టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం బాలకృష్ణ, అనిల్ రావిపూడి కాంబినేషన్లో సినిమాపై ఆసక్తి నెలకొంది. ఎఫ్ 3 మూవీ తర్వాత అనిల్ రావిపూడి తన నెక్ట్స్ మూవీ బాలయ్యతో చేయబోతున్నట్టు చెప్పడమే కాదు. ఈ సినిమాలో నటించే నటీనటుల వివరాలను ఎఫ్ 3 మూవీ ప్రమోషన్లో భాగంగా అభిమానులతో పంచుకున్నారు. ఇక ఈ సినిమాలో బిగ్‌బాస్ విన్నర్ బిందు మాధవి కూడా నటిస్తున్నట్టు చెప్పారు. (Twitter/Photo)
బాలకృష్ణ విషయానికొస్తే.. అఖండ’తో భారీ సక్సెస్‌ను అందుకున్న బాలయ్య.. నెక్ట్స్ ప్రాజెక్ట్స్‌ను గోపీచంద్ మలినేనితో చేస్తున్నారు. ఆ తర్వాత అనిల్ రావిపూడి చేయడానికి ఓకే చెప్పిన సంగతి తెలిసిందే కదా. ఒకవైపు సినిమాలు.. మరోవైపు రాజకీయాలు.. అది కాకుండా.. బాలకృష్ణ ఎవరు ఊహించని విధంగా మెగా ఫ్యామిలీకి చెందిన ‘ఆహా’ ఓటీటీకి హోస్ట్‌గా చేయడానికి ఓకే చెప్పడం ఎవరు ఊహించి ఉండరు. అంతేకాదు హోస్ట్‌గా బాలయ్య ఈ షోను సక్సెస్ చేసిన విధానం కూడా అందరినీ ఆకట్టుకుంది. (File/Photo)
గతేడాది బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేసిన ‘అఖండ’ సక్సెస్‌ను కంటిన్యూ చేయాలనే ఉద్దేశ్యంతో వరుసగా క్రేజీ డైరెక్టర్స్‌తో నెక్ట్స్ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు.ఇక ఈ సినిమా గుంటూరులోని రామకృష్ణ థియేటర్లో 175 పూర్తి చేసుకోవడం విశేషం. ఈ సినిమా తర్వాత ఇప్పటికే గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా రెండు షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకుంది.
ఈ సినిమా ఆగష్టు చివరి వారం వరకు కంప్లీట్ చేసే ఆలోచనలో ఉన్నారు బాలయ్య. ఈ సినిమాలో బాలయ్య సరసన శృతి హాసన్ కథానాయికగా నటిస్తోంది. వరలక్ష్మీ శరత్ కుమార్ మరో కీలక పాత్రలో నటిస్తోంది. కన్నడ నటుడు దునియా విజయ్ ఈ సినిమాలో విలన్ పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాను టాలీవుడ్లో అగ్ర నిర్మాణ సంస్థగా సత్తా చూపెడుతున్న మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఈ సినిమాలో బాలయ్య ఫ్యాక్షనిస్ట్ పాత్రతో పాటు పోలీస్ ఆఫీసర్‌గా నటించబోతున్నట్టు సమాచారం.ఈ సినిమా తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో నెక్ట్స్ మూవీ చేయనున్నారు. (Twitter/Photo)
ఇప్పటికే ఓ సారి బాలయ్యతో సినిమా చేయాలని చూసాడు అనిల్. నిజానికి ఆయన 100వ సినిమా కూడా అనిల్ రావిపూడి చేతుల్లో పెట్టాలని చూసాడు నిర్మాత దిల్ రాజు. అప్పట్లో ఈ కాంబినేషన్లో రామారావు గారు అనే సినిమా ప్రకటించారు కూడా. కానీ అనుకోని కారణాలతో ఈ సినిమా ఆగిపోయింది. ఇక బాలయ్యతో ఇపుడు చేయబోయే సినిమా కథ తండ్రి, కూతురు మధ్య అల్లుకుని ఉంటుంది. రెండోది.. ఇందులో బాలయ్య 50 ఏళ్ళ తండ్రి పాత్రలో నటిస్తున్నారు. మూడోది.. సెప్టెంబర్ నుంచే ఇది సెట్స్ మీదకి వెళ్తుందని చెప్పారు.
ఇక ఈ సినిమాలో హీరోయిన్ పేరును కూడా చెప్పేశాడు అనిల్. ఇక బాలయ్య కూతురిగా ‘పెళ్లిసందD’ ఫేమ్ శ్రీలీలా నటిస్తోందని అనిల్ తెలిపాడు. శ్రీలీల అయితేనే ఈ సినమాకు బావుంటుందని.. ఆమె మాత్రం ఆ పాత్రకు న్యాయం చేస్తుందని అనిల్ రావిపూడి క్లారిటీ ఇచ్చేశాడు., అందుకే ఏరికోరి మరీ శ్రీలీలాని తీసుకున్నామని అనిల్ చెప్పుకొచ్చాడు.
క ఈ చిత్రాన్నిషైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించనున్నారు. ఈ సినిమాను సెప్టెంబర్ వినాయక చవితి కానుకగా మొదలు పెట్టి సంక్రాంతి కానుకగా విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారట. ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ ప్రకటన జూన్ 10 బాలయ్య పుట్టినరోజున ప్రకటించే అవకాశం ఉంది. (Twitter/Photo)