బాలకృష్ణ ‘అన్‌స్టాపబుల్ షో’ సెకండ్ సీజన్‌కు ముహూర్తం ఖరారు అయినట్లు తెలుస్తోంది. సెకండ్ సీజన్ ఎప్పుడు మొదలవుతుందా అని అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇదిగో, అదిగో అంటున్నారే తప్ప సీజన్ 2కి సంబంధించి ఎలాంటి అఫీషియల్ ప్రకటన రావడం లేదు. తాజాగా ఈ షోకు సంబంధించిన అప్ డేట్ ఒకటి నెట్టింట రౌండప్ చేస్తోంది. మేకర్స్ ఈ షోను ఆగస్టు రెండో వారంలో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారట.