Balakrishna - Nani : నందమూరి నటి సింహాం ఇపుడ సినిమాలతో పాటు ‘Unstoppable With NBK’ అంటూ టాక్ షో చేస్తోన్న సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే మొదలైన ఈ షో ఫస్ట్ ఎపిసోడ్‌కు మోహన్ బాబు గెస్ట్ హాజరయ్యారు. ఈ షోకు ఆడియన్స్ నుంచి మంచి ఫీడ్ బ్యాక్ వచ్చింది. తాజాగా బాలయ్య.. రెండో ఎపిపోడ్‌ను నాచురల్ స్టార్ నానితో టాక్ షో నిర్వహించారు. ఈ షోలో నాని, బాలయ్య సరదగా చెప్పుకున్న కబుర్లు ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగించాయి. (Twitter/Photo)
ఈ షోలో బాలయ్య ఎవరికి జీవితం వడ్డించిన విస్తరి కాదు. మన ప్రయత్నానికి మనమే నారు పోసి.. నీరు పెట్టి.. కోత కోసి.. కుప్ప నూర్చి.. ఆ వరిని ఉడికించి మనమే వడ్డించుకోవాలి అపుడే జీవితం స్వర్గం అన్నారు. ఈ సందర్భంగా నాని గురించి మాట్లాడుతూ.. ఈ రోజు మన గెస్ట్ నా వయసు నటుడు కాదు. నా లాంటి నటుడు కాదు. అతని తాతలు, తండ్రులు సినిమా వాళ్లు కాదు. తన తీరు వీరు.. తన సినిమాలు వేరు. అతని మీతో పెరిగాడు. మీ నుంచి వచ్చాడు. సెల్ఫ్ మేడ్‌కు సర్ నేమ్ నాచురల్ స్టార్ నాని ఇంట్రడ్యూస్ చేయడం ఆసక్తి కలిగించింది. ఒక స్టార్ హీరో వారసుడిగా బాలయ్య.. తన జూనియర్ హీరో గురించి చెప్పడాన్ని అందరు మెచ్చుకుంటున్నారు. (Twitter/Photo)
మరోవైపు నా సినిమాల్లో నచ్చని.. రాడ్ రంబోలా సినిమా ఏంటి అన్న ప్రశ్నకు నాని.. పలనాటి బ్రహ్మనాయుడు’ సినిమా పేరు చెప్పారు. దీనికి బాలయ్య.. ట్రెయిన్ ఎపిపోడ్ అంటూ చూపించడం.. దానికి ఈ సినిమా టూ మచ్ ఎక్స్‌పెక్టేషన్స్‌తో వచ్చిన సినిమా అది. అందులో సర్ఫ్రైజింగ్ ఎలిమెంట్స్ ఎక్కువైపోయాయన్నారు. ఈ సందర్భంగా నానిని బాలయ్య.. నువ్వు నాచురల్ స్టార్ అయితే.. నేనెంటి అన్న బాలయ్య ప్రశ్నకు ఏదో అలా వచ్చేసిందన్నారు. మొత్తంగా ఈ షో గూస్ బంప్స్ అనే విధంగా ప్రేక్షకులను కిక్ ఎక్కించిందనే చెప్పాలి. (Twitter/Photo)