నందమూరి నట సింహం బాలకృష్ణ (Balakrishna)ప్రధాన పాత్రలో మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను (Boyapati Srinu) దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ ఫిల్మ్ అఖండ (Akhanda). ఈ చిత్రంలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్గా, జగపతిబాబు, శ్రీకాంత్, పూర్ణ కీలక పాత్రలో నటించారు. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. భారీ అంచనాల నడుమ ఈ చిత్రం డిసెంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదలై బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. (Twitter/Photo)
బోయపాటి (Boyapati Sreenu) దర్శకత్వంలో ఈయన నటించిన అఖండ (Akhanda) సినిమా కలెక్షన్స్ చూసిన తర్వాత ట్రేడ్ పండితులు మాత్రమే కాదు.. కామన్ ఆడియన్స్ కూడా షాక్ అవుతున్నారు. బాలయ్య (Balakrishna) జూలు విదిలిస్తే ఇలా ఉంటుందా బాక్సాఫీస్ దగ్గర రచ్చ ఈ స్థాయిలో ఉంటుందా అనేలా మాస్ జాతర చూపించారు. చాలా సంవత్సరాల తర్వాత బాలయ్య సినిమా రికార్డు ఓపెనింగ్స్ తీసుకొచ్చింది. తాజాగా ఈ సినిమా టాలీవుడ్లో ఐదేళ్లుగా ఉన్న ఓ రికార్డును బీట్ చేసింది. (Twitter/Photo)
ఈ సినిమాలో మురళీకృష్ణ, శివుడు పాత్రల్లో బాలయ్య అద్భుతంగా నటించారు. ముఖ్యంగా అఘోర పాత్రలో అయితే అదిరిపోయాడు. ఆ పాత్ర బాలయ్య తప్ప ఇంకే హీరో కూడా చేయలేడంటూ నందమూరి ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. కామన్ ఆడియన్స్ కూడా బాలయ్య నటనకు ఫిదా అయిపోతున్నారు. లాజిక్స్ లేకపోయినా కూడా మాస్ మ్యాజిక్ ఈ సినిమాలో బాగానే పని చేిసంది. రూ. 54 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమా .. రూ. 63 కోట్ల షేర్ రాబట్టి అన్ని ఏరియాల్లో లాభాల్లోకి వచ్చింది. ఓవరాల్ గా గ్రాస్ వసూళ్లు రూ. 111 కోట్లకు చేరువలో ఉంది. (Twitter/Photo)
మొత్తంగా కరోనా సెకండ్ వేవ్ తర్వాత బడా స్టార్ హీరోలు తమ సినిమాలు రిలీజ్ చేయాలా వద్దా అనే ఆలోచనలో ఉన్న సమయంలో బాలయ్య ఎలాంటి బెరకు లేకుండా తన ‘అఖండ’ సినిమాను రిలీజ్ చేసి మిగతా బడా స్టార్ హీరోలకు భరోసా ఇచ్చారు. కంటెంట్ బాగుంటే.. ప్రేక్షకులు థియేటర్స్‌కు వస్తారనే విషయం ‘అఖండ’లో ప్రూవ్ చేసారు. ఒక రకంగా బాలయ్య ‘అఖండ’ సక్సెస్‌తో మిగతా హీరోలు ఊపిరి పీల్చుకుంటున్నారు. (Twitter/Photo)
దాదాపు ఐదేళ్ల తర్వాత కరోనా సెకండ్ వేవ్ తర్వాత అది కూడా ఏపీలో టిక్కెట్స్ రేట్స్ చాలా తక్కువ ఉన్న ఈ సమయంలో బాలయ్య లేటెస్ట్ మూవీ ‘అఖండ’ మూవీ రూ. 60 కోట్ల షేర్ సాధించింది అల్టిమేట్ రికార్డు సొంతం చేసుకుంది. ఒక రకంగా ఏపీలో బెనిఫిట్ షోలు, స్పెషల్ షోలు లేని టైమ్‌లో ఈ రికార్డు క్రియేట్ చేయడం నిజంగా అద్బుతం అంటున్నారు ట్రేడ్ పండితులు. (Twitter/Photo)