Balakrishna - Ramesh Babu : ఎన్టీఆర్, కృష్ణ మధ్య అల్లూరి సీతారామరాజు సినిమా విషయంలో మధ్య విభేదాలు అప్పట్లో తెలుగు సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. ఆ తర్వాత చాాలా యేళ్లకు వాళ్ల వారసులు బాలకృష్ణ, రమేష్ బాబుల మధ్య కూడా ఓ సినిమా టైటిల్ విషయంలో పెద్ద రచ్చ నడిచింది. వివరాల్లోకి వెళితే.. (File/Photo)
ఇక అన్న ఎన్టీఆర్.. అల్లూరి సీతారామరాజు సినిమాను చేయాలనుకున్నారు. దాని కోసం స్క్రిప్ట్ రెడీ చేయించే పనిలో ఉండగానే.. సూపర్ స్టార్ కృష్ణ.. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోని పెద్ద నటీనటులతో ‘అల్లూరి సీతారామరాజు’ సినిమాను అత్యంత గోప్యంగా భారీ ఎత్తున తెరకెక్కించారు. ఈ సినిమా తెలుగులో విడుదలైన తొలి సినిమా స్కోప్ చిత్రం. (Twitter/Photo)
కృష్ణ.. అప్పట్లో విజయ నిర్మలతో కలిసి ఏఎన్నార్ ఆల్ టైమ్ క్లాసిక్ .. దేవదేసు’ సినిమాను సినిమా స్కోప్‌లో రీమేక్ చేసారు. అదే టైమ్‌లో ఎన్టీఆర్ కోటరికి చెందిన కొంత మంది వ్యక్తులు ..పాత దేవదాసు రైట్స్ తీసుకొని ఒక వారం ముందుగా మళ్లీ రీ రిలీజ్ చేసారు. మ్యూజికల్‌గా మంచి పాటలున్న కృష్ణ, విజయ నిర్మలల దేవదాసు.. ఏఎన్నార్ దేవదాసు ముందు తేలిపోయింది. అంతేకాదు ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర చతికిల పడింది. (File/Photo)
ఎన్టీఆర్, కృష్ణ మాత్రమే కాదు.. వాళ్ల తనయులు నందమూరి బాలకృష్ణ, ఘట్టమనేని రమేష్ బాబు మధ్య టైటిల్ విషయంలో పెద్ద వివాదమే నడించింది. ఏ సినిమాకైనా టైటిల్ ఇంపార్టెంట్. పేరును బట్టి ప్రేక్షకులు ఓ అంచనాకు వస్తారు. అందుకే సినిమా టైటిల్ విషయంలో హీరోలు, దర్శక, నిర్మాతలు పెద్ద కసరత్తే చేస్తారు. సినీ ఇండస్ట్రీలో ఒకరికి తెలియకుండా మరోకరు టైటిల్ రిజిస్టర్ చేయించడం సహజంగా జరుగుతుంటాయి. చివరకు ఎవరో ఒకరు వెనక్కి తగ్గడం కామన్. (File/Photo)
కానీ ‘సామ్రాట్’ టైటిల్ విషయంలో బాలయ్య, రమేస్ బాబు మధ్య పెద్ద రచ్చే నడిచింది. ఇష్యూ పెద్దది కావడంతో సినీ ఇండస్ట్రీ పెద్ద జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. సూపర్ స్టార్ కృష్ణ తన పెద్ద కుమారుడు రమేష్ బాబును హీరోగా పరిచయం చేసే ముందు పెద్ద కసరత్తు చేశారు. రమేష్ బాబు. 23 ఏళ్ల వయసులో రమేష్ బాబు హీరోగా ఎంట్రీ ఇచ్చారు. అప్పటికే బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, ఎన్టీఆర్ తమ్ముడు త్రివిక్రమ్ రావు కుమారుడు కళ్యాణ్ చక్రవర్తి వంటి హీరోలు పరిచయమైన నేపథ్యంలో రమేష్ బాబు ఎంట్రీ ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. అప్పటికే ఎన్టీఆర్, కృష్ణ మధ్య మాటలు లేవు. ఇక ఈ సినిమా ముహూర్తపు సన్నివేశానికి అక్కినేని నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా విచ్చేసారు.
అంతకు ముందే రమేష్ బాబు.. హీరో కృష్ణ హీరోగా నటించిన పలు చిత్రాల్లో బాల నటుడిగా నటించిన అనుభవం ఉంది. కథానాయకుడిగా పరిచయం అయ్యే ముందు డాన్స్, ఫైట్స్, డైలాగ్స్ విషయంలో రమేష్ బాబుకు ప్రత్యేకంగా శిక్షణ ఇప్పించారు. కథ విషయంలో ఎక్కడ తగ్గేదేలే అంటూ.. హిందీలో సూపర్ హిట్టైన ‘బేతాబ్’ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేశారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచింది. ‘బేతాబ్’ హీరోగా సన్నిడియోల్‌కు మొదటి చిత్రం కావడం విశేషం. ఇక తెలుగులో సోలో హీరోగా రమేష్ బాబుకు ఫస్ట్ మూవీ కావడం విశేషం. (File/Photo)
‘సామ్రాట్’ చిత్రాన్ని సూపర్ స్టార్ కృష్ణ సమర్పణలో పద్మాలయా స్టూడియోస్ బ్యానర్లో తెరకెక్కింది. ఈ చిత్రానికి పరుచూరి బ్రదర్స్ మాటలు అందించారు. ఇక బాలీవుడ్ సంగీత దర్శకుడు బప్పీలహరి సంగీతం అందించారు. అప్పటికే కెమెరామెన్‌గా ఎస్టాబ్లిష్ అయిన వి.యస్.ఆర్.స్వామి పనిచేశారు. శారద ముఖ్యపాత్రలో నటించారు. ఇక హీరోయిన్గా బాలీవుడ్ భామ సోనమ్ కపూర్ నటించింది. ఇలా రమేష్ బాబు ఎంట్రీ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు సూపర్ కృష్ణ. ఈ చిత్రాన్ని మొదట ఎస్.వి. రాజేంద్ర సింగ్ బాబును డైరెక్టర్‌గా ఎన్నుకున్నారు. ఆ తర్వాత ఈ సినిమా దర్శకత్వ బాధ్యతలను వి.మధుసూదన రావు చేతుల్లోకి వెళ్లింది. (Twitter/Photo)
అదే టైమ్‌తో నందమూరి బాలకృష్ణ, విజయ శాంతి హీరో, హీరోయిన్లుగా కే.రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన సినిమాకు ‘సామ్రాట్’ అనే టైటిల్ అనౌన్స్ చేశారు. అప్పటికే టైటిల్ కూడా అనౌన్స్ చేశారు. దీంతో టైటిల్ విషయంలో పెద్ద వివాదం చోటు చేసుకుంది. దీంతో పద్మాలయా బ్యానర్ అధినేత సూపర్ స్టార్ కృష్ణతో పాటు సాహస సామ్రాట్ నిర్మాత దివంగత కేసీ శేఖర్ బాబు కోర్టుకు ఎక్కారు. చివరకు ‘సామ్రాట్’ టైటిల్ కృష్ణగారికే చెందుతుందని కోర్టు తీర్పు ఇచ్చింది. దీంతో బాలయ్య చిత్రానికి ‘సాహస సామ్రాట్’ అనే టైటిల్‌తో రిలీజ్ చేాశారు. (File/Photo)
దీంతో రమేష్ బాబు ‘సామ్రాట్’ మూవీ టైటిల్‌తో హీరోగా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచింది. ఇక బాలకృష్ణ కథానాయికుడిగా నటించిన సినిమా ‘సాహస సామ్రాట్’ సినిమా బాక్సాఫీస్ దగ్గర చతికిల బడింది. సందట్లో సడేమియాలాగా.. ఈ సినిమాల మధ్యలో సుమన్ హీరోగా నటించిన ‘ప్రేమ సామ్రాట్’ కూడా మంచి విజయాన్నే అందుకుంది. మొత్తంగా ‘సామ్రాట్’ టైటిల్ విషయంలో బాలకృష్ణ, రమేష్ బాబు మధ్య పెద్ద రచ్చే నడిచింది. (File/Photo)