పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ ‘భీమ్లా నాయక్’ (Bheemla Nayak). ఈ చిత్రానికి సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించగా.. త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, కథనం అందించారు. ఈ సినిమా భారీ అంచనాల నడుమ ఫిబ్రవరి 25న ప్రపంచవ్యాప్తంగా విడుదలై బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది.