Balakrishna: తారకరత్న కోరిక తీర్చేందుకు బాలకృష్ణ ప్లాన్..! వైరల్ అవుతున్న క్రేజీ అప్డేట్
Balakrishna: తారకరత్న కోరిక తీర్చేందుకు బాలకృష్ణ ప్లాన్..! వైరల్ అవుతున్న క్రేజీ అప్డేట్
Balakrishna | Tarakaratna: గుండెపోటుతో తారకరత్న చికిత్స తీసుకుంటున్న ఈ సమయంలో బాలయ్య బాబు ఓ నిర్ణయం తీసుకున్నారనే టాక్ బయటకొచ్చింది. ఆయన చేస్తున్న తదుపరి సినిమాలో తారకరత్న రోల్ ఉండాలని డైరెక్టర్ తో చెప్పారట బాలకృష్ణ.
నందమూరి వంశంలో అటు సినిమాల పరంగా, ఇటు రాజకీయాల పరంగా మంచి ఫామ్ లో ఉన్నారు బాలకృష్ణ. ఎంత బిజీ లైఫ్ లో ఉన్నా నందమూరి వంశంలోని అందరు హీరోలతో ఎంతో సరదాగా మెలుగుతుంటారు బాలకృష్ణ. అందుకే నందమూరి ఫ్యామిలీలో బాలయ్యకు స్పెషల్ వాల్యూ ఉంటుంది.
2/ 8
బాలకృష్ణ సోదరుల పిల్లలు ఆయన్ను ఎంతో అభిమానిస్తుంటారు. ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, తారకరత్నలకు బాబాయ్ బాలయ్య బాబు అంటే ఎంతో ఇష్టం అంతకు మించి అభిమానం కూడా. ఇప్పటికే బాలయ్య బాబుతో తెర పంచుకున్నారు కళ్యాణ్ రామ్.
3/ 8
అయితే తారకరత్నకు కూడా బాబాయ్ బాలకృష్ణతో తెర పంచుకోవాలనే కోరిక బలంగా ఉంది. కొన్ని సందర్భాల్లో ఈ విషయాన్ని అందరి ముందు కూడా చెప్పారు తారకరత్న. అయితే ప్రస్తుతం తారకరత్న తీవ్ర అనారోగ్యంతో ఉన్న నేపథ్యంలో.. హెల్త్ సెట్ కాగానే ఆయన కోరిక తీర్చేలా బాలకృష్ణ ప్లాన్స్ చేస్తున్నారట.
4/ 8
ఇటీవలే వీర సింహా రెడ్డి సినిమాతో భారీ విజయం ఖాతాలో వేసుకున్న బాలకృష్ణ.. ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో తన తదుపరి సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. NBK 108 పేరుతో ఈ సినిమా సెట్స్ మీదకొచ్చింది.
5/ 8
బ్లాక్ బస్టర్ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ చేస్తున్న ఈ సినిమా నందమూరి అభిమానులకు డిఫరెంట్ అనుభూతి ఇవ్వనుందట. అయితే ఈ మూవీలో తారకరత్నకు ఓ కీలక పాత్ర ఇవ్వాలని డైరెక్టర్ అనిల్ రావిపూడిని కోరారట బాలకృష్ణ. అందుకు ఆయన కూడా ఓకే చెప్పారని తెలుస్తోంది.
6/ 8
ప్రస్తుతం తారకరత్నకు మెరుగైన వైద్యం అందుతోంది. బెంగళూరు లోని నారాయణ హృదయాలయలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. తారకరత్న ఆరోగ్యం పట్ల అశేష నందమూరి అభిమానుల్లో ఆందోళన నెలకొంది.
7/ 8
గత శుక్రవారం నారా లోకేష్ ప్రారంభించిన యువగళం పాదయాత్రలో పాల్గొన్న తారకరత్న.. సడన్ గా కుప్పకూలడంతో అంతా షాకయ్యారు. వెంటనే ఆయన్ను దగ్గరలోని ఆసుపత్రిలో చేర్చి ఆ తర్వాత బెంగళూరు లోని నారాయణ హృదయాలకు తరలించారు. ప్రస్తుతం ప్రత్యేక వైద్య బృందం ఆయనకు చికిత్స అందిస్తోంది.
8/ 8
తారకరత్నకు చికిత్స జరుగుతోన్న ఆస్పత్రిలోనే ఆయన భార్య అలేఖ్యా రెడ్డి, తండ్రి మోహనకృష్ణతో పాటు పలువురు కుటుంబ సభ్యులు ఉన్నారు. చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఆసుపత్రికి చేరుకొని తారకరత్న ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు.