BalaKrishna : హీరో నందమూరి బాలకృష్ణ ఒక్కోసారి అనూహ్య నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఒక్కోసారి ఆయన నిర్ణయం ఫ్యాన్స్‌ను భయపెట్టిన సందర్భాలున్నాయి. తాజాగా ఈయన ఫామ్‌లోని ఓ క్లాస్ దర్శకుడికి ఓకే చెప్పినట్టు సమాచారం. ‘అఖండ’ తో ఫుల్ ఫామ్‌లోకి వచ్చిన తర్వాత ఇలాంటి ప్రయోగాలు చేయోద్దని కోరుతున్నారు. (Twitter/Photo)
బాలకృష్ణ ఎవరు ఊహించని విధంగా మెగా ఫ్యామిలీకి చెందిన ‘ఆహా’ ఓటీటీకి హోస్ట్‌గా చేయడానికి ఓకే చెప్పడం ఎవరు ఊహించి ఉండరు. అదే కోవలో ‘అఖండ’తో భారీ సక్సెస్‌ను అందుకున్న బాలయ్య.. నెక్ట్స్ ప్రాజెక్ట్స్‌ను గోపీచంద్ మలినేని, అనిల్ రావిపూడి క్రేజీ డైరెక్టర్స్‌తో చేయడానికి ఓకే చెప్పారు. వీళ్లతో పాటు గత కొన్నేళ్లుగా ఫామ్‌లో లేని ఓ క్లాస్ దర్శకుడికి బాలకృష్ణ ఓకే చెప్పినట్టు సమాచారం. (Twitter/Photo)
గతంలో ‘సింహా’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత లెజండరీ డైరెక్టర్ దాసరి నారాయణ రావుతో ‘పరమవీరచక్ర’ సినిమా చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. దర్శకుడిగా దాసరి గురించి ఎంత చెప్పుకున్న తక్కువ. అప్పటికే ఔట్ డేటెడ్ అయిపోయిన పెద్దాయన. దర్శకత్వంలో బాలయ్యతో మంచి కథతో సినిమా చేసినా.. ప్రేక్షకులను మెప్పించడంలో విఫలమైంది. (Twitter/Photo)
ఆ తర్వాత తమిళంలో ‘నరసింహా, ‘భామనే సత్యభామనే’, ముత్తు వంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన కే.యస్. రవికుమార్ దర్శకత్వలో ‘జై సింహా’ సినిమా చేసి మంచి సక్సెస్ అందుకున్న ఈయన ఆ తర్వాత ఆ లెజండరీ దర్శకత్వంలో ‘రూలర్’ సినిమా చేసి చేతులు కాల్చుకున్నారు. తాజాగా బాలయ్య అంతగా ఫామ్‌లోని క్లాస్ దర్శకుడితో నెక్ట్స్ ప్రాజెక్ట్ చేయడానికి ఓకే చెప్పినట్టు సమాచారం. (Twitter/Photo)
తాజాగా బాలకృష్ణ.. క్లాస్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న శ్రీకాంత్ అడ్డాలతో నెక్ట్స్ మూవీ చేయనున్నట్టు జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈయన కెరీర్లో ‘కొత్త బంగారు లోకం’, వెంకటేష్, మహేష్ బాబులతో ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాలు మాత్రమే సక్సెస్ అందుకున్నాయి. ఆ తర్వాత చేసిన ‘బ్రహ్మోత్సవం’ సినిమా డిజాస్టర్‌గా నిలిచింది. గతేడాది వెంకటేష్‌తో ‘నారప్ప’ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్నారు. కానీ ఈ సినిమా తమిళంలో హిట్టైన ధనుశ్ ‘అసురన్’ సినిమాను సేమ్ టూ సేమ్ కాపీ పేస్ట్ చేసాడనే విమర్శలు ఎదుర్కొన్నాడు. ఓటీటీలో విడుదలైన సందర్భంగా నారప్ప హిట్ టాక్ తెచ్చుకుంది. అదే థియేటర్స్‌లో విడుదలైతే బాక్సాఫీస్ దగ్గర వర్కౌట్ అయ్యే చాన్సెస్ తక్కువ ఉండేదనేది వాదన కూడా వినిపించింది. (Twitter/Photo)
ఒకవైపు శ్రీకాంత్ అడ్డాలతో పాటు నందమూరి నట సింహా దర్శకేంద్రుడు కే.రాఘవేంద్రరావుతో మరో చారిత్రక సినిమా చేయడానికి ఓకే చెప్పినట్టు ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సారి శ్రీ వైష్ణవ మతాచార్యులు..ద్వైత మత సిద్ధాంతకర్త...అష్టాక్షరీ మంత్రాన్ని అందరికీ పంచిన రామానుజ చార్యులుగా నటిస్తున్నట్టు సమాచారం. (File/Photo)
గతంలో బాలయ్య ఓ సినిమా ప్రమోషన్లో భాగంగా అది కూడా తన అరవై యేళ్లు వచ్చినపుడు ఈ క్యారెక్టర్ చేస్తా అని చెప్పారు. అందుకు తగ్గట్టు ఇపుడు బాలయ్య ఈ పాత్ర చేయడానికి రెడీ అయినట్టు సమాచారం. ఇప్పటికే జె.కే.భారవి ఈ సినిమా కథ అంతా రెడీ చేసినట్టు సమాచారం. ఇక రామానుజాచార్యులు వంటి ఉదాత్తమైన పాత్రలు స్టార్ హీరోలు చేసేది రేర్ కాబట్టి ఇటువంటి సినిమాల రావాల్సిన అవసరం ఎంతైనా వుంది. రాఘవేంద్రరావు ఈ సినిమాను డైరెక్ట్ చేసే అవకాశం ఉంది. త్వరలో ఈ సినిమా విషయమై అఫీషియల్ ప్రకటన వెలుబడాల్సి ఉంది.Twitter/Photo)
బాలకృష్ణ, కే.రాఘవేంద్రరావు కాంబినేషన్లో పలు చిత్రాలు వచ్చినా.. ఏవి పెద్దగా బ్లాక్ బస్టర్స్ నమోదు చేయలేదు. పైగా ఈయన ఇపుడు ఫామ్‌లో లేరు. మరి ఫామ్‌లో లేని దర్శకుడితో బాలయ్య అది కూడా రామానుజాచార్యులు వంటి చారిత్రక మహాత్ముల పాత్ర చేస్తుండంతో ఫ్యాన్స్ మాత్రం రిస్క్‌తో కూడుకున్న వ్యవహారం అని భయపెడుతున్నారు. ఇక బాలయ్య చేస్తోన్న ఇతర చిత్రాల విషయానికొస్తే..
Balakrishna | ప్రస్తుతం బాలకృష్ణ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘అఖండ’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఇప్పటికే ఓవరాల్‌గా రూ. 200 కోట్ల గ్రాస్.. రూ. 80 కోట్ల షేర్ రాబట్టింది ఈ మూవీ. సింహా, లెజెండ్ వంటి బ్లాక్ బస్టర్స్ తర్వాత వస్తోన్న ఈ సినిమాపై అంచనాలకు తగ్గటే భారీ సక్సెస్ నమోదు చేసింది . (Twitter/Photo)
బాలకృష్ణతో చేయబోయే సినిమాను గోపీచంద్ మలినేని తనదైన యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌కు రియలిస్టిక్ స్టోరీతో పల్నాడు బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిస్తున్నట్టు సమాచారం.. ఈ సినిమాలో బాలయ్య మరోసారి ఫ్యాక్షన్ లీడర్‌గా, పోలీస్ ఆఫీసర్‌గా నటించబోతున్నట్టు సమాచారం. ఈ సినిమాకు ‘వేట పాలెం’ తో పాటు ‘పెద్దాయన’ అనే టైటిల్స్ పరిశీలిస్తున్నారు. (Twitter/Photo)
గోపీచంద్ మలినేని సినిమా తర్వాత బాలయ్య అనిల్ రావిపూడితో సినిమా చేయనున్నట్టు అభిమానులతో బాలయ్య కన్ఫామ్ చేసారు. గతంలో అనిల్ రావిపూడి బాలకృష్ణ 100వ సినిమా సమయంలోనే ఆయనకి ఒక కథను వినిపించాడట. అప్పట్లో ఈ కాంబినేషన్ సెట్ కాలేదు. కానీ అనిల్ రావిపూడి అదే కథను కొన్ని మార్పులతో బాలయ్యను ఒప్పించారు. ఈ విషయాన్ని బాలయ్య టాక్ షోలో అనిల్ రావిపూడి స్వయంగా వెల్లడించారు. (Twitter/Photo)
ఇక బాలయ్య కూడా పూరీతో సినిమా అంటే చేస్తానని ఎన్నోసార్లు చెప్పారు. విజయ్ దేవరకొండ తో చేస్తోన్న లైగర్ తర్వాత ఈ సినిమా పట్టాలెక్కే అవకాశాలున్నాయి. కొన్ని రోజుల క్రితం గోవాలో పూరీ చెప్పిన కథకు బాలయ్య ఓకే చెప్పినట్టు సమాచారం. అంతేకాదు రీసెంట్గా అన్‌స్టాపబుల్ షోలో మరోసారి పూరీ జగన్నాథ్ కన్ఫామ్ చేసారు. ఇక బాలయ్య పూరీ లైగర్‌లో మైక్ టైసన్ పాత్రకు డబ్బింగ్ చెప్పబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. Balakrishna in Liger sets Photo : Twitter
అటు బాలయ్య, కొరటాల శివతో ఓ సినిమా చేయనున్నట్టు వార్తలు వచ్చాయి. దీనిపై ఎలాంటి క్లారిటీ లేదు. ఒక వేళ వీళ్లిద్దరి కాంబినేషన్లో సినిమా వస్తే అభిమానులకు పండగే. ప్రస్తుతం కొరటాల శివ.. చిరంజీవి, రామ్ చరణ్‌లతో ఆచార్య సినిమా చేసారు. ఈ సినిమా ఫిబ్రవరి 4న విడుదల కానుంది. ఆ తర్వాత ఎన్టీఆర్ సినిమా ఉంది. ఆ తర్వాత అల్లు అర్జున్ చేయనున్నారు. ఆ తర్వాత వీళ్లిద్దరి సినిమా ఉండే అవకాశం ఉంది. (Twitter/Photo)
సింగీతం సినీ జైత్రయాత్రలో మరో మజీలీ ‘ఆదిత్య 369’. బాలకృష్ణ హీరోగా, భారతీయ తెరపై తొలి టైం మిషన్ కథాంశంతో రూపొందించిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించింది. ఈ సీక్వెల్‌కు బాలయ్య తో పాటు సింగీతం కథను ఫైనల్ చేసారట. బాలయ్య ఈ సినిమాను తన తనయుడుతో ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. ఈ సినిమాను బాలయ్య డైరెక్ట్ చేస్తారా లేదా సింగీతం చేతిలో పెడతారా అనేది చూడాలి. . ఇందులో నట సింహం తన తనయుడుతో కలిసి నటించబోతున్నట్టు ప్రకటించారు. ఈ సినిమాకు ‘ఆదిత్య 999 మాక్స్’ అనే టైటిల్ కన్ఫామ్ చేసారు. (Twitter/Photo)
తాజాగా బాలయ్యతో ఎవరు ఊహించని విధంగా ‘ఆహా’ టాక్ షోకు హోస్ట్‌గా ఒప్పించిన అల్లు అరవింద్.. తన ఓన్ బ్యానర్ గీతా ఆర్ట్స్‌లో బాలకృష్ణ హీరోగా క్రిష్ దర్శకత్వంలో ఓ భారీ సినిమాకు ప్లాన్ చేసినట్టు సమాచారం. కానీ అల్లు అరవింద్.. కళ్యాణ్ రామ్‌తో ‘బింబిసార’ సినిమాను తెరకెక్కిస్తోన్న మల్లిడి వేణు దర్శకత్వంలో సినిమా నిర్మించాలనే ప్లాన్‌లో ఉన్నారు.
త్వరలో గీతా ఆర్ట్స్‌లో బాలయ్య హీరోగా మల్లిడి వేణు దర్శకత్వంలో అల్లు అరవింద్ నిర్మాతగా సినిమాను అఫీషియల్‌గా ప్రకటించే అవకాశం ఉంది. ముఖ్యంగా మెగా ఫ్యామిలీ నిర్మాత ఇపుడు అది కూడా మెగా హీరోలకు మెయిన్ కాంపీటీటర్ అయిన నందమూరి హీరోతో సినిమా అనగానే ప్రేక్షకుల్లో అంచనాలు పెరగడం ఖాయం అనే చెప్పాలి. ఇప్పటి వరకు గీతా ఆర్ట్స్‌లో అక్కినేని హీరోలైన ‘ఏఎన్నార్, నాగ చైతన్య, అఖిల్నటించారు. కానీ నందమూరి హీరోలెవరు ఈ బ్యానర్లో నటించలేదు. ఇపుడు బాలయ్య హీరోగా అల్లు అరవింద్ సినిమా తీసి నందమూరి హీరోలతో సినిమా తీయలేదన్న లోటును పూరించుకోనున్నారు. (Twitter/Photo)
మరోవైపు బాలకృష్ణ.. హారిక అండ్ హాసిని క్రియేషన్స్‌లో ఓ సినిమా చేయనున్నట్టు చెప్పారు. ఈ సినిమాను ఎవరు డైరెక్ట్ చేసేది మాత్రం చెప్పలేదు. ఈ సినిమా హారికా అండ్ హాసిని క్రియేషన్స్‌లో తెరకెక్కుతుందా.. లేదా సితార ఎంటర్ట్మెంట్లో సెట్స్ పైకి వెళ్లనుందా అనేది చూడాలి. ఒకవేళ హారికా అండ్ హాసిని అంటే త్రివిక్రమ్ డైరెక్ట్ చేసే అవకాశం ఉంది. మరోవైపు సితార ఎంటర్టైన్మెంట్ బోయపాటితోనే బాలయ్య సినిమాను ప్లాన్ చేసినట్టు సమాచారం. (Twitter/Photo)