NBK - Simha: పేరులో ’సింహా’ టైటిల్‌తో నట సింహా బాలకృష్ణ చేసిన సినిమాలు. ఎక్కువగా సింహా టైటిల్‌తో సినిమాలు చేయడంతో యువరత్న బాలకృష్ణ కాస్తా.. నట సింహా బాలకృష్ణగా మారిపోయారు. ఈయన సినిమా పేర్లలో ’సింహా’ టైటిల్ ప్రతి ధ్వనించేలా పలు బ్లాక్ బస్టర్ సినిమాలు చేసారు. ఇందులో పలు చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచాయి. తాజాగా ఇపుడు ‘వీరసింహారెడ్డి’గా మరోసారి బాక్సాఫీస్ దగ్గర గర్జించారు. (Twitter/Photo)
వీర సింహా రెడ్డి | నందమూరి బాలకృష్ణకు సింహా అనే టైటిల్ సెంటిమెంట్ ఉంది. దాన్ని కొనసాగిస్తూ తన లేటెస్ట్ మూవీకి ‘వీరసింహారెడ్డి’ అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ చిత్రాన్ని సంక్రాంతికి కానుకగా జవనరి 12న విడుదలై బాక్సాఫీస్ దగ్గర హిట్‌గా నిలిచింది. ఇక బాలయ్య సింహా టైటిల్ కలిసొచ్చేలా చేసిన ఇతర చిత్రాల విషయానికొస్త.. (Twitter/Photo)
సింహా |2010లో నట సింహం బాలకృష్ణ .. బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘సింహా’ సినిమా చేసారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకుంది. 2010లో హైయ్యెస్ట్ టాలీవుడ్ గ్రాసర్‌గా నిలిచింది. ఇక బోయపాటి శ్రీనుతో బాలకృష్ణకు ఇది ఫస్ట్ మూవీ. ఈ చిత్రంలో బాలయ్య సరసన నయనతార, నమిత, స్నేహా ఉల్లాల్ నటించారు. (Twitter/Photo)
నరసింహనాయుడు | 2001లో బి.గోపాల్ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా సిమ్రాన్, ప్రీతి జింగానియా, హీరో, హీరోయిన్లుగా నటించిన ‘నరసింహనాయుడు’ ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా 2001లో హైయ్యెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది. బి.గోపాల్‌తో బాలయ్యకు నాలుగో సినిమా. ఈ సినిమా రూ. 9 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కింది. ఈ సినిమా రూ. 30 కోట్లకు పైగా షేర్ సాధించింది. తెలుగులో తొలి 30 కోట్ల షేర్ సాధించిన సినిమాగా రికార్డులకు ఎక్కింది. ( (Twitter/Photo)
సమరసింహా రెడ్డి | 1999లో బి.గోపాల్ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా సిమ్రాన్, అంజలా ఝవేరి, సంఘవి హీరో, హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా టాలీవుడ్ ఇండస్ట్రీ రికార్డులను తిరగ రాసింది. ఫ్యాక్షన్ సినిమాలకు ట్రెడ్ సెట్టర్ మూవీగా నిలిచిపోయింది. ఈ సినిమా రూ. 6 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కింది. అంతేకాదు ఈ సినిమా ఫుల్ రన్లో రూ. 20 కోట్ల వరకు షేర్ రాబట్టింది. తెలుగులో తొలి రూ. 20 కోట్ల షేర్ సాధించిన మూవీగా రికార్డులకు ఎక్కింది. (Twitter/Photo)