గతేడాది చివర్లో నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ‘అఖండ’ మూవీ ఎంత పెద్ద హిట్టైయిందో తెలిసిందే కదా. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇక ఈ సినిమాలో సోదరుడి కూతురు కోసం అఖండ వస్తాడు. ఆ పాప చుట్టు కథ తిరుగుతోంది. అంతేకాదు సినిమా చివర్లో నీకు ఎపుడు ఏ సమస్య వచ్చినా.. వెంటనే వస్తానంటూ చెప్పి అఖండ సీక్వెల్‌కు కూడా ప్లాన్ చేశారు.
కళ్యాణ్ రామ్ బింబిసార ఏరియా వైజ్ థియేట్రికల్ బిజినెస్ విషయానికొస్తే.. నైజాం (తెలంగాణ) రూ. 5 కోట్లు.. సీడెడ్ (రాయలసీమ) రూ. 2 కోట్లు.. ఆంధ్ర ప్రదేశ్ రూ. 6.50 కోట్లు.. తెలంగాణ + ఆంధ్ర ప్రదేశ్ కలిపి రూ. 13.50 కోట్లు.. కర్ణాటక + రెస్ట్ ఆఫ్ భారత్ - రూ. 1.1 కోట్లు.. ఓవర్సీస్ - రూ. 1 కోటి రూపాయలు టోటల్ వాల్డ్ వైడ్ కలెక్షన్స్ రూ. 15.60 కోట్లు.. బ్రేక్ ఈవెన్ రూ. 16.20 కోట్లు రాబట్టాలి. ఇక ఈ సినిమాకు వచ్చిన పాజిటివ్ టాక్ నేపథ్యంలో టోటల్ రన్లో ఈ చిత్రం ఏ మేరకు వసూళ్లను రాబడుతుందో చూాడాలి. (Twitter/Photo)
మొత్తంగా బాబాయి బాలకృష్ణ అఖండ నుంచి మొదలు పెడితే.. ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ .. ఇపుడు కళ్యాణ్ రామ్ బింబిసార వరకు నందమూరి హీరోలకు ఒకరి తర్వాత మరొకరికీ పాప సెంటిమెంట్ వర్కౌట్ అయి హిట్స్ తెచ్చిపెట్టింది.ఇక కళ్యాణ్ రామ్ ’బింబిసార’ సక్సెస్ నేపథ్యంలో ఈ సినిమాకు సీక్వెల్ కూడా ప్లాన్ చేస్తున్నట్టు చెప్పారు. (Twitter/Photo)