Balakrishna - Allu Arjun: హాట్రిక్ కాంబినేషన్స్‌తో ప్రేక్షకులకు పలకరిస్తున్నారు. ఇప్పటికే బాలకృష్ణ, బోయపాటి శ్రీనుతో ‘అఖండ’తో పలకరించారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచింది. అంతేకాదు రూ. 100 కోట్ల గ్రాస్ క్రాస్ చేసింది. మరోవైపు అల్లు అర్జున్, సుకుమార్‌తో ‘పుష్ప’ సినిమాతో మరికొన్ని గంటల్లో పలకరించనున్నారు. (Twitter/Photo)
ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ.. బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘అఖండ’ సినిమా దుమ్ము దులుపుతోంది. ఇప్పటికే ఈ సినిమా విడుదలైన అన్ని చోట్ల బ్రేక్ ఈవెన్ అయింది. సింహా’, ‘లెజెండ్’ వంటి బ్లాక్ బస్టర్స్ తర్వాత వీళ్లిద్దరి కలయికలో వచ్చిన మూడో చిత్రం ‘అఖండ’. ఈ సినిమాను డిసెంబర్ 2న విడుదలై బ్లాక్ బస్టర్ అందుకుంది. (Twitter/Photo)(Twitter/Photo)
అల్లు అర్జున్ కూడా సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప’ సినిమాతో పలకరించనున్నారు. మరికొన్ని గంటల్లో ఈ సినిమా ప్రేక్షకులను పలకరించారు. ఈ మూవీ రెండు పార్టులుగా తెరకెక్కనుంది. ‘ఆర్య’, ‘ఆర్య 2’ తర్వాత అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్లో వస్తోన్న మూడో సినిమా. ఈ సినిమా ఎలాంటి ఫలితం అందుకుంటుందో చూడాలి. (Twitter/Photo)
‘పుష్ఫ’ రెండు భాగాల తర్వాత అల్లు అర్జున్.. మరోసారి దర్శకుడు బోయపాటి శ్రీనుతో మరో సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్‌ను బోయపాటి శ్రీను రెడీ చేసారు. రీసెంట్గా అల్లు అరవింద్.. బాలయ్యతో చేస్తోన్న ‘Unsttoppable With NBK’ లాంఛింగ్‌లో అధికారిక ప్రకటన చేసారు. (Twitter/Photo)
రాజమౌళి, ఎన్టీఆర్ కాంబినేషన్లో ‘ఆర్ఆర్ఆర్’ సినిమా వస్తోంది. ‘స్టూడెంట్ నెం.1, ‘సింహాద్రి’, యమ దొంగ తర్వాత ఇపుడు RRR 'సినిమా వస్తోంది. ఎన్టీఆర్ కూడా తన కెరీర్లో ఒక దర్శకుడితో నాల్గోసారి పని చేయడం ఇదే మొదటిసారి. ఈ సినిమా జనవరి 7న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. (Twitter/Photo) (Twitter/Photo)