Veera Simha Reddy 5 Days World Wide Box Office Collections: నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘వీరసింహారెడ్డి’.శృతి హాసన్ హీరోయిన్గా నటించింది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ భారీ ఎత్తున నిర్మించింది.సంక్రాంతి కానుకగా ఈ నెల 12న విడుదలైన వీరిసింహారెడ్డి తొలి రోజు రికార్డు బ్రేక్ కలెక్షన్స్ సాధించింది. కనుమతో 5రోజుల పూర్తి చేసుకున్న ఈ సినిమా రూ. 100 కోట్ల క్లబ్బులో చేరింది. అఖండ తర్వాత రూ. 100 కోట్ల గ్రాస్ క్లబ్బులో చేరిన రెండో బాలయ్య చిత్రంగా వీరిసింహారెడ్డి రికార్డ్స్ క్రియేట్ చేసింది. (Twitter/Photo)
అఖండ సినిమా తర్వాత బాలయ్య వరుసగా సినిమాలను చేస్తున్నారు. అందులో భాగంగా గోపీచంద్ మలినేనితో వీరసింహారెడ్డి అనే సినిమాను చేశారు. మంచి అంచనాల నడుమ ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదలై పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. మొదటి రోజు రికార్డు బ్రేక్ కలెక్షన్స్ రాబట్టింది. రెండో రోజు కూడా అదే దూకుడుతో బాక్సాఫీస్ దగ్గర పర్ఫామ్ చేస్తోంది. ఇప్పటికే యూఎస్ బాక్సాఫీస్ దగ్గర 1 మిలియన్ యూస్ డాలర్స్‌ను కలెక్ట్ చేసి 1.5 మిలియన్ క్లబ్బు వైపు పరుగులు తీస్తోంది. (Photo : Twitter)
ఈ సినిమాకు బాలయ్య కెరీర్ లోనే ఆల్ టైం హైయెస్ట్ ఓపెనింగ్స్ వచ్చాయి. వీరసింహారెడ్డికి తొలి రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ. 23.35 కోట్ల షేర్ రాబట్టింది. ప్రపంచ వ్యాప్తంగా తొలి రోజు రూ. 31.05 కోట్ల షేర్ (రూ. 50.10 కోట్ల గ్రాస్) కలెక్షన్స్ రాబట్టింది. రెండో రోజు రూ. 6.15 కోట్లు.,., (రూ. 11.05 కోట్ల గ్రాస్).. మూడో రోజు.. రూ. 7.30 కోట్లు.. (రూ. 12.75 కోట్లు గ్రాస్).. నాల్గో రోజు.. రూ. 8.15 కోట్లు.. (రూ. 14.20 కోట్ల గ్రాస్).. ఐదో రోజు .. రూ. 7.25 కోట్ల షేర్.. రూ. (రూ. 12.50 కోట్ల గ్రాస్) వసూళ్లను సాధించింది. (Photo : Twitter)
ఈ సినిమా ఐదు రోజుల బాక్సాఫీస్ కలెక్షన్స్ విషయానికొస్తే. తెలంగాణ (నైజాం)లోరూ. 13.67కోట్లు.. సీడెడ్ (రాయలసీమ)లో రూ. 13.55 కోట్లు . ఉత్తరాంధ్ర.. రూ. 5.16 కోట్లు .. తూర్పు గోదావరి.. రూ. 3.96 కోట్లు.. పశ్చిమ గోదావరి.. రూ. 3.20 కోట్లు .. గుంటూరు..రూ. 5.30 కోట్లు .. కృష్ణ.. రూ. 3.51 కోట్లు నెల్లూరు .. రూ. 2.18 కోట్లు.. తెలంగాణ + ఆంధ్ర ప్రదేశ్ కలిపి ఐదు రోజుల బాక్సాఫీస్ కలెక్షన్స్ రూ. 50.55 కోట్లు / రూ. 81.75 కోట్లు.. కర్ణాటక + రెస్టాఫ్ భారత్.. రూ. 4.05 కోట్లు ఓవర్సీస్.. రూ. 5.40 కోట్లు ప్రపంచ వ్యాప్తంగా నాలుగవ రోజు కలిపి రూ. రూ. 60 కోట్లు షేర్ / రూ. 105 కోట్లు గ్రాస్) ఈ సినిమా రూ. 73 కోట్ల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ చేసింది. ఈ సినిమా హిట్ అనిపించుకోవాలంటే రూ. 14 కోట్ల షేర్ రాబట్టాలి. (Twitter/Photo)
తెలంగాణ (నైజాం)లో రూ. 15 కోట్లు.. సీడెడ్ (రాయలసీమ)లో రూ. 13 కోట్లు.. ఉత్తరాంధ్ర.. రూ. 9 కోట్లు.. తూర్పు గోదావరి.. రూ. 5.2 కోట్లు.. పశ్చిమ గోదావరి.. రూ. 5 కోట్లు.. గుంటూరు.. రూ. 6.40 కోట్లు.. కృష్ణ.. రూ. 5 కోట్లు.. నెల్లూరు .. రూ. 2.7 కోట్లు.. తెలంగాణ + ఆంధ్ర ప్రదేశ్ కలిపి రూ. 61.30 కోట్లు.. కర్ణాటక .. రూ. 4.50 కోట్లు.. రెస్టాఫ్ భారత్ .. రూ. 1 కోటి.. ఓవర్సీస్.. రూ. 6.2 కోట్లు.. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ. 73 కోట్ల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ చేసింది. ఈ సినిమా హిట్ అనిపించుకోవాలంటే రూ. 74 కోట్ల షేర్ .. బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలో దిగింది ( (Twitter/Photo)
వీరసింహారెడ్డి సినిమాలో బాలయ్య .. వీరసింహారెడ్డిగా.. జైసింహారెడ్డిగా తండ్రీ కొడుకులుగా రెండు విభిన్న పాత్రల్లో అలరించాడు. ఈయన ద్విపాత్రాభినయం చేసిన 17వ చిత్రం. ఈయన చెల్లెలు కమ్ మేనత్త పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటించింది. ఈ సినిమాలో దునియా విజయ్ విలన్ పాత్రలో నటించారు. (Twitter/Photo)
ఇప్పటికే విడుదలైన ఈ సినిమాలో కూడా లెజెండ్ తరహాలో పొలిటికల్ డైలాగులు పేలాయి. ముఖ్యంగా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ డైరెక్ట్ ఎటాక్ చేసారు. సంతకాలు పెడితే బోర్డు పై పేరు మారుతుందేమో... ఆ చరిత్ర సృష్టించిన వాడి పేరు మారుదు.. మార్చలేరు అంటూ.. రీసెంట్గా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును వైయస్ఆర్ హెల్త్ యూనివర్సిటీగా మార్చడంపై సెటైర్లు వేసారు బాలయ్య. ఈ డైలాగులకు థియేటర్స్‌లో సూపర్ రెస్పాన్స్ వచ్చింది. (Twitter/Photo)
ఇక అది అలా ఉంటే ఈ చిత్రానికి సంబంధించిన ఓటీటీ పార్ట్నర్ విషయంలో క్లారిటీ వచ్చింది. ఈ సినిమాను ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థ డిస్నీ హాట్ స్టార్ భారీ ధరకు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. హాట్ స్టార్ బాలయ్య వీరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన స్ట్రీమింగ్ రైట్స్‌ను దాదాపుగా 14కోట్లు పెట్టి కొన్నట్లు తెలుస్తోంది. ఇక బాలయ్య గత చిత్రం అఖండ స్ట్రీమింగ్ రైట్స్ కూడా హాట్ స్టార్ వద్ద ఉన్న సంగతి తెలిసిందే. వీరసింహారెడ్డి విడుదలైన ఎనిమిది వారాలకు హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్కు రానుంది. Photo : Twitter
ఇక ఈ చిత్రంలో బాలయ్య సరసన శృతి హాసన్ హీరోయిన్గా నటించింది. ఇతర ముఖ్య పాత్రల్లో వరలక్ష్మి శరత్ కుమార్, దునియా విజయ్, హానీ రోజ్ నటించారు. కామెడీ పాళ్లు లేకపోవడం.. సీరియస్‌గా సాగే కథనం ఈ సినిమాకు ఇబ్బంది పెట్టే అంశాలు. ముక్యంగా వీరసింహారెడ్డిలోని కంటెంట్ ఎక్కువగా మాస్కు అప్పీల్ అవ్వుతుండడంతో బి,సి సెంటర్స్‌లో వీరసింహారెడ్డి అదరగొడుతోంది. Photo : Twitter
ఇప్పటికే సంక్రాంతి బరిలో విడుదలైన ఈ సినిమాకు పాజిటివ్ సొంతం చేసుకుని దూసుకుపోతుంది. మొత్తంగా ఈ వీకెండ్ వరకు ఈ సినిమా బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకొని లాభాల్లోకి వచ్చే అవకాశాలున్నాయి. ఇప్పటికే ముప్పావు టార్గెట్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ముందు ముందు ఏ మేరకు బాక్సాఫీస్ దగ్గర మాయ చేస్తుందో చూడాలి. (Twitter/Photo)