Unstoppable| Balakrishna : నందమూరి నటసింహం బాలకృష్ణ తొలిసారి ఓటీటీ వేదిక ఆహాలో ‘అన్ స్టాపబుల్’ అంటూ ఓ టాక్ షోకి హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ టాక్ షో అల్లు అరవింద్ నిర్మాణంలో దీపావళి సందర్భంగా నవంబర్ 4వ తేది నుంచి ప్రసారం కానుంది. తాజాగా ఈ షోలో మోహన్ బాబును చిరంజీవి గురించి కొన్ని ఆసక్తికర ప్రశ్నలు వేసారు. దానికి మోహన్ బాబు ఆసక్తికర సమాధానం ఇచ్చారు. (Photo : Twitter)
ఇప్పటికే నాగార్జున, ఎన్టీఆర్, చిరంజీవి, రానా, నాని వంటి హీరోలు స్మాల్ స్క్రీన్ పై సందడి చేశారు. ఈ కోవలో కాస్తా ఆలస్యంగా ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌లో ఎంట్రీ ఇచ్చి నిజంగానే ‘అన్‌స్టాపబుల్’ అనిపిస్తున్నారు బాలకృష్ణ. తొలిసారి అల్లు అరవింద్ ‘ఆహా’ కోసం బాలయ్య.. హోస్ట్ అవతారం ఎత్తారు. ఈ షో ఫస్ ఎపిసోడ్‌కు మంచు మోహన్ బాబు తన కూతురు మంచు లక్ష్మితో పాటు మంచు విష్ణుతో కలిసి వచ్చారు. (Twitter/Photo)
ప్రముఖ ఓటీటీ ఆహా(Aahaa) లో టెలికాస్ట్ కాబోయే టాక్ షో అన్‌స్టాపబుల్‌లో బాలకృష్ణ యాంకర్‌గా కనిపించబోతున్నారు. టాక్ షోకు బాలకృష్ణ యాంకర్ అనడంతో ఆయన అభిమానులు మురిసిపోతున్నారు. సినీ ప్రియులు సైతం కొత్త క్యారెక్టర్లో బాలకృష్ణ ఏ రకంగా మెప్పిస్తారని ఎదురుచూస్తున్నారు. పైగా మంచు మోహన్ బాబు ఫ్యామిలీ అతిథిగా రావడం మరింత ఆసక్తికరంగా మారింది. (Twitter/Photo)
ఇక చిరంజీవితో మీకు నిజంగా ఉన్న అభిప్రాయం ఏమిటన్నారు. మోహన్ బాబు ఈ షోలో ఏ సమాధానం చెబుతారా అనేది ఆసక్తికరంగా మారింది. ఇక ఏది ఉన్న అన్ని పై వాడు చూసుకుంటాడన్నారు మోహన్ బాబు. ఇక నట ప్రపూర్ణ మోహన్ బాబు మాట్లాడుతూ అన్నగారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ పగ్గాలు మీరు పట్టకుండా చంద్రబాబుకు ఎందుకు ఇచ్చారంటూ ప్రశ్న అడగడం.. మరోవైపు అన్నగారు స్థాపించిన పార్టీని వదిలి మీరు మరోపార్టీకి ఎందుకు వెళ్లారని బాలయ్య తిరిగి మోహన్ బాబును రివర్స్‌లో అడగడం వంటీ సీన్స్ షోకు హైలెట్‌గా నిలవనున్నాయి. (Twitter/Photo)
అన్ని షోల మాదిరి ఇందులో ఓపెన్ టాక్ ఏం ఉండదు. మనిషిలోని రియాలిటీని బయటికి తీసుకొచ్చే షో ఇది అంటున్నారు బాలయ్య. ఇప్పటి వరకు ఎక్కడా చెప్పని నిజాలు ఇందులో చూపించబోతున్నాడు బాలయ్య. వాళ్లను ఇబ్బంది పెట్టకుండా.. వచ్చిన అతిథులను అద్భుతంగా చూసుకుంటూనే తనకు కావాల్సిన సమాచారం రాబడతాను అంటున్నాడు బాలయ్య. ఈ షోకు ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేస్తున్నారు. (Twitter/Photo)
ఇప్పటి వరకు వచ్చిన షోలు ఒకెత్తు అయితే.. తన షో మాత్రం మరో ఎత్తు అంటున్నాడు బాలయ్య కూడా. తాను అంత ఈజీగా యాంకరింగ్ చేయడానికి ఒప్పుకోలేదని.. ఈ షో కాన్సెప్ట్ చాలా బాగా నచ్చిందని చెప్పుకొచ్చాడు బాలయ్య. అల్లు అరవింద్‌తో పాటు షో నిర్వాహకులు చెప్పిన కాన్సెప్ట్ అదిరిపోవడంతో బాలయ్య వెంటనే ఓకే చెప్పారు. (Twitter/Photo)
అన్ని షోల మాదిరి ఇందులో ఓపెన్ టాక్ ఏం ఉండదు. మనిషిలోని రియాలిటీని బయటికి తీసుకొచ్చే షో ఇది అంటున్నాడు బాలయ్య. ఇప్పటి వరకు ఎక్కడా చెప్పని నిజాలు ఇందులో చూపించబోతున్నాడు బాలయ్య. వాళ్లను ఇబ్బంది పెట్టకుండా.. వచ్చిన అతిథులను అద్భుతంగా చూసుకుంటూనే తనకు కావాల్సిన సమాచారం రాబడతాను అంటున్నారు బాలయ్య. (Twitter/Photo)
మోహన్ బాబుతో మొదలు పెట్టి.. ఆ తర్వాత చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ లాంటి స్టార్స్ కూడా ఈ షోకు వస్తున్నట్లు తెలుస్తుంది. బాలయ్య కాబట్టి వాళ్లు కూడా మొహమాటం లేకుండా వచ్చేస్తున్నారు. అన్నింటికంటే ముందు బాలయ్య హోస్టింగ్ ఎలా ఉంటుందో చూడాలని అంతా ఆసక్తిగా చూస్తున్నారు. తొలి సీజన్ 12 ఎపిసోడ్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది.