Balakrishna Unstoppable Talk Show : ‘ఆహా’ ఓటీటీ కోసం బాలకృష్ణ వర్కింగ్ స్టిల్స్.. సోషల్ మీడియాలో వైరల్..

Balakrishna Unstoppable Talk Show With NBK : ప్రస్తుతం తెలుగు హీరోలు ట్రెండ్‌కు తగ్గట్టు అప్డేట్ అవుతున్నారు. కేవలం సినిమాలనే కాకుండా.. ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌తో పాటు స్మాల్ స్క్రీన్ పై సందడి చేస్తున్నారు. ఒకప్పుడు టీవీల్లో కనిపించడానికి నామోషీగా ఫీలయ్యే హీరోలు.. ఇపుడు చిన్ని తెరపై కూడా సందడి చేస్తున్నారు. ఈ కోవలోనే సీనియర్ టాలీవుడ్ టాప్ హీరో బాలకృష్ణ.. ‘ఆహా’ ఓటీటీ కోసం హోస్ట్ అవతారం ఎత్తారు. దానికి సంబంధించి వర్కింగ్ స్టిల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.