ఒకప్పుడు తన పేరుతో బాలీవుడ్ బాక్సాఫీస్‌లను షేక్ చేసిన షారుఖ్ ఖాన్..ఇపుడు తన ఉనికి కోసం పోరాడుతున్నారు. దాదాపు ఏడేళ్ల క్రితం ‘చెన్నై ఎక్స్‌ప్రెస్’ సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్నారు. ఈ సినిమా అప్పట్లోనే రూ.400 కోట్లను వసూలు చేసి బాలీవుడ్లో హిస్టరీని క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే కదా. (Twitter/Photo)
షారుఖ్ ఖాన్, అట్లీ కాంబినేషన్లో తెరకెక్కబోతున్న ఈ చిత్రానికి బాలకృష్ణ నటించిన ఓల్డ్ టైటిల్‌ను ఫిక్స్ చేసారట. ఈ చిత్రంతో నయనతార కథానాయికగా బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనుంది. మరో హీరోయిన్గా ప్రియమణి దాదాపు ఖరారైంది. తాజాగా ఈ మూవీ యూనిట్ సంత్ తుకారామ్ నగర్ మెట్రో స్టేషన్లో షూటింగ్ నిమిత్తం అనుమతి కోరుతూ ఓ లేఖ రాసారు. (Twitter/Photo)
ఈ లేఖలో ఈ సినిమాకు ‘లయన్’ అనే టైటిల్‌తో ఖరారు చేసారు. గతంలో బాలకృష్ణ.. ఇదే టైటిల్‌తో ఓ సినిమా చేసిన సంగతి తెలిసిందే కదా. మొత్తంగా షారుఖ్ ఖాన్.. బాలయ్య టైటిల్‌తో సినిమా చేయడంపై నందమూరి ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి బాక్సాఫీస్ దగ్గర ’లయన్’ టైటిల్‌తో గర్జించలేకపోయారు బాలకృష్ణ. మరి ఇపుడు షారుఖ్ ఈ టైటిల్‌తో హిట్ అందుకుంటారా లేదా అనేది చూడాలి. (File/Photo)