Balakrishna - Mahesh Babu - Allu Arjun: హాట్రిక్ కాంబినేషన్స్‌తో ప్రేక్షకులకు ముందుకు వస్తోన్న బాలయ్య, బన్ని, మహేష్.. బాలకృష్ణ, బోయపాటి శ్రీనుతో ‘అఖండ’తో పలకరించనున్నారు.మరోవైపు అల్లు అర్జున్, సుకుమార్‌తో ‘పుష్ప’ సినిమాతో రానున్నారు. ఇక మహేష్ బాబు కూడా చాలా యేళ్ల తర్వాత త్రివిక్రమ్‌తో హాట్రిక్ కాంబినేషన్‌కు రెడీ అయ్యారు. (Twitter/Photo)
ప్రస్తుతం టాలీవుడ్ హీరోలందరు తమకు గతంలో హిట్టిచ్చిన దర్శకులతో పనిచేయడానికి ఇంట్రెస్ట్ చూపెడుతున్నారు. వీళ్ల బాటలోనే మరికొంత మంది హీరోలు, దర్శకులు ముచ్చటగా తమకు హిట్టిచ్చిన దర్శకులతో ముచ్చటగా మూడోసారి పనిచేస్తూ హాట్రిక్ పై కన్నేసారు. కొంత మంది రెండోసారి తమకు హిట్టిచ్చిన దర్శకులతో పనిచేస్తున్నారు. అందులో బాలకృష్ణ, అల్లు అర్జున్,ఎన్టీఆర్, రామ్ చరణ్ సహా చాలా మంది హీరోలున్నారు. (Twitter/photos)
‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ తర్వాత మరోసారి వెంకటేష్ శ్రీకాంత్ అడ్డాల కాంబినేషన్లో ‘నారప్ప’ సినిమా చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ కూడా కంప్లీట్ అయింది. ఈ సినిమా ఓటీటీ వేదిక విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఈ విషయమై మరోసారి నిర్మాతలు ఆలోచనలో పడ్డట్టు సమాచారం. (Twitter/Photo)