అంతేకాదు....అప్పట్లో నందమూరి బాలకృష్ణ అప్పటి టాప్ హీరోలెవరు చేయడని సాహాసాన్ని చేసారు. ఆయన యాక్ట్ చేసిన ‘నిప్పురవ్వ’, ‘బంగారు బుల్లోడు’ సినిమాలను ఒకే రోజు రిలీజ్ చేసారు. ఆ రూట్లోనే హీరో నాని కూడా ఆయన యాక్ట్ చేసిన ‘ఎవడే సుబ్రమణ్యం’, ‘జెండాపై కపిరాజు’ చిత్రాలను సేమ్ డే నే రిలీజ్ చేసారు. అప్పట్లో నిప్పురవ్వ యావరేజ్‌గా నిలిస్తే.. ‘బంగారు బుల్లోడు’ చిత్రం బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచింది. అదే రూట్లో నాని ‘జెండాపై కపిరాజు’ సినిమా ఫ్లాప్ అయితే.. ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ హిట్ అనిపించుకుంది. (Twitter/Photo)
గతేడాది నాచురల్ స్టార్ నాని.. బాలయ్య షోలో ఎంతో హుషారుగా సందడి చేశారు. రాక ముందే.. నందమూరి నట సింహాన్ని పలు విషయాలను ఫాలో అయ్యారు. మరి ఈ షోలో ముఖ్యంగా బాలయ్య చెప్పిన చూడు ఒకవైపు చూడు అన్న డైలాగును తనదైన శైలిలో చెప్పి మెప్పించారు. మరోవైపు నాని యాక్ట్ చేసిన ‘ఈగ’ సినిమాలోనాని చెప్పిన డైలాగును బాలయ్య తనదైన స్టైల్లో చెప్పి మెప్పించారు. (Twitter/Photo)
ఈ షోలో బాలయ్య సినిమాల్లో తనకు ఇష్టమైన సినిమా సింగీతం శ్రీనివాస రావు దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఆదిత్య 369’ సినిమా పేరు చెప్పారు. ఒకవేళ హాలీవుడ్ క్లాసిక్ ‘గాడ్ ఫాదర్’ మూవీని రీమేక్ చేస్తే బాలయ్య మార్లన్ బ్రాడ్ పాత్ర చేస్తే.. నేను Al Pacino పాత్ర చేస్తానని చెప్పారు. ఇక ‘గాడ్ ఫాదర్’ సినిమా విషయానికొస్తే.. అమితాబ్ బచ్చన్ ‘సర్కార్’ సహా ఈ సినిమా స్పూర్తితో ఎన్నో చిత్రాలు వివిధ భాషల్లో తెరకెక్కాయి. (Twitter/Photo)
తాాజాగా నాని హీరోగా నటించిన ‘అంటే సుందరానికీ’ మూవీని కూడా బాలయ్యతో లింక్ చేసారు. ఈ సినిమాను నందమూరి నట సింహా బాలయ్య పుట్టినరోజైన జూన్ 10న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ సినిమాలో నాని బ్రాహ్మణ యువకుని పాత్రలో నటించారు. గతంలో బాలయ్య కూడా ‘అశోక చక్రవర్తి’ సినిమాలో బ్రాహ్మణ యువకుడి పాత్రలో నటించారు. ఇంకోవైపు ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ప్రస్తుతం ఈ ప్రొడక్షన్ హౌస్ బాలయ్య 107వ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ రకంగా బాలయ్యను ఎన్ని రకాలుగా వాడుకోవాలో అన్ని రకాలుగా వాడుకుంటున్నారు నాని. (Twitter/Photo)