అంతేకాదు....అప్పట్లో నందమూరి బాలకృష్ణ అప్పటి టాప్ హీరోలెవరు చేయడని సాహాసాన్ని చేసారు. ఆయన యాక్ట్ చేసిన ‘నిప్పురవ్వ’, ‘బంగారు బుల్లోడు’ సినిమాలను ఒకే రోజు రిలీజ్ చేసారు. ఆ రూట్లోనే హీరో నాని కూడా ఆయన యాక్ట్ చేసిన ‘ఎవడే సుబ్రమణ్యం’, ‘జెండాపై కపిరాజు’ చిత్రాలను సేమ్ డే నే రిలీజ్ చేసారు. (Twitter/Photo)
ఇలా నాచురల్ స్టార్ నాని.. బాలయ్య షోకు రాక ముందే.. నందమూరి నట సింహాన్ని పలు విషయాలను ఫాలో అయ్యారు. మరి ఈ షోలో నాని బాలయ్యతో ఎలాంటి విషయాలను పంచుకుంటారనేది అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ ఎపిసోడ్.. ఈ నెల 12న శుక్రవారం ‘ఆహా’లో స్ట్రీమింగ్ కానుంది. ఈ షో కోసం నానితో కలిసి బాలయ్య చిన్న పిల్లాడిలా మారిపోయారు. (Twitter/Photo)