బాలకృష్ణ అన్‌స్టాపబుల్ షోలో ప్రేక్షకులకు అంతగా తెలియని విషయాలను ఈ షోకు విచ్చేసే గెస్ట్ నుంచి రాబడుతూ మరింత ఆసక్తి రేకిస్తున్నారు. తాజాగా ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న సంక్రాంతి ఎపిసోడ్లో విజయ్ దేవరకొండ, పూరీ జగన్నాథ్, ఛార్మి సహా లైగర్ టీమ్ మెంబర్స్‌ను తన శైలిలో ఇంటర్వ్యూ చేసి మరింత ఆసక్తి రేకెత్తించారు. (Twitter/Photo)
అన్ స్టాపబుల్ ఓటీటీ షో ద్వారా నందమూరి బాలకృష్ణ ఎంత ఫేమస్ అయ్యారో తెలిసిందే. బాలయ్య తన యాటిట్యూడ్ కు భిన్నంగా, ఎంతో ఫ్రీ స్పిరిట్ తో చేస్తున్నఈ టాక్ షో, చాలా పెద్ద సూపర్ హిట్ అయ్యింది. ప్రతి వారం ఈ షోలో ఎవరు గెస్ట్‌గా వస్తారా అని ఆడియన్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ షోలో విజయ్ దేవరకొండను ఉద్ధేశించి నువ్వు రౌడీ అయితే.. నేను రౌడీ ఇన్స్పెక్టర్ ని. అసలు నీకు రౌడీ అనే ట్యాగ్ ఎలా వచ్చిందనే విషయాన్ని అడిగారు. Twitter/Photo)
[caption id="attachment_1153166" align="alignnone" width="1600"] ఈ సందర్భంగా కాలేజీ రోజుల్లో భూషణ్ అనే వ్యక్తి చేతిలో బాక్సింగ్‌లో దెబ్బలు తిన్న విషయాన్ని ప్రస్తావించారు. ఇక ఈ షోలో బాలయ్య.. విజయ్ దేవరకొండను ఉద్దేశిస్తూ.. తన ఫస్ట్ మూవీ ఏమిటో చెప్పమని అడగగా.. దానికి విజయ్ దేవరకొండ సమాధానం చెప్పలేకపోయారు. ఇక ప్రేక్షకుల్లో నుంచి ‘తాతమ్మ కల’ అని ఎవరో చెప్పారు. దానికి విజయ్ దేవరకొండ.. ‘తాతమ్మ కథ’ అని చెప్పి నవ్వులు పూయించారు. (Twitter/Photo)
ఈ సందర్భంగా పూరీ జగన్నాథ్‌ను ఉద్దేశిస్తూ..నేను చూపించిన ఓ బాల నటుడిని నువ్వు తీశే సినిమాలో తీసుకుంటావా అంటూ ఓ చైల్డ్ ఆర్టిస్ట్‌ను చూపించారు. ఇక బాలయ్య చూపించిన బాల నటుడు విజయ్ దేవరకొండనే కావడం విశేషం. చిన్పపుడు విజయ్.. పుట్టపర్తి సాయి బాబాకు చెందిన స్కూల్లో చదువుకున్నాను. అక్కడే ‘షిరిడి సాయి పర్తి సాయి’ సీరియల్ షూటింగ్ జరుగుతోంది. ఈ సందర్భంగా కొంచెం లావుగా బొద్దుగా ఉన్న పిల్లలను సెలెక్ట్ చేస్తే తాను అందులో తను కూడా ఉన్నానన్నారు. (Twitter/Photo)
ఆ సీరియల్లో తాను నటించిన డబ్బింగ్ వేరే ఎవరో చెప్పారన్నారు. ఈ షో సందర్బంగా విజయ్ దేవరకొండ బాల నటుడనే విషయం అందరికీ తెలిసొచ్చింది. ఇక విజయ్ దేవరకొండ... తండ్రి గోవర్ధన్ రావు.. పూరీ జగన్నాథ్ కలిసి దూరదర్శన్‌లో కలిసి పనిచేసారనే విషయాన్ని ప్రస్తావించారు. ఇక తన తండ్రి కూడా నటుడు కావాలనుకున్నారు. కానీ కాలేకపోయారు. తాను మాత్రం నటుడిని అవ్వాలని ఫిక్స్ అయ్యాను. అనుకున్నట్టే ఎన్ని కష్టాలు ఎదురైన హీరోగా సక్సెస్ అయ్యానని చెప్పారు. (Twitter/Photo)
ఇక ‘అర్జున్ రెడ్డి’ తర్వాత ’ఏ మంత్రం చేసావే’ మూవీ నిర్మాతలు.. ఆ సినిమాను ప్రమోట్ చేయమని అడిగినా.. సబ్జెక్ట్ పై నాకు నమ్మకం లేదు. ప్రేక్షకులను వంచించడం ఇష్టం లేక ఈ సినిమాను ప్రమోట్ చేయలేదన్నారు. ఇక ఈ షోలో పూరీ జగన్నాథ్... మాట్లాడుతూ.. ‘లైగర్’ మూవీ కథను రాసుకొని చాలా యేళ్లే అవుతోంది. ఇక ఈ చిత్రంలో మైక్ టైసన్ ఉంటే బాగుంటుందని అనుకున్నాను. అనుకున్నట్టే ఆయన ఈ చిత్రంలో నటించడం తమ అదష్ణమన్నారు. (Twitter/Photo)