Balakrishna: బాలకృష్ణ అభిమానులకు శుభవార్త.. వచ్చే నెలలోనే కొత్త సినిమా
Balakrishna: బాలకృష్ణ అభిమానులకు శుభవార్త.. వచ్చే నెలలోనే కొత్త సినిమా
Nandamuri Balakrishna: బాలకృష్ణ నటిస్తున్న వీరసింహారెడ్డి మూవీ తుదిదశకు చేరుకుంది. సంక్రాంతికే ఈ సినిమా విడుదలవుతుంది. వీరసింహారెడ్డి షూటింగ్ ముగిసిన వెంటనే.. తుదపరి చిత్రాన్ని మొదలుపెట్టబోతున్నారు బాలయ్య. వచ్చే నెలలలోనే అది సెట్స్‌పైకి వెళ్లబోతోన్నట్లు సమాచారం.
నందమూరి నటసింహం వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. ఇటు మూవీలు, అటు అన్‌స్టాపబుల్ షోతోనూ అభిమానులను అలరిస్తున్నారు. బాలకృష్ణ తదుపరి సినిమా గురించి ఓ అప్డేట్ వచ్చేసింది.
2/ 7
బాలకృష్ణ ప్రస్తుతం వీరసింహారెడ్డి సినిమాతో బిజీగా ఉన్నారు. గోపిచంద్ మలినేని దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రానికి తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై పక్కా కమర్షియల్ ఎంటర్ టైనర్ గా రూపొందిస్తున్నారు.
3/ 7
వీరసింహారెడ్డి మూవీలో దునియా విజయ్, వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం ముగింపు దశలో ఉంది. డిసెంబరులో పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తిచేసి.. జనవరిలో సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నారు.
4/ 7
వీరసింహారెడ్డి షూటింగ్ చివరి దశకు చేరుకోవడంతో తదుపరి చిత్రంపై బాలకృష్ణ దృష్టి సారించారు. NBK 108 వర్కింగ్ టైటిల్‌తో బాలకృష్ణ నెక్ట్స్ మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ మూవీకి అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. సాహు గారపాటి, హరీష్ పెద్ది సంయుక్తగా నిర్మిస్తున్నారు.
5/ 7
డిసెంబరు తొలివారంలో హైదరాబాద్‌లో బాలకృష్ణ 108వ సినిమా చిత్రీకరణ ప్రారంభమవుతుందని సమాచారం. ఇప్పటికే ప్రిప్రొడక్షన్ పనులు ముగింపు దశకు చేరుకున్నాయని తెలిసింది.
6/ 7
ఈ సినిమాలో బాలకృష్ణకు జోడీగా సోనాక్షి సిన్హా నటిస్తుందని ప్రచారం జరుగుతోంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కూతురి పాత్రలో శ్రీలీల నటించనుంది. దీనికి కూడా తమనే మ్యూజిక్ అందిస్తున్నారు.
7/ 7
ఎక్కువగా వినోద భరిత సినిమాలు చేసే అనిల్ రావిపూడి.. ఈ చిత్రంలో బాలకృష్ణను ఎలా చూపిస్తారోనని అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ఆయన తీసిన పటాస్, సుప్రీమ్, రాజా ది గ్రేట్, ఎఫ్2, సరిలేరు నీకెవ్వరు, ఎఫ్3 హిట్ కావడంతో.. ఈ మూవీపైనా భారీగా అంచనాలున్నాయి.