గతంతో పోల్చితే నేటితరంలో సినీ తారల సినిమాల వేగం చాలా వరకు తగ్గిపోయిందని చెప్పుకోవాలి. ఒకప్పటి తారలైతే ఒక్క ఏడాదిలో 10కి పైగా సినిమాలు కూడా చేసేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఏడాది ఒక్క సినిమా చేయడమే మహా విషయం అవుతోంది. అయితే ఈ ఏడాది ఆ ఒక్క సినిమా కూడా చేయని కొందరు హీరోహీరోయిన్లు ఉన్నారు.
2022 లో ఖాతా తెరవని మరో స్టార్ హీరో అల్లు అర్జున్. గతేడాది పుష్ప సినిమాతో సూపర్ సక్సెస్ అందుకొని పాన్ ఇండియా క్రేజ్ కొట్టేసిన బన్నీ.. 2022 సంవత్సరంలో ఏ ఒక్క సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాలేదు. ఆయన చేస్తున్న పుష్ప 2 మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. 2023 చివర్లో ఈ సినిమా రిలీజ్ కానుందని టాక్.
ఇకపోతే ఏడాదికి కనీసం రెండు మూడు సినిమాలతో అలరించే మీడియం రేంజ్ హీరో సాయి ధరమ్ తేజ్ ఈ ఏడాది (2022) సైలెంట్ అయ్యారు. గతేడాది రిపబ్లిక్ సినిమాతో హిట్ అందుకున్న సాయి తేజ్.. ఆ తరవాత రోడ్డు ప్రమాదానికి గురై ఓ ఆరు నెలలు రెస్ట్ తీసుకున్నారు. ఇలా 2022 సంవత్సరంలో ఒక్క సినిమా కూడా చేయలేకపోయారు సాయి ధరమ్ తేజ్. ప్రస్తుతం విరూపాక్ష సినిమా చేస్తున్న ఈ హీరో వచ్చే ఏడాది వేసవిలో థియేటర్స్ లోకి రాబోతున్నారు.
2022 సంవత్సరంలో ప్రేక్షకులను పలకరించని మరో హీరో అక్కినేని అఖిల్. కెరీర్ ఆరంభం నుంచే కాస్త స్లోగా సినిమాలు చేస్తున్న ఈ యువ హీరో.. గతేడాది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో పలకరించి ఈ ఏడాది రెస్ట్ తీసుకున్నారు. ఆయన చేస్తున్న ఏజెంట్ సినిమాను ఈ ఏడాది రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు కానీ సాధ్యపడలేదు. దీంతో 2022లో బోణీ కొట్టని హీరోల జాబితాలో అఖిల్ చేరిపోయారు.