నారా లోకేష్ విదేశాల్లో తన గర్ల్ ఫ్రెండ్స్ అందరితో కలిసి స్విమ్మింగ్ పూల్లో ఎంజాయ్ చేస్తున్న ఫోటోను బయటపెడుతూ.. ఇది అసెంబ్లీ వరకు వెళ్లిందంటూ చురకలంటించారు బాలయ్య బాబు. దీంతో ఇది కాలేజీ రోజుల్లో స్నేహితులతో కలిసి దిగిన ఫోటో అని చెప్పిన లోకేష్.. కాలేజీ రోజుల్లో అలా ఉండకపోతే ఎలా? అంటూ రొమాంటిక్గా సమాధానం చెప్పారు.
అక్టోబర్ 21 నుంచి ఈ షో ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ఇందుకు సంబంధించిన ప్రోమో వీడియో కూడా రిలీజ్ చేసి ఎపిసోడ్ పై ఆసక్తి పెంచేశారు. మాస్ దాస్, మాస్ కా బాప్ లతో తేడా సింగ్ అంటూ యూత్ ఆడియన్స్ టార్గెట్గా ఈ ఎపిసోడ్ ప్లాన్ చేశారు. సో.. చూడాలి మరి బాలకృష్ణతో ఈ ఇద్దరు యంగ్ హీరోలు ఎలాంటి సీక్రెట్స్ పంచుకుంటారనేది!.