బాలకృష్ణ కెరీర్ లోనే ఎక్కువ థియేటర్లలో విడుదలైన సినిమాల్లో ఒకటిగా వీర సింహారెడ్డి నిలిచింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి మొత్తం 875 పైగా థియేటర్లలో విడుదలైన ఈ సినిమా కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి మరో 90 థియేటర్లు, ఓవర్సీస్ లో 500 పైగా థియేటర్లలో రిలీజయ్యింది. ప్రపంచవ్యాప్తంగా చూస్తే మొత్తం 1465 చోట్ల వీర సింహారెడ్డి బొమ్మ పడింది.
బాలకృష్ణ 107వ సినిమాగా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకొచ్చింది. మైత్రి మూవీ మేకర్స్ (Mythri Movie Makers) బ్యానర్‌పై ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ఈ సినిమాలో బాలయ్య సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది. హానీ రోజ్, వరలక్ష్మీ శరత్ కుమార్, కన్నడ స్టార్ దునియా విజయ్, మలయాళ నటుడు లాల్, నవీన్ చంద్ర, మురళీ శర్మ, ఈశ్వరీ రావు తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు.