అయితే అన్స్టాపబుల్ డిమాండ్ పసిగట్టిన కొందరు ఆన్ లైన్ కేటుగాళ్లు ఈ షో క్లిప్స్ పైరసీ చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఈ విషయాన్ని కాస్త ఆలస్యంగా తెలుసుకున్న అర్హ మీడియా అండ్ బ్రాడ్ కాస్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేసింది. అన్అఫీషియల్గా స్ట్రీమ్ చేస్తున్న యూట్యూబ్ ఛానళ్లు, ప్రసార మాధ్యమాలపై చర్యలు తీసుకోవాలని కోరింది.
టెలికమ్యూనికేషన్ అండ్ ఎలక్ట్రానిక్ మంత్రిత్వశాఖ, ఇంటర్నెట్ ప్రొవైడర్లు రంగంలోకి దిగి అన్స్టాపబుల్ అనధికారిక లింక్స్ తొలగించే పని మొదలు పెట్టారట. ఈ మేరకు ఇప్పటివరకు ఆహాకు సంబంధించి సామజిక మాధ్యమాల్లో షికారు చేస్తున్న లింక్స్ చాలా వరకు తొలగించారని తెలిసింది. మరీ ముఖ్యంగా ప్రభాస్ ఎపిసోడ్ పైరసీ లింక్స్ పై స్పెషల్ కేర్ తీసుకుంటున్నారట.
ప్రభాస్, గోపీచంద్ గెస్ట్ లుగా వచ్చిన ఈ ఎపిసోడ్ మొత్తం 100 నిమిషాలు వచ్చిందని 'ఆహా' అంటోంది. దీన్ని రెండు భాగాలుగా డివైడ్ చేశారు. మొదటి పార్టుకు 'అన్స్టాపబుల్ 2 విత్ ఎన్బీకే - ది బిగినింగ్' అని పేరు పెట్టారు. ఈ ఎపిసోడ్ డిసెంబర్ 29 రాత్రి 9 గంటల నుండి స్ట్రీమింగ్ అవుతోంది. రెండో భాగం అతిత్వరలో షురూ కానుంది.