Balakrishna Nandamuri - Mani Sharma | తెలుగు సినీ ఇండస్ట్రీలో నందమూరి బాలకృష్ణ, మణి శర్మ కాంబినేషన్లో వచ్చిన చిత్రాల్లో ఎక్కువగా మ్యూజికల్ హిట్స్‌గా నిలిచాయి. సమరసింహారెడ్డితో మొదలైన వీళ్ల కాంబినేషన్ లయన్ వరకు కొనసాగింది. వీళ్ల కాంబినేషన్లో చిత్రాల్లోని గీతాలు ప్రేక్షకాదరణ పొందాయి. కొన్ని చిత్రాలు ఫ్లాప్‌గా కూడా నిలిచినా.. మ్యూజికల్‌గా మంచి సక్సెస్ అందుకున్నాయి. వీళ్ల కాంబినేషన్లో వచ్చిన చిత్రాల విషయానికొస్తే.. (Twitter/Photo)
మొత్తంగా బాలకృష్ణ, మణి శర్మ కాంబినేషన్లో 13 చిత్రాలు తెరకెక్కితే.. అందులో 2 ఇండస్ట్రీ హిట్స్.. మరో 4 చిత్రాలు హిట్, యావరేజ్‌గా నిలిచాయి. మిగిలిన చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచాయి. మొత్తంగా టాలీవుడ్లో బాలయ్య, మణిశర్మ కాంబినేషన్‌కు ఇప్పటికీ మంచి క్రేజ్ ఉంది. వీల్ల కలయికలో మరో చిత్రం వస్తే చూడాలనుకునే అభిమానులున్నారు. (Twitter/Photo)