శ్రీను వైట్ల విషయానికొస్తే.. ఒకప్పుడు వరుస సక్సెస్‌లతో టాలీవుడ్ టాప్ డైరెక్టర్‌గా సత్తా చాటారు. ఆ తర్వాత వరుస ఫ్లాపులు పలకరించడంతో కాస్త సైలెంట్ అయిపోయారు. త్వరలో ఈయన మంచు విష్ణుతో ‘ఢీ అంటే ఢీ’ అనే సినిమాతో పలకరించబోతున్నారు. అంతేకాదు తన కెరీర్ మొదలైంది బాలయ్య మూవీతో అంటూ తాజాగా ఈయన ఈ టీవీలో ప్రసారమయ్యే ఆలీతో సరదగా షోలో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. (Twitter/Photo)
బాలయ్య సినిమాతో దర్శకుడిగా ప్రస్థానం మొదలు పెట్టిన శ్రీను వైట్ల.. ఆయనను డైరెక్ట్ చేసింది ‘పరమవీరచక్ర’ సినిమాలో. దాసరి నారాయణ రావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో బాలకృష్ణ .. ఆర్మీ మేజర్‌గా, సినీ నటుడిగా నటించారు. ఈ సినిమాలో శ్రీను వైట్ల తన నిజ జీవిత పాత్రైన దర్శకుడిగా బాలయ్యను ఈ సినిమాలో డైరెక్ట్ చేసారు. భవిష్యత్తులో బాలయ్యతో శ్రీను వైట్ల సినిమా తెరకెక్కిస్తే చూడాలనుకునే అభిమానులున్నారు. (Twitter/Photo)