వీర సింహా రెడ్డి సినిమా తర్వాత బాలయ్య 108వ సినిమాను బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఓ షెడ్యూల్ కూడా పూర్తైయింది. రెండో షెడ్యూల్ మొదలు కావాల్సింది. కానీ తారకరత్న హెల్త్ కండిషన్ నేపథ్యంలో బాలయ్య మూడు వారాలు గ్యాప్ తీసుకున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కావాల్సి వుంది. కానీ బాలయ్య లేకుండా కొన్ని కీలక సన్నివేశాలను చిత్రకరిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన బిగ్ అప్డేట్ను రేపు (బుధవారం) 10.15 నిమిషాలకు ఇవ్వనున్నారు.
ఇప్పటికే ఈ సినిమా షూటింగ్లో కాజల్ అగర్వాల్ జాయిన్ అయింది. పెళ్లి తర్వాత కాజల్ సైన్ చేసిన పూర్తి స్థాయి బిగ్ బడ్జెట్ మూవీ ఇదే కావడం విశేషం. ఇక కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్లో చేస్తోన్న ‘ఇండియన్ 2’ మూవీని అతకు ముందే సైన్ చేసిన సంగతి తెలిసిందే కదా. ఇక ఉగాది సందర్భంగా బాలయ్య లుక్‌తో పాటు టైటిల్ సహా విడుదల తేదిని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. (Twitter/Photo)
అంతేకాదు ఈ సినిమా బాలయ్య సినిమాల్లో చాలా భిన్నంగా ఉండనుందని టాక్. చూడాలి మరి ఎలా ఆకట్టుకోనుందో.. ఇక ఈ సినిమాలో హీరోయిన్గా వీరసింహా రెడ్డిలో మీనాక్షి పాత్రలో సీనియర్ బాలయ్యసరసన నటించిన హనీరోజ్ నటించనుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్‌కు ఛాన్స్ ఉండడంతో ఫస్ట్ హీరోయిన్గా కాజల్ ను తీసుకున్నారు. ఇక హనీ రోజ్ ఏ పాత్రకు తీసుకుంటారనేది చూడాలి. (Photo Twitter)
ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. ఈ సినిమాలో బాలయ్య పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుందట. అయితే ఎంత పవర్ ఫుల్ గా ఉన్నా.. మరోవైపు ఆ పాత్ర తాలూకు ప్రవర్తన, మాటలు వెరీ ఫన్నీగా ఉంటాయట. ముఖ్యంగా ఈ సినిమాలో తండ్రి కూతురు మధ్య మంచి ఎమోషనల్ ట్రాక్ ఉంటుందట. ఇదే ఈ సినిమాకు ఆయువు పట్టు అని అంటున్నారు. ఈ సినిమాలో శ్రీలీల, బాలయ్య కూతురుగా చేస్తోంది. అంతేకాదు అనిల్ రావిపూడి మార్క్‌తో పూర్తి ఎంటర్టేనర్‌గా ఉండనున్నట్టు టాక్. (Photo Twitter)
సినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్ మీద హరీష్ పెద్ది, సాహు గారపాటి నిర్మిస్తున్నారు.. ఈ సినిమాలో బాలయ్య బాబు మునుపెన్నడు చూడని అవతార్‌లో కనిపించనున్నాడట. ఇక మరోవైపు ఆదిత్య 369ఈ సినిమాకు ఎప్పటి నుంచో సీక్వెల్ రాబోతుందని టాక్ వినపడుతోంది. అంతేకాదు ఈ సినిమాకు స్వయంగా బాలయ్యే దర్శకత్వం వహించనున్నారని తెలిపారు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ కూడా మొదలైందని తెలుస్తోంది.
వీరసింహారెడ్డి’ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్గా నటించింది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ భారీ ఎత్తున నిర్మించింది. నిన్నటి ఈ సినిమా 8 రోజులు పూర్తి చేసుకుంది. ఇప్పటికే ఈ చిత్రం రూ. 100 కోట్ల క్లబ్బులో చేరింది. అఖండ తర్వాత రూ. 100 కోట్ల గ్రాస్ క్లబ్బులో చేరిన రెండో బాలయ్య చిత్రంగా వీరసింహారెడ్డి రికార్డ్స్ క్రియేట్ చేసింది. అంతేకాదు బాలయ్య కెరీర్లో వీరసింహారెడ్డి ఓ అరుదైన రికార్డ్‌ను క్రియేట్ చేసింది. Photo : Twitter
బాలయ్య గత సినిమా “అఖండ” ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెలిసిందే. ఆ చిత్రం అందుకున్న టోటల్ వసూళ్ళని వీరసింహా రెడ్డి కేవలం ఈ 8 రోజుల్లోనే కలెక్ట్ చేసి అదరహో అనిపించింది. దీనితో వీరసింహా రెడ్డి బాలయ్య కెరీర్ లోనే ఆల్ టైమ్ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. అంతేకాదు వీర సింహారెడ్డి విడుదలైన 3 రోజుల్లోనే USAలో బ్రేక్ఈవెన్ మార్క్‌ను చేరుకుంది. ఇక ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు వరల్డ్ వైడ్‌గా రూ. 80 కోట్లకు పైగా షేర్‌ను వసూలు చేసి వావ్ అనిపించింది.. Photo : Twitter
వీరసింహారెడ్డి సినిమాలో బాలయ్య .. వీరసింహారెడ్డిగా.. జైసింహారెడ్డిగా తండ్రీ కొడుకులుగా రెండు విభిన్న పాత్రల్లో అలరించాడు. ఈయన ద్విపాత్రాభినయం చేసిన 17వ చిత్రం. ఈయన చెల్లెలు కమ్ మేనత్త పాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటించింది. ఈ సినిమాలో దునియా విజయ్ విలన్ పాత్రలో నటించారు. (Twitter/Photo)
ఇప్పటికే విడుదలైన ఈ సినిమాలో కూడా లెజెండ్ తరహాలో పొలిటికల్ డైలాగులు పేలాయి. ముఖ్యంగా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ డైరెక్ట్ ఎటాక్ చేసారు. సంతకాలు పెడితే బోర్డు పై పేరు మారుతుందేమో... ఆ చరిత్ర సృష్టించిన వాడి పేరు మారుదు.. మార్చలేరు అంటూ.. రీసెంట్గా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును వైయస్ఆర్ హెల్త్ యూనివర్సిటీగా మార్చడంపై సెటైర్లు వేసారు బాలయ్య. ఈ డైలాగులకు థియేటర్స్‌లో సూపర్ రెస్పాన్స్ వచ్చింది. (Twitter/Photo)