Balakrishna - Minister Roja | టాలీవుడ్ ఇండస్ట్రీలో బాలకృష్ణ, రోజాలది సూపర్ హిట్ కాంబినేషన్. వీళ్లిద్దరి కలయికలో వచ్చిన చాలా చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్స్‌గా నిలిచాయి. అంతేకాదు వీళ్లిద్దరు ఒకేసారి విభజిత ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. తాజాగా ఏపీలో జరిగిన మంత్రి వర్గ విస్తరణలో రోజాకు క్యాబినేట్ మంత్రి అయ్యారు. ఈ నేపథ్యంలో బాలయ్యతో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. (Twitter/Photo)
Balakrishna - MLA Roja: తెలుగు సినీ ఇండస్ట్రీలో బాలకృష్ణ, రోజా ది సూపర్ హిట్ కాంబినేషన్. అంతేకాదు వీళ్లను మించిన జోడి ఈ జనరేషన్లో ఎవరిది లేదు. వీళ్లిద్దరు ఈ జనరేషన్లో సాంఘిక, జానపద, పౌరాణిక, చారిత్రక సినిమాలున్నాయి. వీళ్లలా ఇన్ని జానర్స్లా సినిమాలు చేసిన జోడి లేదు. తాజాగా మంత్రిగా ప్రమాణం స్వీకారం చేసిన రోజా అదే వ్యాఖ్యలు చేసింది.
Balakrishna - MLA Roja: ఇక తాను హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి 30 యేళ్లు పూర్తైన విషయాన్ని కూడా ప్రస్తావించారు. అంతేకాదు 1994లో బాలయ్యతో నటించిన ‘భైరవ ద్వీపం’ సినిమా తనకు ఎపుడు ప్రత్యేకమే అన్నారు. రీసెంట్గా ఈ సినిమా 28 యేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సినిమాలో తొలిసారి బాలయ్యతో నటించిన విషయాన్ని ప్రస్తావించారు.అంతేకాదు ఒకప్పడు ఎన్టీఆర్, ఏఎన్నార్, సావిత్రి వంటి మహా నటీనటులతో సినిమాలను తెరకెక్కించిన విజయా ప్రొడక్షన్స్‌లో తాను సినిమా చేయడం తన అదృష్టమన్నారు. అప్పట్లో విజయా ప్రొడక్షన్స్‌లో ఎన్టీఆర్ సహా చాలా మంది నెల జీతానికి పని చేసిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. (File/Photo)
ఇక ‘బైరవ ద్వీపం’ తొలి సన్నివేశానికి అన్న ఎన్టీఆర్ గారు క్లాప్ కొట్టిన విషయాన్ని ప్రస్తావించారు. అలాగే ఈ సినిమాలో ఎలా నటించాలో ఎన్టీఆర్ గారు చేసి చూపించారన్నారు. ఈ సినిమా ఓపెనింగ్ ముహూర్తానికి రజినీకాంత్, చిరంజీవి వంటి హీరోలతో పాటు అతిరథ మహారథులైన సినీ నిర్మాతలు, దర్శకులు హాజరయ్యారు. ఈ సినిమా అప్పట్లో పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిందనే విషయాన్ని మంత్రి రోజా ప్రస్తావించారు. (Twitter/Photo)
ఏడో సారి వీళ్లిద్దరు కలిసి ‘సుల్తాన్’ సినిమాలో కలిసి నటించారు. శరత్ దర్శకత్వంలో బాలయ్య సమర్ఫణలో తెరకెక్కిన ‘సుల్తాన్’ చిత్రం బాక్సాఫీస్ దగ్గర అనుకున్నంత రేంజ్లో మెప్పించలేక పోయింది. ఆ తర్వాత వీళ్ల కాంబినేషన్లో కోడి రామకృష్ణ దర్శకత్వంలో ‘విక్రమ సింహ భూపతి ’ సినిమా షూటింగ్ ప్రారంభమై చాలా మటుకు షూటింగ్ పూర్తి చేసుకుంది. ‘ది లయన్ కింగ్’ మూవీకి రీమేక్‌గా ఈ జానపద సినిమా తెరకెక్కింది. ఇందులో పూజా భాత్రా మరో కథానియికగా నటించింది. ఈ సినిమా షూటింగ్ 80 శాతం పూర్తైన ఇప్పటికీ విడుదల కాలేకపోయింది. (Twitter/Photo)
బాలకృష్ణ, రోజా కాంబినేషన్లో వచ్చిన నాలుగు చిత్రాల్లో బాలయ్య ‘మాతో పెట్టుకోకు’, ‘శ్రీకృష్ణార్జున విజయము’, ‘పెద్దన్నయ్య’, ‘సుల్తాన్’ సినిమాల్లో బాలయ్య ద్విపాత్రాభినయం చేసారు. ఈ జనరేషన్లో జానపద, పౌరాణిక,సాంఘిక చిత్రాల్లో కలిసి నటించిన జోడిగా బాలకృష్ణ,రోజాలు రికార్డులకు ఎక్కారు. (Twitter/Photo)
ఆ తర్వాత బాలయ్య, రోజా ‘పరమ వీర చక్ర’ శ్రీరామరాజ్యం’, సినిమాల్లో కలిసి నటించినా జోడిగా మాత్రం నటించలేదు. ఈ మధ్యకాలంలో సినిమాల్లో హీరోయిన్గా పీక్ స్టేజ్‌లో ఉండగానే రోజా సినిమాల నుంచి రాజకీయాల వైపు తన అడుగులు వేసింది. అందులో భాగంగా రోజా తెలుగు దేశం పార్టీలో జాయిన్ అయింది. ఇక రోజా తెలుగుదేశంలో జాయిన్ అవ్వడంలో అప్పట్లో బాలయ్య సహకారం ఉందనేది రాజకీయ వర్గాల కథనం. (nandamuri balakrishna)
మరో విచిత్రమైన విషయం ఏమిటంటే బాలకృష్ణ, రోజాలు ఒకేసారి 2014 ఎన్నికల్లో ఉమ్మడి ఏపీగా ఉన్నపుడు జరిగిన ఎన్నికల్లో పోటీ చేసారు. ఏపీ విభజన తర్వాత ఎమ్మెల్యేలుగా తొలిసారి అసెంబ్లీలోకి అడుగుపెట్టారు. ఇక రోజా విషయానికొస్తే..గతంలో చంద్రగిరి నుంచి ఓసారి పోటీ చేసి ఓడిపోయిన తర్వాత నగరి నియోజకవర్గం నుంచి రెండు సార్లు వైసీపీ తరుపున ఎమ్మెల్యేగా రోజా గెలిచింది. (File/Photo)
కానీ బాలకృష్ణ మాత్రం మొదటిసారే ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఇక 2019 జరిగిన ఎన్నికల్లో వీళ్లిద్దరు ఇంతకు ముందు పోటీ చేసిన స్థానాల నుంచే మళ్లీ ఎమ్మెల్యేలుగా పోటీ చేసి గెలవడం విశేషం. అపుడు బాలకృష్ణ అధికార పక్షంలో ఎమ్మెల్యేగా ఉంటే.. రోజా ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉండే. ఇపుడు మాత్రం రోజా.. అధికార పార్టీలో ఉంటే.. బాలయ్య ప్రతిపక్షంలో ఉండటం విశేషం. (File/Photo)