మీసం మెలేసి గడ్డంతో చెవికి పోగు, చేతికి టాటూతో బాలకృష్ణలో మరో మాస్ యాంగిల్‌తో కూడిన ఫస్ట్ లుక్‌ని నందమూరి ఫ్యాన్స్‌కి ఉగాది గిఫ్ట్‌గా ఇచ్చారు డైరెక్టర్ అనీల్‌రావిపూడి. దిస్ టైమ్ బియాండ్ యువర్ ఇమాజినేషన్ అనే నాలుగు పదాల్ని వేరు వేరుగా ఫోటోపై పెట్టడంపై NBK108మూవీపై మరింత క్యూరియాసిటీ పెంచారు చిత్రనిర్మాత, దర్శకుడు.(Photo:Instagram)
అన్న దిగిండు..ఈసారి ఊహకు మించి అంటూ తన కామెంట్‌ని షేర్ చేస్తూ అనీల్‌రావిపూడి ఫోటోలను సోషల్ మీడియా గ్రూప్స్‌లో షేర్ చేశాడు. ముఖ్యంగా బాలకృష్ణ బాడీ లాంగ్వేజ్, మాస్ లుక్కు తగ్గట్లుగా గెటప్ డిజైన్ చేసినట్లుగా ఉంది. బాలయ్య హెయిర్ స్టైల్ చూస్తే ..ఆంధ్రావాల సినిమా ఎన్టీఆర్ ఫ్లాష్ బ్యాక్ లుక్‌ని తలపిస్తున్నట్లుగా ఉంది..(Photo:Instagram)
అంతేకాదు ఈ సినిమా బాలయ్య సినిమాల్లో చాలా భిన్నంగా ఉండనుందని టాక్. చూడాలి మరి ఎలా ఆకట్టుకోనుందో.. ఇక ఈ సినిమాలో హీరోయిన్గా వీరసింహా రెడ్డిలో మీనాక్షి పాత్రలో సీనియర్ బాలయ్యసరసన నటించిన హనీరోజ్ నటించనుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్‌కు ఛాన్స్ ఉండడంతో ఫస్ట్ హీరోయిన్గా కాజల్ ను తీసుకున్నారు. ఇక హనీ రోజ్ ఏ పాత్రకు తీసుకుంటారనేది చూడాలి. (Photo Twitter)
ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. ఈ సినిమాలో బాలయ్య పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుందట. అయితే ఎంత పవర్ ఫుల్ గా ఉన్నా.. మరోవైపు ఆ పాత్ర తాలూకు ప్రవర్తన, మాటలు వెరీ ఫన్నీగా ఉంటాయట. ముఖ్యంగా ఈ సినిమాలో తండ్రి కూతురు మధ్య మంచి ఎమోషనల్ ట్రాక్ ఉంటుందట. ఇదే ఈ సినిమాకు ఆయువు పట్టు అని అంటున్నారు. ఈ సినిమాలో శ్రీలీల, బాలయ్య కూతురుగా చేస్తోంది. అంతేకాదు అనిల్ రావిపూడి మార్క్‌తో పూర్తి ఎంటర్టేనర్‌గా ఉండనున్నట్టు టాక్. (Photo Twitter)
సినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్ మీద హరీష్ పెద్ది, సాహు గారపాటి నిర్మిస్తున్నారు.. ఈ సినిమాలో బాలయ్య బాబు మునుపెన్నడు చూడని అవతార్‌లో కనిపించనున్నాడట. ఇక మరోవైపు ఆదిత్య 369ఈ సినిమాకు ఎప్పటి నుంచో సీక్వెల్ రాబోతుందని టాక్ వినపడుతోంది. అంతేకాదు ఈ సినిమాకు స్వయంగా బాలయ్యే దర్శకత్వం వహించనున్నారని తెలిపారు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ కూడా మొదలైందని తెలుస్తోంది.