Balakrishna - Allu Arjun : బాలకృష్ణ అన్‌స్టాపబుల్ షోలో అల్లు అర్జున్.. అఖండతో పుష్పరాజ్ తగ్గేదేలే.. అంటున్నారు. తాజాగా వీళ్లిద్దరి ఎపిసోడ్‌కు ఎపుడు ప్రసారం అవుతుందో ఆహా టీమ్ వెల్లడించింది. నందమూరి బాలకృష్ణ.. ప్రస్తుతం సినిమాలు, రాజకీయాలతో ఫుల్లు బిజీగా ఉన్నారు. మరోవైపు బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహిస్తూనే .. ఇంకోవైపు ఆహా ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ వేదికగా యాంకర్‌గా మారి సెలబ్రిటీలను ఇంటర్వ్యూలు చేస్తున్న సంగతి తెలిసిందే కదా. (Twitter/Photo)
రీసెంట్గా నట సింహా నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ‘అఖండ’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హాజరైన సంగతి తెలిసిందే కదా. ఈ ఈవెంట్లో అల్లు అర్జున్ మాట్లాడుతూ.. వయసులో కాకపోయినా సీనియారిటీలో బాలయ్య గారు ఫాదర్ ఫిగర్, అఖండ ప్రీరిలీజ్ ఫంక్షన్‌కు రావడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. బాలకృష్ణ డైలాగులు చెప్పే విధానం తనకు ఎంతో నచ్చుతుందని.. మూడు పేజీల డైలాగులైన బాలయ్యలా అందరికీ సాధ్యం కాదని చెప్పి బాలయ్య అభిమానుల మెప్పు పొందారు. (Twitter/Photo)
ఇక అన్న ఎన్టీఆర్ గారి కిచెన్ లోకి అల్లు రామలింగయ్య గారు నేరుగా వెళ్లిపోయేవారని తెలిపారు. ఆయన ఇంకా మాట్లాడుతూ సీనియారిటీలో బాలయ్య నాకు తండ్రిలాంటి వారని తెలిపారు అల్లు అర్జున్. ఇక ఈ డిసెంబర్ బాలయ్యతో పాటు బన్నికి బాగానే కలిసొచ్చిందనే చెప్పాలి. డిసెంబర్ 2న విడుదలైన బాలకృష్ణ ‘అఖండ’లో టైటిల్ పాత్రతో పాటు మరో క్యారెక్టర్లో నటించారు. (Twitter/Photo)
ముఖ్యంగా ‘అఖండ’ పాత్రలో బాలకృష్ణ నట విశ్వరూపం చూపించారు. ఈ సినిమాలో బాలయ్యను తప్ప మరే హీరోను ఊహించుకోవడం కష్టమే అంటున్నారు అభిమానులతో పాటు సామాన్య ప్రేక్షకులు. ఇక ఈ సినిమాను హిందీలో రీమేక్ చేస్తున్నట్టు వార్తలు కూడా వస్తున్నాయి. ఇప్పటికే హిందీ డబ్బింగ్‌తో పాటు రీమేక్ రైట్స్ మంచి రేటుకే అమ్ముడు పోయాయి. ఇక బాలీవుడ్లో బాలయ్య రేంజ్లో అఘోరగా పర్ఫామెన్స్ ఇవ్వడం అంతగా ఈజీగా కాదంటున్నారు ఫిల్మ్ క్రిటిక్స్. (Twitter/Photo)
‘అఖండ’ సినిమాలో నటనకు బాలయ్యకు జాతీయ ఉత్తమ నటుడి అవార్డు పక్కా అంటున్నారు అభిమానులతో పాటు ఫిల్మ్ క్రిటిక్స్ సైతం. అంతలా ఆ పాత్రలో లీనమై నటించారు బాలకృష్ణ. ఈ సినిమా బాలయ్య కెరీర్లోనే హైయ్యెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది. ఇప్పటికే రూ. 100కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించి పుష్ప సినిమాకు ధీటుగా కలెక్షన్స్ కొల్లగొడుతోంది. (Twitter/Photo)
ఇక ‘అఖండ’ విడుదలైన 15 రోజుల గ్యాప్‌లో అల్లు అర్జున్.. ‘పుష్ప’రాజ్‌గా బాక్సాఫీస్ పై దండెత్తాడు. అంతేకాదు ఈ సినిమాలో బన్ని తన కెరీర్లో అత్యుత్తమ నటన కనబరిచారు. ఈ సినిమా ఇప్పటికే రూ. 92 కోట్ల షేర్ సాధించి మిగతా భాషల్లో కూడా సత్తా చాటుతోంది. ‘పుష్ఫ’లో కూడా అల్లు అర్జున్.. నేషనల్ అవార్డు వచ్చేంత పర్ఫామెన్స్ చేసాడనే చెప్పాలి. (Twitter/Photo)
మొత్తంగా బాలకృష్ణ, అల్లు అర్జున్ తమ ఫిల్మ్ కెరీర్‌కు సంబందించిన 2021 డిసెంబర్ నెల ప్రత్యేకమనే చెప్పాలి. వీళ్లిద్దరు తమ కెరీర్లో అత్యుత్తమ నటనను కనబరిచారు. వీళ్లిద్దరు ఇపుడు మరోసారి కలిసి అభిమానులను కనువిందు చేయనున్నారు. బాలయ్య హోస్ట్‌గా అల్లు అర్జున్ గెస్ట్‌గా అన్‌స్టాపబుల్ విత్ NBK ఈ నెల 25న ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ఈ ఎపిసోడ్ కోసం నందమూరి అభిమానులతో పాటు అల్లు అర్జున్ మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. (Twitter/Photo)