Balakrishna - Mahesh Babu - Allu Arjun: హాట్రిక్ కాంబినేషన్స్‌తో ప్రేక్షకులకు ముందుకు రాబోతున్న బాలకృష్ణ, మహేష్ బాబు.. అల్లు అర్జున్ .. బాలకృష్ణ, బోయపాటి శ్రీనుతో ‘అఖండ’తో పలకరించనున్నారు.మరోవైపు అల్లు అర్జున్, సుకుమార్‌తో ‘పుష్ప’ సినిమాతో రానున్నారు. ఇక మహేష్ బాబు కూడా చాలా యేళ్ల తర్వాత త్రివిక్రమ్‌తో హాట్రిక్ కాంబినేషన్‌కు రెడీ అయ్యారు. (Twitter/Photo)
ప్రస్తుతం టాలీవుడ్ హీరోలందరు తమకు గతంలో హిట్టిచ్చిన దర్శకులతో పనిచేయడానికి ఇంట్రెస్ట్ చూపెడుతున్నారు. వీళ్ల బాటలోనే మరికొంత మంది హీరోలు, దర్శకులు ముచ్చటగా తమకు హిట్టిచ్చిన దర్శకులతో ముచ్చటగా మూడోసారి పనిచేస్తూ హాట్రిక్ పై కన్నేసారు. కొంత మంది రెండోసారి తమకు హిట్టిచ్చిన దర్శకులతో పనిచేస్తున్నారు. అందులో బాలకృష్ణ, అల్లు అర్జున్,ఎన్టీఆర్, రామ్ చరణ్ సహా చాలా మంది హీరోలున్నారు. (Twitter/photos)
ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ.. బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘అఖండ’ సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా క్లైమాక్స్ షూటింగ్ తమిళనాడులోని పురాతన శివాలయంలో జరుగుతోంది. ‘సింహా’, ‘లెజెండ్’ వంటి బ్లాక్ బస్టర్స్ తర్వాత వీళ్లిద్దరి కలయికలో వస్తోన్న మూడో చిత్రం. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదిని ప్రకటించే అవకాశం ఉంది. (Twitter/Photo)