బాలకృష్ణ, కోదండరామిరెడ్డి కాంబినేషన్లో తెరకెక్కిన ఈ చిత్రానికి పరుచూరి బ్రదర్స్ కథ, మాటలు అందించారు. ఇళయరాజా సంగీతం అందించారు. ఈ సినిమాలో మాస్ మహారాజ్ రవితేజ ఓ చిన్న పాత్రలో నటించారు. అటు నటుడిగా దర్శకుడు, రచయత, నిర్మాత పోసాని కృష్ణమురళి తొలిసారి వెండితెరపై కనిపించింది ఈ సినిమాలోనే కావడం విశేషం. (Twitter/Photo)
‘ధర్మక్షేత్రం’ సినిమా మ్యూజికల్‌గా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది ముఖ్యంగా దివంగత వేటూరి సుందరరామ్మూర్తి గారు రాసిన ‘ఎన్నో రాత్రులు వస్తాయి కానీ’ సహా ఈ చిత్రంలోని పాటలన్ని హిట్ సాధించాయి. ఈ సినిమాకు మంచి టాక్ వచ్చినా.. అనుకున్నంత రేంజ్లో మాత్రం సక్సెస్ కాలేదు. బాక్సాఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ సాధించి యావరేజిగా నిలిచింది. అయినా నందమూరి అభిమానులు ఈ సినిమాను సూపర్ హిట్‌గా పరిగణిస్తూ ఉంటారు. (Twitter/Photo)