వీరసింహారెడ్డి తర్వాత ప్రస్తుతం బాలయ్య, అనిల్ రావిపూడితో ఓ సినిమాను చేస్తున్నారు. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్‌ను జరుపుకుంటోంది. ఈ సినిమా తర్వాత బాలయ్య, బోయపాటితో మరోసారి పనిచేయనున్నారు. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తుండగా శ్రీలీల కీలక పాత్రలో కనిపించనుంది. దసరాకు రాబోతుంది. Photo : Twitter
అది అలా ఉంటే బాలయ్య పుట్టిన రోజు సందర్భంగా ఆయన నటించిన కల్ట్ క్లాసిక్ చిత్రం “భైరవ ద్వీపం” మరోసారి థియేటర్స్‌లో విడుదలకానుంది. దీనికి సంబంధించి కొన్ని పోస్టర్స్‌ను ఇప్పటికే విడుదల చేశారు ఫ్యాన్స్. ప్రముఖ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు అద్భుత సృష్టిలో ఒక చిత్రంగా వచ్చిన ఈ ఫాంటసీ థ్రిల్లర్ అయితే ఇప్పుడు 4K లో రీరిలీజ్ కి సిద్ధం అవుతోంది. ఈ సినిమాను జూన్ 10న రిలీజ్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. Photo : Twitter
చూడాలి మరి ఈ సినిమా థియేటర్స్‌లో ఎలా ఆకట్టుకోనుందో.. ఇక బాలయ్య సినిమాల విషయానికి వస్తే.. అనిల్ రావిపూడి సినిమా తర్వాత వెంటనే మరోసారి బోయపాటితో ఉండనుందని తెలుస్తోంది.. ఈ కాంబినేషన్లో ఇప్పటికే మూడు సినిమాలు రాగా.. అవన్నీ కూడా బంపర్ హిట్ అందుకున్నాయి. దీంతో కాంబినేషన్ మరో రానుందని తెలుస్తోంది. ఇక ఇదే సినిమాలో బాలయ్య కూమరుడు మోక్షజ్ఞ కూడా ఎంట్రీ ఇస్తున్నట్లు తెలుస్తోంది. Photo : Twitter
ఎప్పటి నుంచో మోక్షజ్ఞ సినిమా ఎంట్రీపై బాలయ్య అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీంతో ఈ వార్త ఫ్యాన్స్‌ను ఫుల్ ఖుషీ చేస్తోంది. బోయపాటి శ్రీను ప్రస్తుతం హీరో రామ్ తో సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా తర్వాత బాలయ్య సినిమా ఉండనుంది. ఈ విషయంలో త్వరలో అధికారిక ప్రకటన విడుదలకానుంది. ఈ సినిమా అఖండకు సీక్వెల్‌గా వస్తుందని అంటున్నారు.. Photo : Twitter
ఓ స్వార్థ పరుడి చేతిలో పడి నాశనం అవుతున్న ప్రజలను, ముఖ్యంగా తిరుమల ప్రతిష్టను తగ్గించే కార్యక్రమాలు చేసే వ్యక్తులను, వ్యవస్థను హీరో అంతం చేస్తాడట. వీటితో పాటు కాస్తా మాస్ మసాలను కలిపి అఖండ 2 లో చూపించబోతున్నారని తెలుస్తోంది. ఈ సినిమాలో ముఖ్యంగా పొలిటికల్ అంశాలే హైలెట్‌గా ఉండనున్నాయని అంటున్నారు. ఇక ఈ సినిమాను జూన్ 10, 2023న బాలయ్య పుట్టినరోజు సందర్భంగా అధికారికంగా ప్రారంభించనున్నారని టాక్. ఇక ఏపీలో ఎన్నికలు మొదలు అయ్యే సమయానికి విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. ఈ సినిమాకు థమన్‌తో పాటు అఖండకు పనిచేసిన టీమ్‌నే మరోసారి తీసుకుంటున్నారట. Photo : Twitter
అది అలా ఉంటే పైసా వసూల్ తర్వాత బాలయ్య, పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉంది. అయితే ఈ సినిమా బోయపాటి సినిమా తర్వాత రానుంది. కాగా ఈ సినిమాకు అప్పుడే టైటిల్ ఖరారు అయ్యిందని తెలుస్తోంది. ఈ సినిమాకు కాకా అనే పేరును ఫిక్స్ చేశారని అంటున్నారు. దీనికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. Photo : Twitter
ఇక NBK108 విషయానికి వస్తే.. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ షూట్లో కాజల్ కూడా పాల్గోంటుంది. ఆచార్య తర్వాత కాజల్ నటిస్తున్న తెలుగు సినిమా ఇదే థమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీలో బాలయ్య పవర్ఫుల్ రోల్ చేస్తున్నారు. అనిల్ రావిపూడి ఈ మూవీని అద్భుతంగా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక తెలుస్తోన్న సమాచారం మేరకు ఈ సినిమాను దసరా సందర్భంగా అక్టోబర్ 21న విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో త్వరలో అధికారిక ప్రకటన విడుదలకానుంది. అయితే ఇదే పండుగకు రామ్ పోతినేని బోయపాటి సినిమా, రవితేజ టైగర్ నాగేశ్వరరావు, లియో సినిమాలు విడుదలకు రెడీ అవుతున్నాయి. Photo : Twitter
ఇక అది అలా ఉంటే ఈ మధ్య బాలయ్య కుర్ర హీరోలకు సమానంగా ఇంకా చెప్పాలంటే వారికంటే చురుగ్గా.. సినిమాలను చేస్తున్నారు. అందులో భాగంగా ఆయన ఇప్పటికే ఓ ఐదు సినిమాలను లైన్లో పెట్టారు. ఇక్కడ విశేషం ఏమంటే.. ఈ ఐదు సినిమాలకు దర్శకులు.. నిర్మాతలు ఫైనల్ అయ్యారు. ప్రస్తుతం కొన్ని సినిమాలు షూటింగ్ దశలో ఉండగా.. మరికొన్ని స్క్రిప్ట్ పనుల్లో బిజిగా ఉన్నాయి..
ఇక ఆ ఐదు సినిమాల విషయానికి వస్తే.. NBK108 అనిల్ రావిపూడి దర్శకుడు, షైన్ స్క్రీన్స్ బ్యానర్లో నిర్మాణం కానుంది. NBK109 సినిమాకు బోయపాటి శ్రీను దర్శకుడు, 14 రీల్స్ ప్లస్ నిర్మాణం, NBK110 సినిమాకు పూరి జగన్నాథ్ దర్శకుడు, పూరి కనెక్ట్ బ్యానర్లో ఛార్మి నిర్మాత. NBK111 సినిమాకు బాబీ దర్శుకుడు, సితార ఎంటర్టైన్మెంట్స్పై నాగవంశీ నిర్మించనున్నారు. ఇక NBK112వ సినిమాకు పరశురామ్ దర్శకత్వం వహించనున్నారు. గీతా ఆర్ట్స్ బ్యానర్’పై అల్లు అరవింద్ నిర్మించనున్నారు. (Twitter/Photo)
ఇక NBK108 విషయానికి వస్తే.. సినిమా ప్యాన్ ఇండియా స్థాయిలో రావడమేకాదు.. ఓ ఆరు భాషల్లో విడుదలకానుందని సమాచారం. వీర సింహా రెడ్డి హిట్ తర్వాత బాలయ్య 108వ సినిమాను బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో చేస్తుండడంతో భారీగా అంచనాలున్నాయి. ఇప్పటికే ఓ షెడ్యూల్ కూడా అయ్యిందని తెలుస్తోంది. కాగా ఈ సినిమా విషయంలో ఓ కీలక విషయం బయటకు వచ్చింది. ఇప్పటి వరకు బాలయ్య సినిమాలు దాదాపుగా రాయలసీమ నేపథ్యంలోనే సాగేవి. అయితే ఈ సినిమా మాత్రం తెలంగాణ నేపథ్యంలో రానుందని దర్శకుడు అనిల్ రావిపూడి ప్రకటించారు. Photo : Twitter
ఇక ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో హిందీ నటి నోరా ఫతేహిను తీసుకోవాలని చూస్తున్నారట. ఈ భామ ఈ సినిమాలో నెగిటివ్‌గా ఉంటుందని తెలుస్తోంది. అంతేకాదు బాలయ్య, నోరా ఫతేహి కాంబినేషన్లో వచ్చే సీన్స్ సినిమాకు హైలెట్‌గా ఉంటాయని అంటున్నారు. ఇక నోరా గతంలో బాహుబలి సినిమాలో మనోహరి అనే పాటలో తన అందచందాలతో అదరగొట్టిన సంగతి తెలిసిందే. Photo : Twitter
అంతేకాదు ఈ సినిమా బాలయ్య సినిమాల్లో చాలా భిన్నంగా ఉండనుందని టాక్. చూడాలి మరి ఎలా ఆకట్టుకోనుందో.. ఇక ఈ సినిమాలో హీరోయిన్గా వీరసింహా రెడ్డిలో మీనాక్షి పాత్రలో సీనియర్ బాలయ్యసరసన నటించిన హనీరోజ్ నటించనుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్‌కు ఛాన్స్ ఉండడంతో ఫస్ట్ హీరోయిన్గా కాజల్ ను తీసుకుంటున్నారట. (Photo Twitter)
ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. ఈ సినిమాలో బాలయ్య పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుందట. అయితే ఎంత పవర్ ఫుల్ గా ఉన్నా.. మరోవైపు ఆ పాత్ర తాలూకు ప్రవర్తన, మాటలు వెరీ ఫన్నీగా ఉంటాయట. ముఖ్యంగా ఈ సినిమాలో తండ్రి కూతురు మధ్య మంచి ఎమోషనల్ ట్రాక్ ఉంటుందట. ఇదే ఈ సినిమాకు ఆయువు పట్టు అని అంటున్నారు. ఈ సినిమాలో శ్రీలీల, బాలయ్య కూతురుగా చేస్తోంది. (Photo Twitter)
ఇక మరోవైపు ఆదిత్య 369ఈ సినిమాకు ఎప్పటి నుంచో సీక్వెల్ రాబోతుందని టాక్ వినపడుతోంది. అంతేకాదు ఈ సినిమాకు స్వయంగా బాలయ్యే దర్శకత్వం వహించనున్నారని తెలిపారు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ కూడా మొదలైందని తెలుస్తోంది. ఈ సినిమాకు“ఆదిత్య 999 మ్యాక్స్” అనే టైటిల్ ఖరారు అయ్యినట్లు తెలిపారు బాలయ్య. ఆయన ఆహాలో వస్తున్న తన టాక్ షోలో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. దీంతో ఫ్యాన్స్ భారీగా అంచనాలు పెట్టుకుంటున్నారు. అసలు ఈ సినిమా ఎలా ఉండనుందో.. అంటూ తెగ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. Photo : Twitter
వీరసింహారెడ్డి విషయానికి వస్తే.. అఖండ సినిమా తర్వాత బాలయ్య వరుసగా సినిమాలను చేస్తున్నారు. అందులో భాగంగా గోపీచంద్ మలినేనితో వీరసింహారెడ్డి అనే సినిమాను చేశారు. మంచి అంచనాల నడుమ ఈ సినిమా సంక్రాంతి సందర్బంగా జనవరి 12న భారీగా విడుదలై మంచి ఆదరణ పొందుతోంది. టీజర్స్ అండ్ ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ రావడంతో ఓపెనింగ్స్ ఓ రేంజ్లో వచ్చాయి. Photo : Twitter
వీరసింహారెడ్డి’ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్గా నటించింది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ భారీ ఎత్తున నిర్మించింది. నిన్నటి ఈ సినిమా 8 రోజులు పూర్తి చేసుకుంది. ఇప్పటికే ఈ చిత్రం రూ. 100 కోట్ల క్లబ్బులో చేరింది. అఖండ తర్వాత రూ. 100 కోట్ల గ్రాస్ క్లబ్బులో చేరిన రెండో బాలయ్య చిత్రంగా వీరసింహారెడ్డి రికార్డ్స్ క్రియేట్ చేసింది. అంతేకాదు బాలయ్య కెరీర్లో వీరసింహారెడ్డి ఓ అరుదైన రికార్డ్‌ను క్రియేట్ చేసింది. Photo : Twitter
బాలయ్య గత సినిమా “అఖండ” ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెలిసిందే. ఆ చిత్రం అందుకున్న టోటల్ వసూళ్ళని వీరసింహా రెడ్డి కేవలం ఈ 8 రోజుల్లోనే కలెక్ట్ చేసి అదరహో అనిపించింది. దీనితో వీరసింహా రెడ్డి బాలయ్య కెరీర్ లోనే ఆల్ టైమ్ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. అంతేకాదు వీర సింహారెడ్డి విడుదలైన 3 రోజుల్లోనే USAలో బ్రేక్ఈవెన్ మార్క్‌ను చేరుకుంది. ఇక ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు వరల్డ్ వైడ్‌గా 70 కోట్లకు పైగా షేర్‌ను వసూలు చేసి వావ్ అనిపించింది.. Photo : Twitter
అఖండ సినిమా మొదటి వారం రూ. 53.49 కోట్ల షేర్ (రూ. 87.9 కోట్ల గ్రాస్) వసూళ్లను సాధిస్తే.. వీరసింహారెడ్డి మూవీ 1 వారంలోనే రూ. 68.51 కోట్ల షేర్ (రూ. 114.95 కోట్ల గ్రాస్) వసూళ్లను సాధించింది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన వీరసింహారెడ్డి మంచి అంచనాల నడుమ సంక్రాంతి కానుకగా విడుదలై పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. మొదటి రోజు రికార్డు బ్రేక్ కలెక్షన్స్ రాబట్టింది. రెండో రోజు కూడా అదే దూకుడుతో బాక్సాఫీస్ దగ్గర పర్ఫామ్ చేస్తోంది. ఇప్పటికే యూఎస్ బాక్సాఫీస్ దగ్గర 1 మిలియన్ యూస్ డాలర్స్‌ను కలెక్ట్ చేసి 2 మిలియన్ క్లబ్బు వైపు పరుగులు తీస్తోంది. (Photo : Twitter
ఇక ఈ సినిమా విజయవంతంగా బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకుంది. వీరసింహారెడ్డి సినిమాలో బాలయ్య .. వీరసింహారెడ్డిగా.. జైసింహారెడ్డిగా తండ్రీ కొడుకులుగా రెండు విభిన్న పాత్రల్లో అలరించాడు. ఈయన ద్విపాత్రాభినయం చేసిన 17వ చిత్రం. ఈయన చెల్లెలు కమ్ మేనత్త పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటించింది. ఈ సినిమాలో దునియా విజయ్ విలన్ పాత్రలో నటించారు. (Twitter/Photo)
ఇప్పటికే విడుదలైన ఈ సినిమాలో కూడా లెజెండ్ తరహాలో పొలిటికల్ డైలాగులు పేలాయి. ముఖ్యంగా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ డైరెక్ట్ ఎటాక్ చేసారు. సంతకాలు పెడితే బోర్డు పై పేరు మారుతుందేమో... ఆ చరిత్ర సృష్టించిన వాడి పేరు మారుదు.. మార్చలేరు అంటూ.. రీసెంట్గా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును వైయస్ఆర్ హెల్త్ యూనివర్సిటీగా మార్చడంపై సెటైర్లు వేసారు బాలయ్య. ఈ డైలాగులకు థియేటర్స్‌లో సూపర్ రెస్పాన్స్ వచ్చింది. (Twitter/Photo)
ఈ సినిమాను ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థ డిస్నీ హాట్ స్టార్ దక్కించుకుంది. హాట్ స్టార్ బాలయ్య వీరసింహారెడ్డి చిత్రానికి సంబంధించిన స్ట్రీమింగ్ రైట్స్‌ను దాదాపుగా రూ. 14కోట్లు పెట్టి కొన్నట్లు తెలుస్తోంది. ఇక బాలయ్య గత చిత్రం అఖండ స్ట్రీమింగ్ రైట్స్ కూడా హాట్ స్టార్ వద్ద ఉన్న సంగతి తెలిసిందే.. Photo : Twitter
ఇక బాలయ్య ఓ వైపు సినిమాల్లో అదరగొడుతూనే టాక్ షోలోను కేక పెట్టిస్తున్నారు. అందులో భాగంగా ఆయన ఆహా ఓటీటీ కోసం అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే అంటూ ఓ టాక్ షోను చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ షో మొదటి సీజన్ మంచి విజయాన్ని అందుకుంది. ఈ రెండో సీజన్ అక్టోబర్ 14 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. మొదటి ఎపిసోడ్‌కు చంద్రబాబు, లోకేష్ వచ్చి అదరగొట్టారు. రెండో ఎపిసోడ్‌కు సిద్ధూ జొన్నలగడ్డ, విశ్వక్ సేన్ వచ్చారు. ఇక మూడో ఎపిసోడ్‌కు శర్వానంద్, అడివిశేష్ వచ్చి అలరించారు. Photo : Twitter
నాల్గవ ఎపిసోడ్‌కు మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో పాటు రాజ్యసభ ఎంపీ KR సురేష్ రెడ్డి వచ్చారు. ఐదో ఎపిసోడ్‌కు అల్లు అరవింద్, కోదండ రామిరెడ్డి, రాఘవేంద్రరావులు వచ్చారు. ఇక ఆరో ఎపిసోడ్‌కు ప్రభాస్, గోపీచంద్ వస్తున్నారు. ఈ బాలయ్య, ప్రభాస్‌ల ఎపిసోడ్ రెండు పార్ట్‌లుగా స్ట్రీమింగ్ కానుంది. ఇప్పటికే మొదటి పార్ట్ డిసెంబర్ 29 రాత్రి 9 గంటలకు స్ట్రీమింగ్కు వచ్చింది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఒక్కసారిగా అందరూ స్ట్రీమ్ చేయడంతో వచ్చిన అరగంటలోపే సర్వర్ క్రాష్ అయ్యింది. దీంతో ఆహా యాప్ కొన్ని గంటల వరకు పనిచేయలేదు. Photo : Twitter