నందమూరి నట సింహం బాలకృష్ణ (Balakrishna)ప్రధాన పాత్రలో మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను (Boyapati Srinu) దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ ఫిల్మ్ అఖండ (Akhanda). ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్గా, జగపతిబాబు, శ్రీకాంత్, పూర్ణ కీలక పాత్రలో నటించారు. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. Photo : Twitter
భారీ అంచనాల నడుమ ఈ చిత్రం డిసెంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా పదిరోజుల్లో 100 కోట్ల క్లబ్‌కి చేరి రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక అది అలా ఉంటే ఈ సినిమా ఓటీటీలో ప్రసారం ఎప్పుడు ఉండనుందో అనే విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చినీయాంశంగా మారింది. అఖండ డిజిటల్ రైట్స్‌ను డిస్నీ హాట్ స్టార్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. Photo : Twitter
అయితే ఇప్పుడు అఖండ సినిమాని సక్రాంతి కానుకగా తెలుగు ప్రేక్షకులకు జనవరి 12 నుంచి అందుబాటులోకి తీసుకురానున్నారట. అయితే ఈ విషయంలో త్వరలో అధికారిక సమాచారం తెలియాల్సి ఉంది. ఇక మరోవైపు అఖండ టెలివిజన్ ప్రిమియర్ విషయంలో కూడా సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. ఈ సినిమా శాటిలైట్స్ రైట్స్ దక్కించుకున్న స్టార్ మా.. అఖండ సినిమాను ఫిబ్రవరి 27 న ప్రసారం చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో కూడా అధికారిక సమచారం తెలియాల్సి ఉంది. Photo : Twitter
అఖండ హిందీ డబ్బింగ్ హక్కులను ప్రముఖ పంపిణీ సంస్థకు విక్రయించింది చిత్రబృందం. కేవలం హిందీ డబ్బింగ్ రైట్స్ నుంచి రూ. 20 కోట్లను అందాయని అంటున్నారు. మరోవైపు ఈ సినిమాను హిందీలో రీమేక్ కూడా చేస్తున్నారని.. ఈ రీమేక్‌లో అక్షయ్ లేదా అజయ్ దేవగన్ నటిస్తారని అంటున్నారు. ఈ విషయంలో అధికారిక సమాచారం తెలియాల్సి ఉంది. Photo : Twitter
బాలయ్య, బోయపాటి కాంబినేషన్లో ఇప్పటికే రెండు చిత్రాలు రాగా.. ఈ మూడవ చిత్రం కూడా మంచి విజయం దక్కించుకుంది. ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఈ సినిమా ఎన్టీఆర్ జయంతి మే 28న రిలీజ్ కావాల్సింది. కానీ కరోనా కారణంగా ఈ సినిమా విడుదలను వాయిదా వేసింది చిత్రబృందం. ఇక ఈ సినిమా డిజిటల్ శాటిలైట్ హక్కులను హాట్ స్టార్, స్టార్ దక్కించుకుంది. Photo : Twitter