గోపీచంద్ మలినేని సినిమా తర్వాత బాలయ్య అనిల్ రావిపూడితో సినిమా చేయనున్నట్టు అభిమానులతో బాలయ్య కన్ఫామ్ చేసారు. గతంలో అనిల్ రావిపూడి బాలకృష్ణ 100వ సినిమా సమయంలోనే ఆయనకి ఒక కథను వినిపించాడట. అప్పట్లో ఈ కాంబినేషన్ సెట్ కాలేదు. కానీ అనిల్ రావిపూడి అదే కథను కొన్ని మార్పులతో బాలయ్యను ఒప్పించారు. (Twitter/Photo)
సింగీతం సినీ జైత్రయాత్రలో మరో మజీలీ ‘ఆదిత్య 369’. బాలకృష్ణ హీరోగా, భారతీయ తెరపై తొలి టైం మిషన్ కథాంశంతో రూపొందించిన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించింది. ఈ సీక్వెల్‌కు బాలయ్య కథను రెడీ చేసుకోవడంతో పాటు తన తనయుడుతో ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. ఇందులో బాలయ్య తన తనయుడుతో కలిసి నటించబోతున్నట్టు ప్రకటించారు. ఈ సినిమాకు ‘ఆదిత్య 999 మాక్స్’ అనే టైటిల్ కన్ఫామ్ చేసారు. (Twitter/Photo)
మరోవైపు బాలకృష్ణ.. హారిక అండ్ హాసిని క్రియేషన్స్‌లో ఓ సినిమా చేయనున్నట్టు చెప్పారు. ఈ సినిమాను ఎవరు డైరెక్ట్ చేసేది మాత్రం చెప్పలేదు. ఈ సినిమా హారికా అండ్ హాసిని క్రియేషన్స్‌లో తెరకెక్కుతుందా.. లేదా సితార ఎంటర్ట్మెంట్లో సెట్స్ పైకి వెళ్లనుందా అనేది చూడాలి. మొత్తంగా నందమూరి నట సింహం వరుసగా క్రేజీ దర్శకులతో తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌లతో పలకరించనున్నారు.. (Twitter/Photo)