నందమూరి నట సింహం బాలకృష్ణ (Balakrishna)ప్రధాన పాత్రలో మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను (Boyapati Srinu) దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ ఫిల్మ్ అఖండ (Akhanda). ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్గా, జగపతిబాబు, శ్రీకాంత్, పూర్ణ కీలక పాత్రలో నటించారు. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. భారీ అంచనాల నడుమ గతేడాది డిసెంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి వసూళ్లను రాబట్టింది. తాజాగా ఈ సినిమా ఈ శనివారంతో 100 రోజులు పూర్తి చేసుకోనుంది. (Twitter/Photo)
50 రోజులు.. 100 రోజులు.. 150 రోజులు.. 175 రోజులు.. 200 రోజులు.. ఇలాంటి పోస్టర్స్ బహుశా ఒకప్పుడు కనిపించేవి కానీ గత పదేళ్లుగా కనిపించడం లేదు. ఒకప్పుడు తమ హీరో సినిమా ఇన్ని సెంటర్స్‌లో 100 రోజులు ఆడిందంటూ గర్వంగా చెప్పుకునేవాళ్లు అభిమానులు. కానీ ఇప్పుడు అలా కాదు.. మా హీరో సినిమా ఫస్ట్ వీక్‌లో ఇన్ని వందల కోట్లు వసూలు చేసిందని చెప్పుకుంటున్నారు. (Twitter/Photo)
ఈ సమయంలో మూడు వారాలు ఆడిందంటే చరిత్రలో నిలిచిపోవడం ఖాయం. ఇలాంటి పరిస్థితుల్లో బాలయ్య ‘అఖండ’ 50 రోజులు పూర్తి చేసుకుంది. అంతేకాదు ఈ సినిమా 50వ రోజు 103 థియేటర్స్‌లో ప్రదర్శించ బడటం ఒక రికార్డు అని చెప్పాలి. అది ఓ రికార్డు అనుకుంటే.. ఇపుడీ సినిమా ఏకంగా శనివారంతో సెంచరీ పూర్తి చేసుకొని హిస్టరీ రిపీట్ చేసింది. ఈ సందర్భంగా శనివారం STBC గ్రౌండ్స్ కర్నూలులో ఈ సినిమా కృతజ్ఞత సభ ఏర్పాటు చేసారు. ఈ వేడుకకు బాలయ్య, బోయపాటి తో చిత్ర నటీనటులు దర్శకులు రానున్నారు. (Twitter/Photo)
ముఖ్యంగా తమిళనాడు, కేరళ, నార్త్ ప్రేక్షకులు ఈ సినిమాను సబ్ టైటిల్స్‌లో చూసినట్టు సోషల్ మీడియాలో పోస్టులు కూడా చేసారు. భాషతో సంబంధం లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తోన్న ‘అఖండ’ చిత్రాన్ని ఇపుడు వివిధ భాషల్లో డబ్ చేసి రీమేక్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఇక తమిళనాడులోకూడా ఈ సినిమా విడుదల మంచి విజయాన్నే అందుకుంది. (Twitter/Photo)
మరోవైపు మలయాళం, కన్నడతో పాటు హిందీ హక్కులు తీసుకున్నవారు ఈ సినిమాను ఆయా భాషల్లో డబ్ చేసి రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ముందుగా హిందీలో ఈ సినిమాను రీమేక్ చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి. కానీ అఘోరగా బాలయ్య పర్ఫామెన్స్ చూసి ఈ సినిమాను బాలీవుడ్లో రీమేక్ చేసేకంటే డైరెక్ట్ డబ్బింగ్ వెర్షన్ రిలీజ్ చేస్తే బాగుంటుందనే టాక్ అక్కడి ప్రేక్షకుల నుంచి డిమాండ్ వస్తోంది. ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా నార్త్ ఆడియన్స్ ఈ సినిమాను హిందీలో డబ్ చేయమని కోరుతున్నారు. ఈ నేపథ్యంలో త్వరలోనే ఈ సినిమా హిందీ వెర్షన్ ప్రేక్షకుల ముందుకు రానుంది. (Twitter/Photo)
ఒకవేళ హిందీతో పాటు ఆయా భాషల్లో ‘అఖండ’ డబ్బింగ్ వెర్షన్‌కు మంచి రెస్పాన్స్ వస్తే.. నెక్ట్స్ గోపీచంద్ మలినేనితో పాటు చేయబోయే సినిమాలను బాలయ్య ప్యాన్ ఇండియా లెవల్లో రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. మరి తెలుగు ఆడియన్స్‌ను అట్రాక్ట్ చేసి ‘అఖండ’ మిగతా భాష ప్రేక్షకులను అలిస్తుందా లేదా అనేది చూడాలి. (Twitter/Photo)
నందమూరి నట సింహం బాలకృష్ణ రెండు విభిన్న పాత్రల్లో మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను డైరెక్ట్ చేసిన అఖండ (Akhanda) చిత్రానికి థమన్ అద్భుతమైన సంగీతం అందించారు. మరోవైపు ఈ చిత్రం హైదరాబాద్ RTC X రోడ్స్‌లో రూ. కోటి రూపాయల గ్రాస్ వసూళ్లు సాధించింది. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత బాలయ్య నటించిన ఓ సినిమా ఆర్జీసీ క్రాస్ రోడ్లో రూ. కోటి కలెక్ట్ చేయడం విశేషం. (Twitter/Photo)
‘అఖండ’ గా ఆ పాత్ర బాలయ్య తప్ప ఇంకే హీరో కూడా చేయలేడంటూ నందమూరి ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. కామన్ ఆడియన్స్ కూడా బాలయ్య నటనకు ఫిదా అయిపోతున్నారు. లాజిక్స్ లేకపోయినా కూడా మాస్ మ్యాజిక్ ఈ సినిమాలో బాగానే పని చేసింది. సినిమాలో చిన్న చిన్న లోపాలున్నా కూడా కాంబినేషన్ క్రేజ్ సినిమాకు భారీ లాభాలు తీసుకొచ్చింది. కేవలం హైదరాబాద్ ఆర్జీసీ క్రాస్ రోడ్స్‌తో పాటు మహేష్ బాబుకు చెందిన AMB నుంచి రూ. కోటి రూపాయల గ్రాస్ వసూళ్లను సాదించి ఔరా అనిపించింది బాలయ్య అఖండ. (Twitter/Photo)
ఇదిలా ఉంటే అఘోరా పాత్రలో బాలయ్యను చూసేందుకు నిజమైన అఘోరాలు థియేటర్స్‌కు వచ్చారు. తెలుగు రాష్ట్రాల్లో నెల రోజుల పాటు అఖండ హవా భీభత్సంగా కనిపించింది. పుష్ప వచ్చిన తర్వాత కూడా అఖండ జోరు తగ్గలేదు. ఎక్కడ చూసినా కూడా జన జాతర కనిపిస్తుంది. ఆమధ్య విశాఖ జిల్లాలోని నర్సీపట్నంలో ఉన్న బంగార్రాజు థియేటర్‌కు నిజమైన అఘోరాలు వచ్చారు.
అగ్రిమెంట్ కుదుర్చుకున్నపుడే సినిమా విడుదలైన 30 రోజుల తర్వాత స్ట్రీమింగ్ చేయాలని అనుకున్నారు కానీ సినిమాకు థియేటర్స్‌లో వసూళ్లు బాగా వస్తుండటంతో 30 కాస్తా 50 రోజులు అయింది. సంక్రాంతికి సినిమాను విడుదల చేయాలనుకున్నా కూడా మరో 10 రోజులు పొడిగించారు. ఈ రోజుల్లో చాలా వరకు సినిమాలకు 30 రోజులు మాత్రమే డెడ్ లైన్ పెడుతున్నారు నిర్మాతలు. అలా చేస్తే వాళ్లకు కూడా ఎక్కువ రేట్ వస్తుంది.
‘అఖండ’ మూవీ రూ. 150 కోట్ల గ్రాస్ క్లబ్లో అడుగుపెట్టింది. ఇక నాన్ థియేట్రికల్ కలిపి ఈ సినిమా రూ. 200 క్లబ్బులో ప్రవేశించినట్టు ‘అఖండ’ చిత్ర నిర్మాతలు రూ. 200 క్లబ్‌తో కూడిన పోస్టర్‌ను విడుదల చేశారు. 50 రోజుల మాట వినబడక చాలా రోజులు అయిపోయింది. 2020 పండగ సినిమాలు సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో అతి కష్టమ్మీద 50 రోజులు ఆడాయి. ఆ తర్వాత కరోనా రావడంతో ఆ మాటే గగనం అయిపోయింది. (Twitter/Photo)
బాలయ్య సినిమాలకు తెలంగాణ, ఏపీల కంటే సీడెడ్ (రాయలసీమ)లో తిరుగులేని ఫ్యాన్ బేస్ ఉంది. బాలయ్య చిత్రాలకు ఎక్కువ వసూళ్లు ఈ ఏరియాల్లోంచే వస్తుంటాయి. ఈ ఏరియాలోని బాలయ్య సినిమాలకు ఎక్కువ రెవెన్యూ వస్తూ ఉంటాయి. ఇక బాలయ్య, బోయపాటి శ్రీను కాంబోలో వచ్చిన రెండో సినిమా ‘లెజెండ్’ సినిమా కడప, కర్నూలు జిల్లా సెంటర్స్‌లో 400 రోజులు పైగా ఆడింది. కడపలో ఓ సెంటర్లో 1000 రోజులు పైగా ప్రదర్శించబడింది. సౌత్ సినీ ఇండస్ట్రీలో ఏ హీరోకు ఈ రికార్డు లేదు. తాజాగా బాలయ్య ‘అఖండ’ సినిమా ఎమ్మిగనూరులో 100 రోజులు పూర్తి చేసుకోనుంది. ఈ సెంటర్లో బాలయ్య సినిమాలు ఏకంగా 11 సినిమాలు డైరెక్ట్‌గా 4 షోలతో కంటిన్యూ 100 రోజులుగా పైగా ఆడి రికార్డు క్రియేట్ చేశాయి.
సీడెడ్‌లో ఈ రెంజ్లో 100 రోజులకు పైగా బాలయ్య సినిమాలు ఓ రేంజ్లో బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించాయి. రాయలసీమలో ఈ రికార్డు ఉన్న ఏకైక హీరో బాలయ్య మాత్రమే. బాలయ్య గత సినిమాలు పెద్దన్నయ్య, సమమర సింహా రెడ్డి, నరసింహానాయుడు, చెన్నకేశవరెడ్డి, లక్ష్మీ నరసింహా, సింహా, లెజెండ్, డిక్టేటర్, గౌతమీపుత్ర శాతకర్ణి, జై సింహా సినిమాల తర్వాత ‘అఖండ’ ఆ లిస్టులో చేరింది. ఈ సినిమాలే కాకుండా బాలయ్య నటించిన పలు సినిమాలు షిప్టులతో 100 రోజులు ఆడిన సందర్భాలున్నాయి. ఇందులో సమరసింహాెరెడ్డి, నరసింహనాయుడు సినిమాలు సిల్వర్ జూబ్లీ జరుపుకున్నాయి. లెజెండ్ ఏకంగా 421 రోజులు ఆడి హిస్టరీ తిరగ రాసింది. (Twitter/Photo)