అవును లెెజెండ్ సినిమాలో బాలయ్య డైలాగ్ చెప్పినట్టు .. స్టేట్ అయినా.. సెంట్రల్ అయినా.. పొజిషన్ అయినా.. అపోజిషన్ అయినా.. పవర్ అయినా.. పొగరైనా.. నేను దిగనంత వరకే అన్నట్టు.. బాలయ్య ఎపుడైతే.. స్మాల్ స్క్రీన్ పై ఓటీటీ వేదికగా ఎంట్రీ ఇవ్వడమే ఓ సెన్సెసన్ క్రియేట్ చేసింది. అంతేకాదు ఫస్ట్ సీజన్ ఎంత పెద్ద సక్సెస్ అయిందో ఇపుడు సీజన్ 2 ఫస్ట్ ఎపిసోడ్ 24 గంటల్లో 10 లక్షలకు పైగా వీక్షించినట్టు ఆహా టీమ్ తెలియజేసింది.
ఓటీటీ వేదికగా ఇదో సంచలన రికార్డు అని చెబుతున్నారు.వెండితెరపై ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీస్‌తో ఇండస్ట్రీ రికార్డుల తిరగరాసిన నందమూరి అందగాడు.. ఇపుడు చిన్న తెరపై కూడా సంచలనాలు నమోదు చేస్తున్నాడు. తాజాగా ఈయన బావ గారు కమ్ వియ్యంకుడైన చంద్రబాబు నాయుడుతో చేసిన అన్‌స్టాపబుల్ సీజన్ 2 గత రికార్డులను ఉప్పు పాతరేసింది. ఈ రికార్డు బద్దలు కావాలంటే మళ్లీ బాలయ్యకు సాధ్యమనే చెప్పాలి. ఓటీటీల్లో ఇదే సంచలనం అని చెబుతున్నారు. (Twitter/Photo)
మొత్తంగా సీజన్ 2లో చంద్రబాబు నాయుడుతో బాలయ్య చేసిన ఈ ఫస్ట్ ఎపిసోడ్.. సినీ, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అయిందనే చెప్పాలి. దీనిపై కొందరు పాజిటివ్‌గా స్పందిస్తే.. మరికొందరు నెగిటివ్‌గా స్పందించారు. ఏది ఏమైనా ఆహా ఓటీటీకి మాత్రం ఓహో అనేలా ఈ ప్రోగ్రామ్ బ్లాక బస్టర్‌గా బాప్ అనిపించుకుంది. ఇక నందమూరి అభిమానులతో పాటు కొంత మంది వీక్షకలు ఒక అడుగు ముందుకు వేసి బాలయ్య మజాకా అంటున్నారు. (Twitter/Photo)
మరోవైపు ఈ షోలో అల్లు అరవింద్ ఫ్యామిలీ కూడా పార్టిసిపేట్ చేేసే అవకాశాలున్నాయనే మాట వినిపిస్తోంది. ఈ షో కారణంగా ఆహా ఓటీటీకి సబ్‌స్క్రైబర్స్‌కు భారీగా పెరిగారు. ఈ షోలో హోస్ట్‌గా బాలయ్య ఎలా రక్తించడానేది సెపరేట్‌గా చెప్పాాల్సిన పనిలేదు. సీజన్ 2లో ముందు ఎవరెవరు గెస్ట్లుగా వస్తారు. వారితో ఎలాంటి చిట్‌చాట్ ఉంటుందనే విషయమై అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. (Twitter/Photo)