నందమూరి నట సింహా బాలకృష్ణ ప్రస్తుతం ట్రెండ్‌కు తగ్గట్టు దూసుకుపోతున్నాుడు. ఓ వైపు సినిమాలు.. మరోవైపు రాజకీయాలు.. ఇంకోవైపు బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్ బాధ్యతలు.. వాటిన్నిటి మించి ఓటీటీలో అన్‌స్టాపబుల్ అంటూ యాంకర్‌గా తన సత్తా ఏంటో చూపించారు. అంతేకాదు కమర్షియల్ యాడ్స్ విషయంలో కూడా దూసుకుపోతున్నారు.
బాలయ్య సినిమాల విషయానికొస్తే.. వీర సింహా రెడ్డి సినిమా తర్వాత బాలయ్య 108వ సినిమాను బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఓ షెడ్యూల్ కూడా పూర్తైయింది. బాలయ్య ఒక వారం తర్వాత జాయిన్ కానున్నారు. ఈ షెడ్యూల్లోనే భారీ యాక్షన్ సీన్స్ ప్లాన్ చేస్తున్నారట. ఇప్పటికే బాలయ్య కూతురు పాత్రలో నటిస్తోన్న శ్రీలీల పై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. (Twitter/Photo)
అంతేకాదు ఈ సినిమా బాలయ్య సినిమాల్లో చాలా భిన్నంగా ఉండనుందని టాక్. చూడాలి మరి ఎలా ఆకట్టుకోనుందో.. ఇక ఈ సినిమాలో హీరోయిన్గా వీరసింహా రెడ్డిలో మీనాక్షి పాత్రలో సీనియర్ బాలయ్యసరసన నటించిన హనీరోజ్ నటించనుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్‌కు ఛాన్స్ ఉండడంతో ఫస్ట్ హీరోయిన్గా కాజల్ ను తీసుకుంటున్నారని సోషల్ మీడియా టాక్. ఈ సినిమాలో కూడా ఓ ఫ్లాష్ బ్యాక్ ఉంటుందని.. అందులో భాగంగా కాజల్‌ను తీసుకుంటున్నారని ఓ టాక్ నడుస్తోంది.