కరోనా నుంచి కోలుకున్న నందమూరి బాలకృష్ణ అతి త్వరలో షూటింగ్లో పాల్గొన్నబోతున్నారు. గోపీచంద్ దర్శకత్వంలో బాలయ్య ఓ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. కాగా బాలయ్యకు కరోనా పాజిటివ్ వచ్చాక షూటింగ్‌కు చిన్న బ్రేక్ ఇచ్చారు. తిరిగి మళ్ళీ నెగటివ్ రిపోర్ట్ రావడంతో షూటింగ్ రిస్టార్ట్ చేయనున్నారు. అందులో భాగంగా NBK107 టీమ్ త్వరలో టర్కీ వెళ్లనుందని తెలుస్తోంది. అక్కడే ఓ 20 రోజుల పాటు షూటింగ్ నిర్వహించనున్నారట. Photo : Twitter
అయితే మొదట అమెరికాలో షెడ్యూల్ ప్లాన్ చేసింది టీమ్. కానీ టీమ్‌కు వీసా లేట్ అవ్వడంతో ఆ షెడ్యూల్‌ను టర్కీకి మార్చింది టీమ్. అక్కడ కొన్ని యాక్షన్స్ సీన్స్‌తో పాటు ఓ రెండు పాటలను చిత్రీకరించనున్నారట. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి థమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమా దసరాకు లేదా దీపావళికి విడుకానుందని అంటున్నారు. హీరోయిన్గా శృతిహాసన్ నటిస్తున్నారు. Photo : Twitter
ఇక బాలయ్య నటిస్తున్న ఇతర సినిమాల విషయానికి వస్తే.. ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్స్‌లో సినిమా వస్తుందంటే.. ఆడియన్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అలాంటి క్రేజీ కాంబినేషన్ బాలకృష్ణ, అనిల్ రావిపూడి.. త్వరలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఎఫ్ 3 మూవీ తర్వాత అనిల్ రావిపూడి తన నెక్ట్స్ మూవీ బాలయ్యతో చేయబోతున్నట్టు చెప్పడమే కాదు. ఈ సినిమాలో నటించే నటీనటుల వివరాలను ఎఫ్ 3 మూవీ ప్రమోషన్లో భాగంగా అభిమానులతో పంచుకున్న సంగతి తెలిసిందే కదా. Photo : Twitter
బాలకృష్ణ విషయానికొస్తే.. అఖండ’తో భారీ సక్సెస్‌ను అందుకున్న బాలయ్య.. నెక్ట్స్ ప్రాజెక్ట్స్‌ను గోపీచంద్ మలినేనితో చేస్తున్నారు. ఆ తర్వాత అనిల్ రావిపూడితో సినిమా చేయనున్నారు. ఒకవైపు సినిమాలు.. మరోవైపు రాజకీయాలు.. అది కాకుండా.. బాలకృష్ణ ఎవరు ఊహించని విధంగా మెగా ఫ్యామిలీకి చెందిన ‘ఆహా’ ఓటీటీకి హోస్ట్‌గా చేయడానికి ఓకే చెప్పడం ఎవరు ఊహించి ఉండరు. అంతేకాదు హోస్ట్‌గా బాలయ్య ఈ షోను సక్సెస్ చేసిన విధానం కూడా అందరినీ ఆకట్టుకుంది. ఇక అన్‌స్టాపబుల్ సీజన్ 2 పై ఆగష్టు 15న అప్డేట్ ఇవ్వనున్నారు. Photo : Twitter
గతేడాది బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేసిన ‘అఖండ’ సక్సెస్‌ను కంటిన్యూ చేయాలనే ఉద్దేశ్యంతో వరుసగా క్రేజీ డైరెక్టర్స్‌తో నెక్ట్స్ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు.ఇక ఈ సినిమా గుంటూరులోని రామకృష్ణ థియేటర్లో 175 పూర్తి చేసుకోవడం విశేషం. ఈ సినిమా తర్వాత ఇప్పటికే గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఇక బాలయ్య బర్త్ డే సందర్భంగా విడుదలైన ఈ సినిమా టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. Photo : Twitter
ఈ సినిమా ఆగష్టు చివరి వారం వరకు కంప్లీట్ చేసే ఆలోచనలో ఉన్నారు బాలయ్య. ఈ సినిమాలో బాలయ్య సరసన శృతి హాసన్ కథానాయికగా నటిస్తోంది. వరలక్ష్మీ శరత్ కుమార్ మరో కీలక పాత్రలో నటిస్తోంది. కన్నడ నటుడు దునియా విజయ్ ఈ సినిమాలో విలన్ పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాను టాలీవుడ్లో అగ్ర నిర్మాణ సంస్థగా సత్తా చూపెడుతున్న మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఈ సినిమాలో బాలయ్య ఫ్యాక్షనిస్ట్ పాత్రతో పాటు పోలీస్ ఆఫీసర్‌గా నటించబోతున్నట్టు సమాచారం.ఈ సినిమా తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో నెక్ట్స్ మూవీ చేయనున్నారు. ఈ సినిమా కు సంబంధించిన ఫైనల్ స్క్రిప్ట్ రెడీ అయిందంట. Photo : Twitter
ఇప్పటికే ఓ సారి బాలయ్యతో సినిమా చేయాలని చూసాడు అనిల్. నిజానికి ఆయన 100వ సినిమా కూడా అనిల్ రావిపూడి చేతుల్లో పెట్టాలని చూసాడు నిర్మాత దిల్ రాజు. అప్పట్లో ఈ కాంబినేషన్లో రామారావు గారు అనే సినిమా ప్రకటించారు కూడా. కానీ అనుకోని కారణాలతో ఈ సినిమా ఆగిపోయింది. ఇక బాలయ్యతో ఇపుడు చేయబోయే సినిమా కథ తండ్రి, కూతురు మధ్య అల్లుకుని ఉంటుంది... Photo : Twitter
ఇక బాలయ్యతో చేస్తున్న సినిమాలో తన మార్క్ కామెడీ, కమర్షియల్ అంశాలతో పాటు అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్ పుష్కలంగా ఉండనున్నట్టు అనిల్ రావిపూడి ఖరారు చేశాడు. ఈ సినిమాలో హీరోయిన్ పేరును కూడా చెప్పేశాడు అనిల్. ఇక బాలయ్య కూతురిగా ‘పెళ్లిసందD’ ఫేమ్ శ్రీలీలా నటిస్తోందని అనిల్ తెలిపాడు. శ్రీలీల అయితేనే ఈ సినమాకు బావుంటుందని.. ఆమె మాత్రం ఆ పాత్రకు న్యాయం చేస్తుందని అనిల్ రావిపూడి క్లారిటీ ఇచ్చేశాడు., అందుకే ఏరికోరి మరీ శ్రీలీలాని తీసుకున్నామని అనిల్ చెప్పుకొచ్చాడు. Photo : Twitter
మరోవైపు ఈ సినిమాలో బిగ్‌బాస్ ఓటీటీ తెలుగు విన్నర్ బిందు మాధవి కూడా ఈసినిమాలో ఛాన్స్ ఇస్తున్నట్టు ఈ సినిమా గ్రాండ్ ఫినాలేలో అనిల్ రావిపూడి చెప్పారు. మరి బిందు మాధవికి ఈ సినిమాలో హీరోయిన్ ఛాన్స్ ఇస్తాడా ? లేకపోతే వేరే ఏదైనా పాత్ర ఇస్తాడనేది చూడాలి. మొత్తంగా ప్రేక్షకులు మరిచిపోయిన బిందు మాధవికి అనిల్ రావిపూడి.. అది కూడా బాలయ్య సినిమాలో అవకాశం అంటే మాములు విషయం కాదు. మరి ఈ సినిమాతో బిగ్‌బాస్ బ్యూటీకి మరిన్ని అవకాశాలు వస్తాయా అనేది చూడాలి. Photo : Twitter
బాలయ్య ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో NBK107 ప్రాజెక్ట్ చేస్తున్నారు. ఇది ముగిసిన వెంటనే, అనిల్ రావిపూడితో సెట్స్ మీదకి వెళ్లనున్నారు. బాలయ్య ప్రస్తుతం రాజకీయాలతో పాటు సినిమాలు కూడా చేస్తున్నాడు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో లెజెండ్ సీక్వెల్ తీసేందుకు కూడా నందమూరి బాలయ్య రెడీ అయ్యాడు. ఇందులో కూడా బాలయ్య రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్నారు. Photo : Twitter