తాజాగా ఈ సినిమాకు సంబంధించిన పాటలకు సంబంధించిన మ్యూజిక్ సిట్టింగ్స్ పూర్తయ్యాయి. మరోవైపు బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పెండింగ్‌లో ఉన్నట్టు తమన్ ట్వీట్ చేసారు. బాలయ్యతో తమన్‌కు ఇది మూడో చిత్రం. గతంలో వీళ్ల కలయికలో ‘డిక్టేటర్’, అఖండ చిత్రాలొచ్చాయి. త్వరలో వీరసింహారెడ్డి సినిమాతో పలకరిచంనున్నారు. (Twitter/Photo)
బాలయ్య ఓ వైపు సినిమాల్లో అదరగొడుతూనే టాక్ షోలోను కేక పెట్టిస్తున్నారు. అందులో భాగంగా ఆయన ఆహా ఓటీటీ కోసం అన్ స్టాపబుల్ విత్ NBK ఓ టాక్ షోను చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ షో మొదటి సీజన్ మంచి విజయాన్ని అందుకుంది. ఈ రెండో సీజన్ అక్టోబర్ 14 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. లేెటస్ట్ ఎపిసోడ్లో అల్లు అరవింద్, సురేష్ బాబు, రాఘవేంద్రరావు, కోదండరామిరెడ్డిలు సందడి చేసిన సంగతి తెలిసిందే కదా. ఈ షో చివరి ఎపిసోడ్లో ప్రభాస్, గోపీచంద్ సందడి చేయనున్నట్టు సమాచారం. Photo : Twitter
ఇక వీరసింహారెడ్డి తర్వాత బాలయ్య తన 108వ సినిమాను బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో చేయనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్ మీద హరీష్ పెద్ది, సాహు గారపాటి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రోడక్షన్ వర్క్ జరుగుతోంది. ఈ సినిమాలో బాలయ్య బాబు మునుపెన్నడు చూడని అవతార్‌లో కనిపించనున్నాడట. ఈ సినిమాలో యువ హీరోయిన్ ‘పెళ్లిసందD’ భామ శ్రీలీల డాటర్‌గా కనిపించనుంది. ఇక లేటెస్ట్గా ఈ సినిమా గురించి మరో వార్త హల్ చల్ చేస్తోంది. తెలుస్తోన్న సమాచారం మేరకు ఈ సినిమాలో విలన్‌గా హిందీ యాక్టర్ అర్జున్ రామ్‌పాల్ ఈ విషయంలో త్వరలో అధికారిక ప్రకటన రానుందని తెలుస్తోంది.. Photo : Twitter
అందులో భాగంగా ఆయన చేసిన అద్భుత చిత్రం “ఆదిత్య 369. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వం వహించిన ఈ సినిమా భారతీయ చిత్రసీమలో అప్పట్లో ఓ సంచలనం. ఇక ఈ సినిమాకు ఎప్పటి నుంచో సీక్వెల్ రాబోతుందని టాక్ వినపడుతోంది. అంతేకాదు ఈ సినిమాకు స్వయంగా బాలయ్యే దర్శకత్వం వహించనున్నారని తెలిపారు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ కూడా మొదలైందని తెలుస్తోంది. ఇక అది అలా ఉంటే తాజాగా ఈ సినిమా విషయంలో మరో అప్ డేట్ వచ్చింది. Photo : Twitter
ఈ సినిమాకు“ఆదిత్య 999 మ్యాక్స్” అనే టైటిల్ ఖరారు అయ్యినట్లు తెలిపారు బాలయ్య. ఆయన ఆహాలో వస్తున్న తన టాక్ షోలో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. దీంతో ఫ్యాన్స్ భారీగా అంచనాలు పెట్టుకుంటున్నారు. అసలు ఈ సినిమా ఎలా ఉండనుందో.. అంటూ తెగ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. బాలయ్య మరో మాస్ యాక్షన్ సినిమాను కూడా ఓకే చేసినట్లు టాక్ నడుస్తోంది. ఇటీవల మహేష్ బాబుతో సర్కారు వారి పాటను తెరకెక్కించిన పరశురామ్ పెట్లాతో ఓ సినిమాను చేస్తున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పరశురామ్ చెప్పిన కథ నచ్చడంతో ఓకే అన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. Photo : Twitter
గతేడాది బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేసిన ‘అఖండ’ సక్సెస్‌ను కంటిన్యూ చేయాలనే ఉద్దేశ్యంతో వరుసగా క్రేజీ డైరెక్టర్స్‌తో నెక్ట్స్ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు.ఇక ఈ సినిమా గుంటూరులోని రామకృష్ణ థియేటర్లో 175 పూర్తి చేసుకోవడం విశేషం. అంతేకాదు ఈ సినిమా డిసెంబర్ 2న యేడాది పూర్తి చేసుకుంది. Photo : Twitter
ఈ సినిమాలో బాలయ్య మరోసారి డ్యూయల్ రోల్లో కనిపించనున్నట్టు సమాచారం. ఒక పాత్ర ఫ్యాక్షనిస్ట్, పోలీస్ ఆఫీసర్ పాత్రలు అని చెబుతున్నారు. మరోవైపు సాధువు పాత్రలో కూడా నటించబోతున్నట్టు కూడా చెబుతున్నారు. మొత్తంగా ‘చెన్నకేశవరెడ్డి’ తరహాలో తండ్రి కొడుకులు నేపథ్యంలో ఈ సినిమాను పలనాడు బ్యాక్‌డ్రాప్‌లో నిజ జీవిత ఘటలన ఆధారంగా తెరకెక్కిస్తున్నట్టు సమాచారం.(Twitter/Photo)