క్రేజీ కాంబినేషన్ బాలకృష్ణ, అనిల్ రావిపూడి.. త్వరలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఎఫ్ 3 మూవీ తర్వాత అనిల్ రావిపూడి తన నెక్ట్స్ మూవీ బాలయ్యతో చేయబోతున్నట్టు చెప్పడమే కాదు. ఈ సినిమాలో నటించే నటీనటుల వివరాలను ఎఫ్ 3 మూవీ ప్రమోషన్లో భాగంగా అభిమానులతో పంచుకున్న సంగతి తెలిసిందే కదా. Photo/ Twitter
బాలకృష్ణ విషయానికొస్తే.. అఖండ’తో భారీ సక్సెస్‌ను అందుకున్న బాలయ్య.. నెక్ట్స్ ప్రాజెక్ట్స్‌ను గోపీచంద్ మలినేనితో చేస్తున్నారు. ఆ తర్వాత అనిల్ రావిపూడితో సినిమా చేయనున్నారు. ఒకవైపు సినిమాలు.. మరోవైపు రాజకీయాలు.. అది కాకుండా.. బాలకృష్ణ ఎవరు ఊహించని విధంగా మెగా ఫ్యామిలీకి చెందిన ‘ఆహా’ ఓటీటీకి హోస్ట్‌గా చేస్తున్న విషయం తెలిసిందే.
గతేడాది బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేసిన ‘అఖండ’ సక్సెస్‌ను కంటిన్యూ చేయాలనే ఉద్దేశ్యంతో వరుసగా క్రేజీ డైరెక్టర్స్‌తో నెక్ట్స్ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు.ఇక ఈ సినిమా గుంటూరులోని రామకృష్ణ థియేటర్లో 175 పూర్తి చేసుకోవడం విశేషం. ఈ సినిమా తర్వాత ఇప్పటికే గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు.