Balakrishna - Ravi Teja : టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సీనియర్ టాప్ హీరో నందమూరి బాలకృష్ణకు, మాస్ మహారాజ్ రవితేజకు మధ్య గత కొన్నేళ్లుగా ఏదో విషయమై గొడవ నడుస్తోందనే టాక్ నడిచింది. తాజాగా బాలయ్య అన్‌స్టాపబుల్ షోలో రవితేజ గెస్ట్‌గా వచ్చారు. ఈ సందర్భంగా తమ మధ్య ఎలాంటి గొడవలు లేవని క్లారిటీ ఇచ్చారు. తాజాగా బాలయ్య.. ఓ విషయంలో రవితేజను అస్సలు విడిచిపెట్టడం లేదు. (Twitter/Photo)
ఇండస్ట్రీలో ఒక్కసారి రూమర్ వచ్చిందంటే అది చిలికి చిలికి గాలివానలా మారుతుంది. చివరికి చిన్న నిప్పురవ్వ అడవిని అంతా కాల్చేసినట్లు కార్చిచ్చు అవుతుంది. బాలకృష్ణ, రవితేజ విషయంలో కూడా ఇదే జరిగింది. ఈ ఇద్దరి హీరోల మధ్య అప్పుడెప్పుడో 15 ఏళ్ళ కింద ఓ హీరోయిన్ విషయంలో గొడవ జరిగిందనే వార్తలు ఇండస్ట్రీలో వినిపిస్తాయి. అప్పట్లో రవితేజను పిలిచి బాలయ్య వార్నింగ్ ఇచ్చినట్లు సోషల్ మీడియాలో ఇప్పటికీ కుప్పలు తెప్పలుగా వార్తలు కనిపిస్తాయి.తాజాగా అలాంటి వార్తలకు వీళ్లిద్దరు పులిస్టాప్ పెట్టారు. తమ మధ్య ఎలాంటి గొడవలు జరగలేదని క్లారిటీ ఇచ్చారు. (Twitter/Photo)
వీళ్లిద్దరు మంచి స్నేహితులనే విషయం అన్‌స్టాపబుల్ షోతో ఆడియన్స్‌తో పాటు ఇరు హీరోల అభిమానులకు ఓ క్లారిటీ అయితే వచ్చింది. కానీ అదేందో కానీ.. ఎప్పుడూ బాలయ్య, రవితేజ సినిమాలే బాక్సాఫీస్ దగ్గర పోటీకి వస్తుంటాయి. ఒక్కోసారి ముందు రవితేజ తన సినిమాలను అనౌన్స్ చేస్తే.. ఆ తర్వాత బాలయ్య వస్తుంటారు. మరోసారి బాలకృష్ణ తన సినిమా విడుదల తేదీ ఖరారు చేసిన తర్వాత తన సినిమాలను తీసుకొస్తుంటారు మాస్ రాజా.
అనిల్ రావిపూడి తర్వాత దర్శకుడు సంపత్ నందితో బాలయ్య తన నెక్ట్స్ ప్రాజెక్ట్ ఓకే చేసారు. ఈయన కూడా రవితేజతో ‘బెంగాల్ టైగర్’ మూవీని చేసిన సంగతి తెలిసిందే కదా. తాజాగా సంపత్ నంది.. సీటీమార్ సినిమాతో తనలోని యాక్షన్ యాంగిల్ ను టాలీవుడ్ కు పరిచయం చేసారు. ఈ విషయాన్ని సంపత్ నంది స్వయంగా వెల్లడించడం విశేషం. అయితే సంపత్ నంది వేములవాడ దేవాలయానికి వెళ్లి స్క్రిప్ట్ కాపీని శ్రీ రాజ రాజేశ్వర స్వామి పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు తెలిపాడు. (Twitter/Photo)
పైసా వసూల్ ఫ్లాప్ అయినా కూడా పూరీ అంటే బాలయ్యకు ఎనలేని యిష్టం. ఇందులో బాలయ్య యాక్టింగ్ అంటే ఆడియన్స్‌కు యిష్టం. అందుకే టీవీలో ఎప్పుడొచ్చినా రేటింగ్ కూడా బాగానే వస్తుంటుంది. తాజాగా పూరీ జగన్నాథ్.. బాలయ్యతో ఓ ప్యాన్ ఇండియా మూవీ తెరకెక్కించడానికి రెడీ అవుతున్నారు. సంక్రాంతి రోజు.. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి అఫీషియల్ ప్రకటన వెలుబడే అవకాశం ఉంది. ఈయన కూడా రవితేజతో దాదాపు 5 సినిమాలు తెరకెక్కించిన సంగతి తెలిసిందే కదా. (Twitter/Photo)