్యాణ్ తో మళ్లీ బ్లాక్ బస్టర్ సినిమా ఎప్పుడు తీస్తావని.. ఓంకార్ షో కి తను వెళ్ళినప్పుడు తనను కూడా తీసుకెళ్ళని అనడంతో అందుకే తన కూతురిని తీసుకువచ్చానని చెప్పుకొచ్చాడు బండ్ల గణేష్.