Balakrishna - Roja : బాలకృష్ణ ‘అన్‌స్టాపబుల్ షో’కు ఛీఫ్ గెస్ట్‌గా జబర్ధస్త్ రోజా.. ఆహా అంటున్న అభిమానులు.. అవును బాలకృష్ణ ఇపుడు పూర్తిగా మారిపోయారు. ఆయన చేసే పనులు ఎవరి ఊహాలకు అందడం లేదు. ఎన్నడు లేనట్టుగా మెగా ఫ్యామిలీకి చెందిన ఆహాలో బాలయ్య టాక్ షో అనగానే అందరు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఇక నందమూరి బాలకృష్ణ తొలిసారి ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ ఆహా లో ఓ టాక్ షో చేసి మొదటి ఎపిసోడ్‌తో అదరగొట్టేసారు.
తొలి ఎపిసోడ్లో మోహన్ బాబు ఇంటర్వ్యూల చేసిన విధానం అందరినీ ఆకట్టకుంది. మొత్తంగా ఇంట్లో డజనుకు పైగా మెగా హీరోలున్న అల్లు అరవింద్ ‘ఆహా’ ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌కు మెగా ఫ్యామిలీ ట్యాగ్ లైన్ చెరపడానికి బాలకృష్ణను హోస్ట్‌గా ఒప్పించి ఈ ప్రోగ్రామ్ చేసారు. అప్పటికే ఎన్నో ప్రోగ్రామ్స్ చేసిన ఆహాకు దక్కని గుర్తింపు ఈ షోతో ఒక్కసారి సబ్స్క్రైబర్స్ పెరిగినట్టు తాజాగా ఆహా వెల్లడించింది. (Twitter/Photo)
ఇప్పటికే చిరంజీవి, నాగార్జున, ఎన్టీఆర్, నాని వంటి హీరోలు స్మాల్ స్క్రీన్ పై సందడి చేసిన సంగతి తెలిసిందే కదా. ఇపుడు అదే రూట్లో నందమూరి బాలకృష్ణ.. అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే అంటూ సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేయడానికి రెడీ అయ్యారు. ఇప్పటికే మోహన్ బాబు, నాని లను సరదగా ఇంటర్వ్యూలు చేసిన బాలయ్య.. త్వరలో తన సహచర నటి, ఎమ్మెల్యే రోజాను ఇంటర్వ్యూ చేయనున్నట్టు సమాచారం. త్వరలో దీనిపై అధికారిక ప్రకటన వెలుబడే అవకాశం ఉంది. (File/Photo)
అంతేకాదు బాలయ్య హోస్ట్ చేసిన రెండు ప్రోగ్రామ్‌లను చూసి బాలయ్య టాలెంట్‌ను మెచ్చుకున్నట్టు సమాచారం. ఇప్పటికే తన నగరి నియోజకవర్గం దగ్గరలో ఉన్న మోహన్ బాబును ఇంటర్వ్యూ చేసిన తీరును మెచ్చుకున్నట్టు సమాచారం. మొత్తంగా బాలయ్య షోకు రోజా వస్తే నిజంగానే ఆహా అనాల్సిందే. రీసెంట్గా ఓ ఫోన్ సంభాషణలో బాలయ్య జబర్ధస్త్ షోకు రానున్నట్టు చెప్పిన సంగతి తెలిసిందే కదా. మొత్తంగా రచ్చబండ సహా ఎన్నో షోలో వేరే వాళ్లను చాకిరేపు పెట్టిన రోజాను .. బాలయ్య ఏ రేంజ్లో ఇంటర్వ్యూ చేస్తాడనేది ఆసక్తికరంగా మారింది. (Twitter/Photo)
మరో విచిత్రమైన విషయం ఏమిటంటే బాలకృష్ణ, రోజాలు ఒకేసారి 2014 ఎన్నికల్లో ఉమ్మడి ఏపీగా ఉన్నపుడు జరిగిన ఎన్నికల్లో పోటీ చేసారు. ఏపీ విభజన తర్వాత ఎమ్మెల్యేలుగా తొలిసారి అసెంబ్లీలోకి అడుగుపెట్టి ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేసారు. ఇక రోజా విషయానికొస్తే..గతంలో చంద్రగిరి నుంచి ఓసారి పోటీ చేసి ఓడిపోయిన తర్వాత నగరి నియోజకవర్గం నుంచి రెండో సారి రోజా గెలిచింది. (File/Photo)
కానీ బాలకృష్ణ మాత్రం మొదటిసారే ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఇక 2019 జరిగిన ఎన్నికల్లో వీళ్లిద్దరు ఇంతకు ముందు పోటీ చేసిన స్థానాల నుంచే మళ్లీ ఎమ్మెల్యేలుగా పోటీ చేసి గెలవడం విశేషం. అపుడు బాలకృష్ణ అధికార పక్షంలో ఎమ్మెల్యేగా ఉంటే.. రోజా ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉండే. ఇపుడు మాత్రం రోజా.. అధికార పార్టీలో ఉంటే.. బాలయ్య ప్రతిపక్షంలో ఉండటం విశేషం. (File/Photo)