బాలయ్య ఓ వైపు సినిమాల్లో అదరగొడుతూనే టాక్ షోలోను కేక పెట్టిస్తున్నారు. ఆయన ఆహా ఓటీటీ కోసం అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే అంటూ ఓ టాక్ షోను చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ షో మొదటి సీజన్ మంచి విజయాన్ని అందుకుంది. ఇక రెండో సీజన్‌కు రెడీ అయ్యింది. ఈ రెండో సీజన్ అక్టోబర్ 14 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. మొదటి ఎపిసోడ్‌కు చంద్రబాబు, లోకేష్‌లు వచ్చి అదరగొట్టారు. Photo : Twitter
రెండో ఎపిసోడ్‌కు సిద్దు జొన్నలగడ్డ, నిర్మాత వంశీ వచ్చి అలరించారు. ఇక మరో ఎపిసోడ్ వచ్చే శుక్రవారం ప్రసారం కావాల్సిఉంది. అయితే ఈ ఎపిసోడ్ కొన్ని కారణాల వల్ల ప్రసారం కావడం లేదు. దీనికి బదులుగా దాని స్థానంలో మొదటి ఎపిసోడ్ చంద్రబాబు, నారా లోకేష్‌ల ఎపిసోడ్ మరోసారి ప్రసారం కానుంది. అయితే ఇప్పుడు అది సెన్సార్ చెయ్యని పూర్తి ఎపిసోడ్ అని తెలుస్తోంది. ఇక ఆయన నటిస్తున్న సినిమాల విషయానికి వస్తే.. Photo : Twitter
అఖండ తర్వాత బాలకృష్ణ, గోపీచంద్ మలినేనితో ఓ మాస్ యాక్షన్ సినిమాను చేస్తోన్న సంగతి చేస్తున్నారు. ఈ సినిమా ఇప్పటికే దాదాపుగా 75 శాతం షూటింగ్‌ను పూర్తి చేసుకుందని టాక్. అది అలా ఉంటే ఈ సినిమా టైటిల్‌పై రకరకాలుగా రూమర్స్ వినిపించాయి. అయితే టీమ్ ఈ సినిమా టైటిల్‌ను అక్టోబర్ 21న కర్నూలులోని కొండా రెడ్డి బురుజు దగ్గర వీరసింహారెడ్డి అంటూ ప్రకటించింది. Photo : Twitter
శృతి హాసన్ హీరోయిన్గా చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. తమన్ సంగీతం. ఈ సినిమా మొన్నటి వరకు టర్కీలో ఓ షూటింగ్‌ను జరుపుకుంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. భారీ అంచనాల నడుమ వస్తోన్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదలకానుంది. ఇక ఇప్పటికే సంక్రాంతి బరిలో ప్రభాస్ ఆదిపురుష్, చిరంజీవి వాల్తేరు వీరయ్య, అఖిల్ ఏజెంట్ ఉన్నాయి.. Photo : Twitter
ఇక మరోవైపు బాలయ్య 108వ మూవీకి సంబంధించిన అనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది. ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది భారీ స్థాయిలో నిర్మించనున్నారు. ఈ సినిమాకు కూడా థమనే మ్యూజిక్ అందించనున్నారు. దీనికి సంబంధించి NBK 108 మూవీ అనౌన్స్ మెంట్ టీజర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఈ మూవీకి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. Photo : Twitter
గతేడాది బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేసిన ‘అఖండ’ సక్సెస్‌ను కంటిన్యూ చేయాలనే ఉద్దేశ్యంతో వరుసగా క్రేజీ డైరెక్టర్స్‌తో నెక్ట్స్ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు.ఇక ఈ సినిమా గుంటూరులోని రామకృష్ణ థియేటర్లో 175 పూర్తి చేసుకోవడం విశేషం. ఈ సినిమా తర్వాత ఇప్పటికే గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఇక బాలయ్య బర్త్ డే సందర్భంగా విడుదలైన ఈ సినిమా టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. Photo : Twitter
ఈ సినిమా ఆగష్టు చివరి వారం వరకు కంప్లీట్ చేసే ఆలోచనలో ఉన్నారు బాలయ్య. ఈ సినిమాలో బాలయ్య సరసన శృతి హాసన్ కథానాయికగా నటిస్తోంది. వరలక్ష్మీ శరత్ కుమార్ మరో కీలక పాత్రలో నటిస్తోంది. కన్నడ నటుడు దునియా విజయ్ ఈ సినిమాలో విలన్ పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాను టాలీవుడ్లో అగ్ర నిర్మాణ సంస్థగా సత్తా చూపెడుతున్న మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఈ సినిమాలో బాలయ్య ఫ్యాక్షనిస్ట్ పాత్రతో పాటు పోలీస్ ఆఫీసర్‌గా నటించబోతున్నట్టు సమాచారం.ఈ సినిమా తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో నెక్ట్స్ మూవీ చేయనున్నారు. ఈ సినిమా కు సంబంధించిన ఫైనల్ స్క్రిప్ట్ రెడీ అయిందంట. Photo : Twitter
ఇప్పటికే ఓ సారి బాలయ్యతో సినిమా చేయాలని చూసాడు అనిల్. నిజానికి ఆయన 100వ సినిమా కూడా అనిల్ రావిపూడి చేతుల్లో పెట్టాలని చూసాడు నిర్మాత దిల్ రాజు. అప్పట్లో ఈ కాంబినేషన్లో రామారావు గారు అనే సినిమా ప్రకటించారు కూడా. కానీ అనుకోని కారణాలతో ఈ సినిమా ఆగిపోయింది. ఇక బాలయ్యతో ఇపుడు చేయబోయే సినిమా కథ తండ్రి, కూతురు మధ్య అల్లుకుని ఉంటుంది... Photo : Twitter
ఇక బాలయ్యతో చేస్తున్న సినిమాలో తన మార్క్ కామెడీ, కమర్షియల్ అంశాలతో పాటు అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్ పుష్కలంగా ఉండనున్నట్టు అనిల్ రావిపూడి ఖరారు చేశాడు. ఈ సినిమాలో హీరోయిన్ పేరును కూడా చెప్పేశాడు అనిల్. ఇక బాలయ్య కూతురిగా ‘పెళ్లిసందD’ ఫేమ్ శ్రీలీలా నటిస్తోందని అనిల్ తెలిపాడు. శ్రీలీల అయితేనే ఈ సినమాకు బావుంటుందని.. ఆమె మాత్రం ఆ పాత్రకు న్యాయం చేస్తుందని అనిల్ రావిపూడి క్లారిటీ ఇచ్చేశాడు., అందుకే ఏరికోరి మరీ శ్రీలీలాని తీసుకున్నామని అనిల్ చెప్పుకొచ్చాడు. Photo : Twitter
మరోవైపు ఈ సినిమాలో బిగ్‌బాస్ ఓటీటీ తెలుగు విన్నర్ బిందు మాధవి కూడా ఈసినిమాలో ఛాన్స్ ఇస్తున్నట్టు ఈ సినిమా గ్రాండ్ ఫినాలేలో అనిల్ రావిపూడి చెప్పారు. మరి బిందు మాధవికి ఈ సినిమాలో హీరోయిన్ ఛాన్స్ ఇస్తాడా ? లేకపోతే వేరే ఏదైనా పాత్ర ఇస్తాడనేది చూడాలి. మొత్తంగా ప్రేక్షకులు మరిచిపోయిన బిందు మాధవికి అనిల్ రావిపూడి.. అది కూడా బాలయ్య సినిమాలో అవకాశం అంటే మాములు విషయం కాదు. మరి ఈ సినిమాతో బిగ్‌బాస్ బ్యూటీకి మరిన్ని అవకాశాలు వస్తాయా అనేది చూడాలి. Photo : Twitter
బాలయ్య ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో NBK107 ప్రాజెక్ట్ చేస్తున్నారు. ఇది ముగిసిన వెంటనే, అనిల్ రావిపూడితో సెట్స్ మీదకి వెళ్లనున్నారు. బాలయ్య ప్రస్తుతం రాజకీయాలతో పాటు సినిమాలు కూడా చేస్తున్నాడు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో లెజెండ్ సీక్వెల్ తీసేందుకు కూడా నందమూరి బాలయ్య రెడీ అయ్యాడు. ఇందులో కూడా బాలయ్య రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్నారు. Photo : Twitter
జనవరి 23, 2015న పటాస్ సినిమాతో వెండితెరకు డైరెక్టర్‌గా పరిచయం అయ్యాడు అనిల్ రావిపూడి. అయితే బాలయ్యను అనిల్ తొలిసారిగా డైరెక్ట్ చేస్తున్నాడు. దీంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు పెట్టుకున్నారు నందమూరి అభిమానులు. ఇక ఈ చిత్రాన్నిషైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించనున్నారు. Photo : Twitter